తెలంగాణ ప్రభుత్వం రాష్ట్రంలోని అర్హులైన రైతుల ఖాతాల్లోకి రైతు భరోసా పథకం అమౌంట్ ను జమ చేసింది.
ఇప్పటికే 5 ఎకరాలు అంత కంటే తక్కువ వ్యవసాయ భూమి ఉన్న రైతుల ఖాతాల్లోకి నిధులు విడుదల చేయగా, తాజాగా 5 ఎకరాలకు పైగా వ్యవసాయ భూమి ఉన్న రైతుల ఖాతాల్లో రైతు భరోసా మొత్తాన్ని కూడా జమ చేసింది.
రైతు భరోసా పథకం కింద ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు ఎకరాకు 15000 రూపాయలను ప్రతి ఏకరా కు జమ చేస్తుంది. 5 ఎకరాల కంటే ఎక్కువ భూమిని కలిగి ఉన్న రైతులు లేదా భూస్వాములకు రైతు భరోసా నిధులు కట్ చేస్తారని ప్రతి పక్షాలు విమర్శిస్తున్న నేపథ్యంలో, అందరికీ అమౌంట్ విడుదల చేసి ప్రతి పక్షాల విమర్శలకు ప్రభుత్వం చెక్ పెట్టింది.