ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్… పన్ను చెల్లించే వారికి బంపర్ ఆఫర్

ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్… పన్ను చెల్లించే వారికి బంపర్ ఆఫర్

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నికలు సమీపిస్తున్న వేళ ప్రభుత్వం అనేక కీలక నిర్ణయాలను తీసుకుంటున్న విషయం తెలిసిందే. తాజాగా ఆస్తి పన్ను బకాయిలపై ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంటూ ఉత్తర్వులు జారీ చేసింది. అత్యధిక మొత్తంలో పెండింగ్ ఉన్న ఆస్తి బకాయిలపై వడ్డీని మాఫీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. వన్ టైం సెటిల్మెంట్ విధానం ద్వారా ఒకే సారి మొత్తం బకాయిలను చెల్లించిన వారికి వడ్డీ మాఫీ చేస్తామని ప్రకటించింది. ఈ మేరకు ఏపీ మున్సిపల్ అడ్మినిస్ట్రేటర్ డిపార్ట్మెంట్ ఉత్తర్వులు జారీ చేసింది.

రాష్ట్రంలోని భవనాలు, ఖాళీ స్థలాల ఆస్తి పన్ను బకాయలను మార్చి నెలాఖరులోగా ఒకేసారిగా చెల్లించిన వారికి ఈ వెసులుబాటు కల్పిస్తున్నట్టు ప్రభుత్వం ఉత్తర్వులలో పేర్కొంది. 2023-24 ఆర్థిక సంవత్సరం ఆస్తిపన్ను బకాయలను ఒకేసారి చెల్లించిన వారికి మాత్రమే ఈ వడ్డీ మాఫీ ఉంటుందని పేర్కొంది. అది కూడా కేవలం మార్చి 31వ తేదీ లాగా చెల్లించిన వారికే వర్తిస్తుంది. కావున రాష్ట్రంలోని ప్రజలు ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలని స్పెషల్ సీఎస్ శ్రీ లక్ష్మీ ఉత్తర్వులలో పేర్కొన్నారు.

సాధారణంగా ప్రభుత్వం ప్రతి ఏటా ద్వైవార్షికంగా అంటే ప్రతి ఆరు నెలలకు ఒకసారి ఆస్తి పన్ను వసూలు చేస్తూ ఉంటుంది. ఒకవేళ గడువులోగా ఎవరైనా ఈ పన్ను చెల్లించకపోతే ప్రభుత్వం రెండు శాతం వడ్డీ పెనాల్టీ రూపంలో వేస్తుంది. అయితే ప్రస్తుతం జారీ చేసిన ఉత్తర్వుల ప్రకారం, గత రెండేళ్లలో ఉన్నటువంటి ఆస్తి పన్ను బకాయిలను ఒకవేళ సదరు యజమాని ఒకేసారి మార్చి 31 లోపు చెల్లించినట్లయితే వారికి గత బకాయిలపై ప్రభుత్వం వేసినటువంటి వడ్డీని మాఫీ చేయడం జరుగుతుంది.

You cannot copy content of this page