విద్యాశాఖ పరిధిలోని పథకాల పేర్లు మారుస్తూ ఉత్తర్వులు జారీ

విద్యాశాఖ పరిధిలోని పథకాల పేర్లు మారుస్తూ ఉత్తర్వులు జారీ

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పలు పథకాల పేర్లు మార్చుతూ నిర్ణయం తీసుకుంది. పాఠశాల విద్యాశాఖ పరిధిలో అమలవుతోన్న ప్రభుత్వ పథకాలకు కొత్త పేర్లు పెట్టినట్టు విద్యా శాఖ మంత్రి నారా లోకేశ్‌ ఈ మేరకు ట్వీట్ చేసిన విషయం తెలిసిందే. తాజాగా ఇందుకు సంబంధించిన ఉత్తర్వులను ప్రభుత్వం జారీ చేసింది

పాఠశాల విద్యా శాఖలో అమలు చేస్తున్న ప్రభుత్వ పథకాల పేర్లను ఈ దిగువన వివరించిన విధంగా మారుస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది

S.NoName of the Scheme during 2019- 2024Revised Scheme Name
1.Jagananna Ammavodi“Thalliki Vandanam”
2.Jagananna Vidyeta Kanuka“Sarvepalli Radha Krishnan Vidyetarthi Mithra”
3.Jagananna Gorumudda“Dokka Seethamma Madhyhna Badi Bhojanam”
4.Mana Badi –Nadu NeduMana Badi-Mana Bhavishyetathu”
5.Swechha“Ballika Raksha”
6.Jagananna Animuthyetlu“Abdul Kalam Prathibha Puraskaram”

గనన్న అమ్మఒడి పేరును తల్లికి వందనంగా మార్చగా.. జగనన్న విద్యా కానుక పథకాన్ని ‘సర్వేపల్లి రాధాకృష్ణన్‌ విద్యార్థి మిత్ర’ అని పేరు పెట్టారు. అలాగే, జగనన్న గోరుముద్దను ‘డొక్కా సీతమ్మ మధ్యాహ్న బడి భోజనం’గా మార్పు చేశారు. మన బడి – నాడు నేడును ‘మన బడి – మన భవిష్యత్తు’ అని, స్వేచ్ఛ పథకాన్ని ‘బాలికా రక్ష’ అని, జగనన్న ఆణిముత్యాలును ‘అబ్దుల్‌ కలాం ప్రతిభా పురస్కారం’గా మార్చినట్టు ఉత్తర్వులలో పేర్కొన్నారు.

కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే పథకాల మార్పుపై ఉత్తర్వులు వెలువడ్డాయి. జగనన్న విద్యా దీవెన, వసతి దీవెనల పథకాల పేర్లను ‘పోస్ట్ మెట్రిక్ స్కాలర్‌షిప్’గా మార్చారు. ఎస్సీలకు అమలవుతున్న జగనన్న విద్యాదీవెన పథకం ‘అంబేద్కర్ ఓవర్సీస్ విద్యానిధి’గా.. వైఎస్సార్ కళ్యాణ మస్తు పేరును ‘చంద్రన్న పెళ్లి కానుక’గా.. వైఎస్సార్ విద్యోన్నతి పథకం పేరును ‘ఎన్టీఆర్ విద్యోన్నతి’గా మార్పు.. జగనన్న సివిల్‌ సర్వీసెస్‌ ప్రోత్సాహకం పేరును ‘సివిల్ సర్వీసెస్ పరీక్షల ప్రొత్సాహాకాలు’గా మార్చింది కొత్త ప్రభుత్వం.

మధ్యాహ్న భోజనానికి డొక్కా సీతమ్మ పేరు పెట్టడం సమంజసమే. అన్నపూర్ణ దేవి అంటే ఎలా ఉంటుందో తెలియదు కానీ.. అన్నపూర్ణ దేవీ అంటే ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో డొక్క సీతమ్మ గురించి చెప్పుకుంటాం. అర్థరాత్రి సమయంలో వర్షంలో తడిసిన ఓ వ్యక్తి అమ్మా సీతమ్మ తల్లి .. ఆకలేస్తుందమ్మా అని పిలవగానే ఎంతో ఆప్యాయంగా వంటచేసి భోజనంపెట్టి , వస్త్రాలు ఇవ్వగలిగిన గొప్ప మానవతా మూర్తి డొక్కాసీతమ్మ తల్లి. ఆంధ్రుల కీర్తిని ఇంగ్లండు వరకు వ్యాపింపజేసిన మహా ఇల్లాలు సీతమ్మ . అన్నం పెట్టేటప్పుడు ఆమె చూపే మాతృప్రేమ మరువరానిది.

You cannot copy content of this page