NTR భరోసా పెన్షన్ల కు సంబందించి ప్రభుత్వం పెంచిన పెన్షన్ అమౌంట్ వివరాలతో ఆదేశాలు జారీ చేసింది. దిగువ తెలిపిన పది రకాల పెన్షన్లు 3000/- రూ. ల నుండి 4000/- రూ లకు పెంచడం జరిగింది అలాగే వికలాంగుల పెన్షన్ 3000/- రూ. ల నుండి 6000/- రూ లకు పెంచడం జరిగింది.
- పెన్షన్ పంపిణీ గైడ్లైన్స్ ప్రకారం మొత్తం పెన్షన్లు 1 వ తేదీలోనే ఇచ్చేయాలి. 1వ తేదీన ఏదైనా అనివార్య కారణాల వలన మిగిలిన పెన్షన్స్ 2 వ తేదీలోపు ఎట్టి పరిస్థితుల్లో అయిన పూర్తి చేయాలి.
- ఒక సచివాలయ ఎంప్లాయ్ తన లాగిన్ లో 50 మంది కంటే ఎక్కువ పెన్షన్స్ ఇచ్చుటకు వీలుపడదు.
- స్టాఫ్ వేరే చోట ఉన్నట్లు అయితే అనగా డెప్యూటషన్ లో ఉన్న వారు లేక సిబ్బంది తక్కువగా ఉన్న చోట్ల గవర్నమెంట్ ఉద్యోగులు కానీ వారు అనగా కాంట్రాక్ట్ ఎంప్లాయిస్, అంగన్వాడీ , ఆశ వర్క్స్ ని కూడా వినియోగించుకోవచ్చును. వీళ్ళకి లాగిన్స్ మండల ప్రజా పరిషత్ వారి లాగిన్ లో ఉండును.
- ఈ నెల చివరి తేదీన పంచాయతీ కార్యదర్శి మరియు వెల్ఫేర్ అసిస్టెంట్ ఇద్దరు కూడా పెన్షన్ అమౌంట్ విత్ డ్రా చేసి సంబంధిత సిబ్బంది కి ముందుగానే ఇవ్వవలెను.
- ఏప్రిల్ నెల నుంచి పెన్షన్ అమౌంట్ 4000 కి ఎలక్షన్ ప్రచార టైం లో ఇచ్చినందున ఆ 3 నెలల పెరిగిన అమౌంట్ తో ఈ నెల 7000 రూపాయలు సిబ్బంది జులై ఫస్ట్ పెన్షన్ దారునికి ఇచ్చేదెరు.
- హెచ్.ఐ.వి మరియు వేరే ఊరులో చదువుకుంటున్న అంగవైకల్యం గల పిల్లలకి డి.బి.టి మోడ్ లో నే ఇవ్వడం జరుగును.
కింద పేర్కొన్న పెన్షన్ లబ్ధిదారులకు 4000 ఇవ్వాల్సి ఉంటుంది.
- వృద్ధాప్య
- వితంతు
- చేనేత కార్మికులు
- ఒంటరి మహిళా
- మత్యకార
- డప్పు కాళకారులు
- కల్లుగీతా
- చర్మకారులు
- Transgender
- చేనేత
- HIV/ART
పెంచిన పెన్షన్ వివరాలు
S.No | Category | Present Rate of Pensions (Rs.) | Enhanced Pension Rate (Rs.) |
I. ENHANCEMENT OF PENSION FROM Rs.3000/- TO Rs.4000/- | |||
1 | వృద్ధాప్య పెన్షన్ | 3000 | 4000 |
2 | వితంతువు | 3000 | 4000 |
3 | చేనేత కార్మికులు | 3000 | 4000 |
4 | కళ్లు గీత కార్మికులు | 3000 | 4000 |
5 | మత్స్యకారులు | 3000 | 4000 |
6 | ఒంటరి మహిళలు | 3000 | 4000 |
7 | సాంప్రదాయ చెప్పులు కుట్టేవారు | 3000 | 4000 |
8 | ట్రాన్స్ జెండర్ | 3000 | 4000 |
9 | ART(PLHIV) | 3000 | 4000 |
10 | డప్పు కళాకారులు | 3000 | 4000 |
11 | కళాకారులకు పింఛన్లు | 3000 | 4000 |
II. ENHANCEMENT OF DISABLED PENSIONS FROM Rs 3000/- TO Rs.6000/- | |||
12 | వికలాంగులు | 3000 | 6000 |
13 | బహుళ వైకల్యం కుష్టు వ్యాధి | 3000 | 6000 |
III. పూర్తి అంగవైకల్య వికలాంగుల పెన్షన్ Rs.15000/- | |||
14 | పక్షవాతం వచ్చిన వ్యక్తి, వీల్ చైర్ లేదా మంచానికి పరిమితం అయిన వారు | 5000 | 15000 |
15 | తీవ్రమైన మస్కులర్ డిస్ట్రోఫీ కేసులు మరియు ప్రమాద బాధితులు | 5000 | 15000 |
IV. CHRONIC DISEASES LIKE KIDNEY, THALASSEMIA etc. | |||
16 | ద్వైపాక్షిక ఎలిఫెంటియాసిస్-Grade 4 | 5000 | 10000 |
17 | కిడ్నీ, కాలేయం మరియు గుండె మార్పిడి | 5000 | 10000 |
18 | CKDU Not on Dialysis CKD Serum creatinine of >5mg | 5000 | 10000 |
19 | CKDU Not on Dialysis CKD Estimated GFR <15 ml | 5000 | 10000 |
20 | CKDU Not on Dialysis CKD Small contracted kidney | 5000 | 10000 |
V. OTHER CATEGORIES | |||
21 | CKDU on Dialysis Private | 10000 | No Change |
22 | CKDU on dialysis GOVT | 10000 | |
23 | సికిల్ సెల్ వ్యాధి | 10000 | |
24 | తలసేమియా | 10000 | |
25 | తీవ్రమైన హీమోఫిలియా (<2% of factor 8 or 9) | 10000 | |
26 | సైనిక్ సంక్షేమ పెన్షన్ | 5000 | |
27 | అభయహస్తం | 500 | |
28 | అమరావతి భూమి లేని నిరుపేదలు | 5000 |
అర్హత ప్రమాణాలు
పెన్షన్ | అర్హతలు |
---|---|
వృద్ధాప్య పెన్షన్ | 60 సంవత్సరాలు మరియు ఆపై వయస్సు కలవారు అర్హులు. గిరిజనులు 50 సంవత్సరాలు ఆపై వయస్సు కలవారు అర్హులు |
వితంతు పెన్షన్ | వివాహ చట్టం ప్రకారం 18 సంవత్సరాలు ఆ పై వయస్సు కలవారు. భర్త మరణ ధ్రువీకరణ పత్రం లేదా డెత్ సర్టిఫికెట్ కలిగి ఉండాలి |
వికలాంగుల పెన్షన్ | 40% మరియు అంతకన్నా ఎక్కువ వికలత్వం కలిగి ఉన్నవారు మరియు సదరం సర్టిఫికెట్ కలిగి ఉన్న వారు. వీరికి వయోపరిమితి లేదు |
చేనేత కార్మికుల పెన్షన్ | వయస్సు 50 సంవత్సరాలు మరియు యు ఆ పైన కలవారు. చేనేత మరియు జౌళి శాఖ వారిచే గుర్తింపు పత్రం కలిగినవారు |
కల్లు గీత కార్మికుల పింఛన్ | వయస్సు 50 సంవత్సరాలు మరియు ఆపైన కలవారు. ఎక్సైజ్ శాఖ వారిచే గుర్తింపు పత్రం కలిగినవారు. |
మత్స్యకారుల పెన్షన్ | వయస్సు 50 సంవత్సరములు మరియు ఆ పైన కలవారు. మత్స్య శాఖ వారిచే గుర్తింపు పత్రం కలిగినవారు. |
హెచ్ఐవి(PL HIV) బాధితులు పెన్షన్ | వయో పరిమితి లేదు. ఆరు నెలలు వరుసగా ART treatment Therapy(యాంటీ రిట్రో వైరల్ థెరపీ) తీసుకున్నవారు. |
డయాలసిస్ (CKDU) పెన్షన్ | వయస్సుతో సంబంధం లేకుండా ప్రభుత్వ హాస్పిటల్స్ మరియు వైఎస్సార్ ఆరోగ్యశ్రీ పథకం ద్వారా ప్రైవేట్ హాస్పిటల్స్ లో డయాలసిస్ తీసుకుంటూ ఉన్నవారు. ( స్టేజ్ 3, 4 & 5) వయో పరిమితి లేదు. |
ట్రాన్స్ జెండర్ పెన్షన్ | 18 సంవత్సరాలు ఆ పైన వయస్సు కలవారు. ప్రభుత్వ వైద్య ఆరోగ్య శాఖ వారి ధ్రువీకరణ పత్రం కలిగినవారు. |
ఒంటరి మహిళ పెన్షన్ | వయస్సు 35 సంవత్సరాలు మరియు ఆపైన కలిగి ఉండి, చట్ట ప్రకారం భర్త నుండి విడాకులు పొందినవారు, భర్త నుండి విడిపోయిన వారు (విడిపోయిన కాలవ్యవధి ఒక సంవత్సరం పైగా ఉండాలి.) గ్రామీణ మరియు పట్టణ ప్రాంతాలలో నివసిస్తున్న వారు, భర్త నుండి విడిపోయినట్లు గా ఎటువంటి ధ్రువీకరణ పత్రం లేనివారు గ్రామ / వార్డు స్థాయిలో ప్రభుత్వ అధికారుల సాక్షాలతో తాసిల్దారుగారి ధ్రువీకరణ పత్రం పొంది ఉండాలి. అవివాహితులుగా ఉండి ఎటువంటి ఆదరణ లేకుండా ఒంటరిగా జీవిస్తూ ఉన్న వారు, గ్రామాలలో ఉన్న వారికి వయస్సు 30 సంవత్సరములు మరియు పట్టణ ప్రాంతంలో ఉన్న వారికి వయస్సు 35 సంవత్సరాలు, ఆపైన కలిగి ఉండాలి. పెన్షన్ మంజూరు అనంతరం వారు వివాహం చేసుకుని ఉన్నా లేదా ఆర్ధిక పరముగా జీవనోపాధి పొందిన తక్షణమే పెన్షను నిలిపి వేసే బాధ్యత సంబంధిత పెన్షన్ పంపిణీ అధికారి వారికి అనుమతి ఉన్నది. (ప్రతి నెల పెన్షన్ పంపిణీ అధికారి ఆమె పరిస్థితి పరిశీలించాలి.) |
డప్పు కళాకారుల పెన్షన్ | వయస్సు 50 సంవత్సరంలు మరియు ఆ పైన కలవారు. సాంఘిక సంక్షేమ శాఖ వారిచే గుర్తింపు పొందిన వారై ఉండాలి. |
చర్మకారుల పెన్షన్ | వయసు 40 సంవత్సరాలు మరియు ఆ పైన కలవారు. లబ్ధిదారుల జాబితా సాంఘిక సంక్షేమ శాఖ అందజేస్తుంది. |
అభయ హస్తం పెన్షన్ | స్వయం సహాయక సంఘాల సభ్యులు ఎవరైతే అభయహస్తం పథకంలో వారి కాంట్రిబ్యూషన్ చెల్లించి ఉండి, 60 సంవత్సరాల వయస్సు కలవారు. |