జనవరి నుండి పింఛన్లను రూ. 3,000 కు పెంచిన ప్రభుత్వం..

జనవరి నుండి పింఛన్లను రూ. 3,000 కు పెంచిన ప్రభుత్వం..

ప్రతి నెలా పింఛన్లు తీసుకునేవారికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. ప్రస్తుతం ఇస్తున్న రూ. 2,750 పింఛన్ ను రూ. 3,000 కు పెంచుతున్నట్లు తెలిపింది. పెంచిన పింఛన్లను నూతన సంవత్సరం కానుకగా 2024 జనవరి 1 నుండి 8 వరకు ఇవ్వనున్నారు.

2019 లో వైఎస్సార్సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పుడు పింఛను రూ. 2,000 గా ఉంది. అయితే ఆ తర్వాత నుంచి ప్రతి ఏటా జనవరిలో రూ. 250 పెంచుతూ వస్తున్నారు. ఇప్పటివరకు మూడు సార్లు పెంచారు. దీంతో ప్రస్తుతం ఏపీలోని పింఛనుదారులు ప్రతినెలా రూ. 2,750 పొందుతున్నారు. ఇప్పుడు మరో రూ. 250 పెంచుతున్నట్లు చెప్పడంతో జనవరి నుంచి ప్రతి నెలా రూ. 3,000 తీసుకొనున్నారు.

వృద్ధులు, వితంతువులు, చేనేత, కల్లుగీత కార్మికులు, ఒంటరి మహిళలు, మత్స్య కార్మికులు, చర్మ కార్మికులు, ఎయిడ్స్ వ్యాధిగ్రస్తులు ప్రభుత్వం ప్రతి నెలా పింఛన్లు అందిస్తున్న విషయం తెలుస్తుందే. వచ్చే ఏడాది నుంచి వీరంతా రూ. 3,000 వేలు ప్రతి నెల పొందనున్నారు. కుల, మత, ప్రాంతం, పార్టీలతో సంబంధం లేకుండా అర్హులైన ప్రతి ఒక్కరికి ప్రభుత్వం అందించే సంక్షేమ పథకాలు చేరవేయాలని సీఎం జగన్ ఇప్పటికే పలుమార్లు అధికారులకు స్పష్టం చేశారు.

You cannot copy content of this page