కౌలు రైతులకు రైతు భరోసా జమ, స్టేటస్ ఈ లింక్ లో చూడండి

కౌలు రైతులకు రైతు భరోసా జమ, స్టేటస్ ఈ లింక్ లో చూడండి

ఆంధ్రప్రదేశ్ కౌలు రైతులకు గుడ్ న్యూస్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పీఎం కిసాన్ నిధులతో పాటు కౌలు రైతులకు వైయస్సార్ రైతు భరోసా అమౌంట్ ను ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి ఫిబ్రవరి 28 2024 న బటన్ నొక్కి విడుదల చేయడం జరిగింది. కౌలు రైతులకు కేంద్రం విడుదల చేసే పీఎం కిసాన్ నిధులు వర్తించవు కాబట్టి వారికి రాష్ట్ర ప్రభుత్వం రైతు భరోసా కింద నగదు జమ చేస్తూ వస్తుంది.

ఈ నిధులు విడుదల చేసి మూడు వారాల వరకు కౌలు రైతులకు సంబంధించిన అమౌంట్ జమ కాలేదని పలువురు రైతులు పేర్కొనడం జరిగింది. అయితే మార్చి 18 రాత్రి నుంచి రాష్ట్ర వ్యాప్తంగా కౌలు రైతులకు సున్నా వడ్డీ నిధులతో పాటు రాష్ట్ర ప్రభుత్వం అమౌంట్ జామ చేస్తున్నట్లు తెలిసింది.

తాజాగా ఇందుకు సంబంధించి వైయస్ఆర్ రైతు భరోసా అధికారిక లింక్ లో కౌలు రైతులకు 2000 రూపాయలు అమౌంటు పేమెంట్ స్టేటస్ ను కూడా రాష్ట్ర ప్రభుత్వం అప్డేట్ చేసింది.

కాబట్టి అర్హత ఉన్నటువంటి రైతులు రైతు భరోసా స్టేటస్ ను చెక్ చేసుకోవచ్చు లేదా నేరుగా బ్యాంక్ కి వెళ్లి తమ బ్యాంకు ఖాతాలో అమౌంట్ పడిందో లేదో తెలుసుకోవచ్చు.

వైయస్సార్ రైతు భరోసా కౌలు రైతులకు సంబంధించి మీ ఖాతాలో అమౌంట్ జమ అయిందా లేదా అనే వివరాలను మీ ఆధార్ నెంబర్ ను కింది అధికారిక లింకు లో ఎంటర్ చేసి తెలుసుకోవచ్చు.

ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా జమ చేసినటువంటి రైతు భరోసా ₹2000 రూపాయల అమౌంట్ పడినట్లయితే కింది విధంగా మీకు చూపిస్తుంది.

You cannot copy content of this page