ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా పెన్షన్ పంపిణీ కార్యక్రమం కొనసాగుతున్న విషయం మనకు తెలిసిందే. ఎన్నికల కమిషన్ మరియు ప్రభుత్వ ఆదేశాల మేరకు ఏప్రిల్ మూడో తేదీ మధ్యాహ్నం నుంచి ప్రారంభమైనటువంటి పెన్షన్ పంపిణీ కార్యక్రమం ఇంకా పూర్తి కాలేదు.
ఈ నేపథ్యంలో ఈ కార్యక్రమాన్ని పొడిగించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది.
ఏప్రిల్ 8 వరకు పెన్షన్ పంపిణీ కార్యక్రమం
ఏప్రిల్ 3వ తేదీన కొంత ఆలస్యంగా ప్రారంభమైనటువంటి పెన్షన్ పంపిణీ కార్యక్రమం ఏప్రిల్ 6 వరకు పూర్తికాని పక్షంలో రాష్ట్ర ప్రభుత్వం సోమవారం అనగా ఏప్రిల్ 8 వరకు ఈ కార్యక్రమాన్ని పొడిగించడం జరిగింది.
ప్రభుత్వ ఆదేశాల మేరకు దివ్యాంగులు మరియు తీవ్ర అనారోగ్యంతో బాధపడే వారికి ఇంటి వద్దనే పెన్షన్ పంపిణీ చేస్తుండగా మిగిలిన వారందరికీ గ్రామ వార్డు సచివాలయాల పరిధిలో పెన్షన్ పంపిణీ కార్యక్రమం జరుగుతుంది.
ఏదైనా ప్రభుత్వ గుర్తింపు కార్డు తీసుకొని వెళ్లి వృద్ధులు మరియు ఇతర పెన్షన్ లబ్ధిదారులు సచివాలయం వద్ద పెన్షన్ నగదు పొందవచ్చు.
ప్రతినెల ఐదు రోజులపాటు పెన్షన్ పంపిణీ కార్యక్రమం వాలంటీర్ల ద్వారా నిర్వహిస్తూ వస్తున్నటువంటి ప్రభుత్వం ప్రస్తుత ఎన్నికల కోడ్ అమలులో ఉన్న నేపథ్యంలో సచివాలయాల సిబ్బంది ద్వారా ఈ కార్యక్రమాన్ని ఐదు రోజులపాటు అనగా ఏప్రిల్ 8 వరకు కొనసాగిస్తుంది.
పెన్షన్ పంపిణీకి సంబంధించినటువంటి అన్ని లింక్స్ కొరకు ఇక్కడ క్లిక్ చేయండి