ఇంటి నిర్మాణానికి 4 లక్షలు, పూర్తి వివరాలు

ఇంటి నిర్మాణానికి 4 లక్షలు, పూర్తి వివరాలు

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో ఇల్లు నిర్మించుకునే వారికి గుడ్ న్యూస్. రాష్ట్ర వ్యాప్తంగా గృహ నిర్మాణానికి గాను తెలుగుదేశం మరియు కేంద్ర ప్రభుత్వం సంయుక్తంగా లబ్ధిదారులకు నాలుగు లక్షల రూపాయలు అందించనుంది.

నాలుగు లక్షల రూపాయలు ఇలా ఇస్తారు

ప్రధానమంత్రి ఆవాస్ యోజన 2.0 అర్బన్ పథకం అనగా పట్టణ ప్రాంతాల్లో ఇల్లు నిర్మించాలనుకునే వారికి ఈ పథకం వర్తిస్తుంది. ఈ పథకానికి సంబంధించి ఇటీవల కేంద్ర ప్రభుత్వం అన్ని రాష్ట్రాలకు రాష్ట్ర వాటాను కూడా ఖరారు చేయాలని ఆదేశాలు జారీ చేసింది.

గత ప్రభుత్వ హయాంలో పల్లెల్లో కేంద్ర ప్రభుత్వం ఇచ్చే నిధులతోనే పేదలందరికీ ఇల్లు పథకాన్ని అమలు చేసినటువంటి ప్రభుత్వం, పట్టణ ప్రాంతాల్లో కేవలం 30000 రాష్ట్ర వాటాగా ఇవ్వడం జరిగింది. మొత్తంగా 1,80,000 మాత్రమే అప్పట్లో లబ్ధిదారులకు వచ్చేవి.

అయితే ఇక పైన పట్టణ ప్రాంతాల్లో ఉండే ప్రజలకు కేంద్ర ప్రభుత్వం ద్వారా 2.5 లక్షలు, రాష్ట్ర ప్రభుత్వం ద్వారా 1.5 లక్షలు మొత్తంగా నాలుగు లక్షల రూపాయలు అందనున్నాయి.

వీటికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపిన తర్వాత పూర్తి విధివిధానాలు రాష్ట్ర ప్రభుత్వం జారీ చేయనుంది.

దీంతో ఆంధ్ర ప్రదేశ్ లో పట్టణ గృహ నిర్మాణ లబ్ధిదారులకు చాలా ఊరట చేకూరనుంది.

దీంతోపాటు గ్రామాల్లో ఉండే పేదలకు కూడా ఇంటి నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం పీఎం ఆవాస్ కింద నిధులు అందించనుంది.

దేశవ్యాప్తంగా 3 కోట్ల ఇల్లు

దేశవ్యాప్తంగా మూడు కోట్ల ఇల్లు నిర్మించనున్నట్లు ప్రధానమంత్రి ఇటీవల వెల్లడించారు. ఇందులో భాగంగా పట్టణ ప్రాంతాల్లో ఉండే పేదలకు నేరుగా కోటి ఇళ్లను ప్రభుత్వం త్వరలో కేటాయించనుంది. ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి పట్టణాభివృద్ధి సంస్థల పరిధిలోకి వచ్చే పేదలకు 4 లక్షలు ఈ పథకం కింద అందించనున్నారు. ఇప్పటికే ఇల్లులేని వారికి మాత్రమే ఈ పథకం వర్తిస్తుంది. కొత్తగా నిర్మించుకునే వారికి మాత్రమే ఈ వెసులుబాటు కల్పించారు. నాలుగు లక్షలకు అదనంగా 30 వేల రూపాయలు పట్టణాభివృద్ధి సంస్థల పరిధిలో ఉన్నటువంటి వారికి అందించనున్నారు. అదనంగా ఇచ్చే 30 వేల రూపాయలు ఉపాధి హామీ పథకం కింద అందిస్తారు.

పీఎం ఆవాస్ పథకం అర్హతలు

ఆంధ్ర ప్రదేశ్ లో నాలుగు లక్షలు పొందాలనుకునేవారు ఆంధ్రప్రదేశ్ శాశ్వత నివాసి అయి ఉండాలి.

  • వారి పేరు మీద ఎటువంటి ఇల్లు ఉండకూడదు.
  • సరైన ఆధార్ కార్డు, రేషన్ కార్డ్, బ్యాంక్ పాస్ పుస్తకం వంటి డాక్యుమెంట్స్ అవసరం.
  • తెల్ల రేషన్ కార్డు లేదా బిపిఎల్ లేదా ఆర్థికంగా వెనుకబడిన కుటుంబాలకు మాత్రమే ఇది వర్తిస్తుంది.
  • ప్రభుత్వ ఉద్యోగస్తులు ఇన్కమ్ టాక్స్ చెల్లింపు దారు ఇందుకు అర్హులు కాదు.

మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన వాట్సప్ ఛానల్ లో జాయిన్ అవ్వండి.

You cannot copy content of this page