గ్రామ, వార్డు సచివాలయాల వ్యవస్థ ను రేషనలైజేషన్ (Rationalisation of Village Ward Secretariats ) చేసే దిశగా రాష్ట్ర ప్రభుత్వం ముందడుగు వేసింది. గ్రామ వార్డు సచివాలయ వ్యవస్థలో కీలక మార్పులు చేర్పులు చేపట్టనుంది.
రాష్ట్రంలో ఉండే చిన్న పంచాయతీలలో తక్కువ మంది సిబ్బందిని పెట్టీ, పెద్ద పంచాయతీలలో ఎక్కువ మంది సిబ్బందిని వినియోగించుకునేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. అదేవిధంగా రాష్ట్రం మొత్తాన్ని క్లస్టర్లుగా విభజించనుంది. మొత్తంగా అవసరాన్ని బట్టి 1.61 లక్షల మంది కార్యదర్శులను ప్రభుత్వం వినియోగించుకోవడం జరుగుతుంది.
గ్రామ సచివాలయాలలో తప్పనిసరిగా ఏఎన్ఎం వీఆర్వో డిజిటల్ అసిస్టెంట్ సంక్షేమ కార్యదర్శి మహిళా సంరక్షణ కార్యదర్శులు, వార్డు సచివాలయంలో పరిపాలన సానిటరీ విద్యా సంక్షేమ ఆరోగ్య మహిళ సంరక్షణ కార్యకర్తలు ఉండేలా ప్రతిపాదనలు ప్రతిపాదనలు అవకాశం ఉంది.
మిగిలిన వారందరినీ క్లస్టర్ వ్యవస్థలో వినియోగించుకోవాలని ప్రభుత్వం భావిస్తుంది. అదేవిధంగా పంచాయతీరాజ్ వ్యవస్థను బలోపేతం చేసే దిశగా రాష్ట్ర ప్రభుత్వం ముందుకెళ్తుంది. క్లస్టర్ వ్యవస్థ విధానంలో పంచాయతీరాజ్ వ్యవస్థను అనుసంధానం చేసే అవకాశముంది.
ఇక రాష్ట్రవ్యాప్తంగా గత ప్రభుత్వం సచివాలయాలలో రిజిస్ట్రేషన్ సేవలు ప్రారంభించగా ప్రజలు ఎక్కువగా ఆసక్తి కనబరచలేదు. ఈ నేపథ్యంలో గురువారం జరిగిన సమీక్ష సమావేశంలో ముఖ్యమంత్రి చర్చించారు. ఇకపై సచివాలయాలలో రిజిస్ట్రేషన్ సేవలను రద్దు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.