ఇకపై వారికి పెన్షన్ బ్యాంకు ఖాతాలోనే.. ప్రభుత్వం కీలక నిర్ణయం

ఇకపై వారికి పెన్షన్ బ్యాంకు ఖాతాలోనే.. ప్రభుత్వం కీలక నిర్ణయం

ఏపీ ప్రభుత్వం పెన్షన్ పంపిణీకి సంబంధించి కీలక నిర్ణయం తీసుకుంది. ప్రతినెల ఒకటవ తేదీని పెన్షన్ అమౌంట్ అందిస్తున్న విషయం తెలిసిందే.

అయితే వసతి గృహాలు గురుకులాల్లో చదువుకొనే దివ్యాంగ విద్యార్థులు ప్రతినెలా పెన్షన్ కోసం తమ సచివాలయం పరిధిలోకి వెళ్లి నగదు తీసుకోవాల్సిన పరిస్థితి ఉంది. దీనివల్ల కొంతమందికి దూరా భారమే చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

ఈ సమస్యలను పరిగణలోకి తీసుకున్న ప్రభుత్వం ఇకపై వారికి పెన్షన్ అమౌంట్ ను నేరుగా వారి బ్యాంకు ఖాతాలోనే జమ చేయాలని నిర్ణయం తీసుకుంది.

ఈ మార్పు నవంబర్ నెల ఒకటో తేదీ నుంచి అమలులోకి రానుంది. ఇకపై దివ్యాంగులు పెంచిన అమౌంట్ కోసం తమ సొంత ఊరికి వెళ్లవలసిన అవసరం లేదు. ప్రతినెల 1వ తేదీన వారి అకౌంట్లో ప్రభుత్వం పెన్షన్ అమౌంట్ ను ప్రభుత్వం జమ చేయనుంది.

ఈ నిర్ణయం ద్వారా రాష్ట్రంలోని 8.50 లక్షల మంది పెనన్ లబ్ధిదారులలో 10 వేల మంది విద్యార్థులకు లబ్ధి చేకూరుతుందని ప్రభుత్వం తెలిపింది.

Pension Distribution Modifications GO

పెన్షన్ పంపిణీ సమయంలో ఉపయోగపడే మొబైల్ అప్లికేషన్ లు

You cannot copy content of this page