మన జీవితంలో మనం డబ్బు సంపాదించి కొంత అమౌంట్ ను సేవింగ్ రూపంలో దాచుకుంటాం. అయితే సేవింగ్ చేసే మార్గాలలో మనం సాధారణంగా ఫిక్స్డ్ డిపాజిట్లు లేదా రిస్క్ లేకుండా స్థిరమైన ఆదాయం వచ్చే మార్గాలను సురక్షితమైన వాటిగా భావిస్తుంటాము.
మరి మీరు డిపాజిట్ చేసే అమౌంట్ కి సాధారణంగా 6 నుంచి 9 శాతం వరకు వడ్డీ లభిస్తూ ఉంటుంది. అదే పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ లేదా ప్రభుత్వ బాండ్లు లేదా చిన్న మొత్తల పొదుపు పథకాలలో కూడా మనకి 7 నుంచి 9 % వరకు స్థిరమైన ఆదాయం వచ్చే అవకాశం ఉంటుంది.
అయితే చాలామందికి ఒక ప్రశ్న ఎప్పుడు మనసులో మెదులుతూ ఉంటుంది. అది ఏంటంటే మనం పెట్టే పెట్టుబడి ఎన్ని సంవత్సరాలు కి డబుల్ అంటే రెండింతలు అవుతుంది అని..
ఉదాహరణకు ఒక వ్యక్తి 7% వడ్డీతో ఈరోజున డిపాజిట్ చేస్తే అది ఎన్ని సంవత్సరాలు అవుతుందో మీకు తెలుసా? దీనికోసం చాలామంది క్యాలిక్యులేటర్లను లేదా పెద్ద పెద్ద లెక్కలను వాడుతూ ఉంటారు. ఇవన్నీ మనకు అవసరం లేదు. వీటన్నిటికీ సింపుల్ సొల్యూషన్ ఏంటంటే రూల్ ఆఫ్ 72.
మీ అమౌంట్ ఎన్ని ఏళ్లకు డబుల్ అవుతుందో సింపుల్ గా ఇలా తెలుసుకోండి
Rule of 72: ఈ రూల్ ఏం చెప్తుందంటే, మీరు స్థిరమైన వంటి కోసం ఏదైనా మొత్తాన్ని జమ చేసినట్లయితే మీరు జమ చేసిన అమౌంట్ తో సంబంధం లేకుండా మీరు సింపుల్ గా 72 ని మీ వడ్డీ శాతం తో భాగారిస్తే చాలు. మీ అమౌంట్ ఎన్ని ఏళ్లకు డబుల్ అవుతుందో తెలిసిపోతుంది.
Example: ఒక వ్యక్తి ఈరోజు తన వద్ద ఉన్నటువంటి లక్ష రూపాయలను 7% వడ్డీ కి డిపాజిట్ చేస్తే ఎన్ని సంవత్సరాలకు రెట్టింపు అవుతుందో ఇప్పుడు చూద్దాం.
72 divided by 7% = 72/7 = 10.2 years (approx) – అంటే లక్ష రూపాయలు రెండు లక్షలు అవ్వడానికి సుమారు 10 సంవత్సరాల 2 లేదా మూడు నెలలు పడుతుంది.
ముఖ్య గమనిక: ఈ రూల్ సాధారణంగా అన్ని బ్యాంక్ డిపాజిట్లకు వర్తిస్తుంది. బ్యాంకులు compund interest పైన లెక్కిస్తారు. అంటే నిర్ణీత ఫ్రీక్వెన్సీ ప్రకారం మీ అమౌంట్ పై వచ్చే వడ్డీని తిరిగి డిపాజిట్ ఖాతాకే జమ చేయడం జరుగుతుంది. ఆ విధంగా జమ చేసిన మొత్తం పైన తదుపరి వడ్డీ అనేది లెక్కించబడుతుంది. వడ్డీని మెచ్యూరిటీ కంటే ముందే తీసుకుంటున్నట్లయితే మీ అమౌంట్ రెట్టింపు అయ్యే అవకాశం అయితే ఉండదు.