ఆంధ్రప్రదేశ్ లో గ్రామ వార్డు వాలంటీర్ల కు రోజుకో షాక్ తగులుతుంది. కొత్తగా ఏర్పాటు అయిన తెలుగుదేశం కూటమి ప్రభుత్వం వాలంటీర్లను కొనసాగిస్తామని ప్రకటించినప్పటికీ పెన్షన్ పంపిణీ నుంచి వాళ్లను పక్కన పెడుతూ ఇటీవల నిర్ణయం తీసుకుంది.
అదేవిధంగా పెన్షన్ పంపిణీ ఇకపై సచివాలయం సిబ్బందికి అప్పగించింది. దీంతో ఒకింత షాక్ కి గురైన వాలంటీర్లు తమకు ఎలాంటి పని అప్పగిస్తారు, అదేవిధంగా వారిని కంటిన్యూ చేస్తారా లేదా అని ఆందోళనలో ఉన్నట్లు తెలుస్తుంది.
ఇదిలా ఉండగా వాలంటీర్లకు మరో షాకింగ్ న్యూస్ తాకింది. వాలంటీర్లను తొలగించాలని కోరుతూ ఏపీ హైకోర్టులో పిటిషన్ దాఖలు అయింది. వాలంటీర్లను నియమించేటప్పుడు రిజర్వేషన్ నిబంధనను పాటించలేదని వారి నియామకం సరిగా జరగలేదని పేర్కొంటూ ఈ పిటిషన్ హైకోర్టులో దాఖలు అయింది.
పిటీషన్ పై విచారణ చేపట్టిన ఏపీ హైకోర్టు వెంటనే కౌంటర్ దాఖలు చేయాలని ఏపీ ప్రభుత్వానికి నోటీసులు పంపించింది.
ఎన్నికల సమయంలో సుమారు 64000 మంది వాలంటీర్లు రాజీనామా చేసినట్లు సమాచారం. రాజీనామా చేసిన వారిని ప్రస్తుత ప్రభుత్వం తీసుకోలేదు. తమను గత ప్రభుత్వ అధికారులు ఒత్తిడికి గురిచేసి రాజీనామా చేయించారు అని చెప్పినప్పటికీ కూడా ప్రస్తుత ప్రభుత్వం వారిని వెనక్కు తీసుకోలేదు. ఉన్నవారిని కంటిన్యూ చేస్తామని మాత్రం ప్రకటించింది. అయితే వారికి ఎలాంటి బాధ్యతలు అప్పగిస్తారు అనే దాని పైన ఇంకా ప్రభుత్వం ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదు.
వాలంటీర్లకు ప్రతినెలా గత ప్రభుత్వం న్యూస్ పేపర్ కొనుక్కునేందుకు శాలరీతో పాటు ఇస్తున్నటువంటి అదనపు 200 రూపాయలను ప్రస్తుత ప్రభుత్వం కట్ చేసింది. ఇలా వరుస షాక్స్ తగులుతున్న నేపథ్యంలో అసలు తమను కంటిన్యూ చేస్తారా తమ భవితవ్యం ఏంటి అనే సందేహం వాలంటీర్లలో కలుగుతున్నట్లు తెలుస్తోంది. ఏది ఏమైనా వాలంటీర్లకు అసలు ఎలాంటి బాధ్యతలు అప్పగిస్తారు, వారికి చట్టబద్ధత కల్పిస్తారా లేదా ఈ అంశాలు ఇంకా తేలాల్సి ఉంది.