ప్రభుత్వ భవనాల పైకప్పులపై సౌర ఫలకాలను అమర్చేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం NTPCతో ఒప్పందం చేసుకుంది.
300 మెగా వాట్ల సౌర ఫలకాలను భవనాల అంతటా అమర్చే కీలక ఒప్పందాన్ని ముఖ్యమంత్రి సమక్షంలో జరిగింది. దీనివల్ల వచ్చే 25 సంవత్సరాల్లో ప్రతి సంవత్సరం దాదాపు 118.27 కోట్ల విద్యుత్ ఖర్చు ఆదా అవుతుంది.
ఈ ప్రాజెక్టు ద్వారా ఏటా 3.41 లక్షల టన్నుల కర్బన ఉద్గారాలను తగ్గించవచ్చని ప్రభుత్వం వెల్లడించింది. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సమక్షంలో AP nredcap మరియు NTPC ఈ ఒప్పందం చేసుకున్నాయి.
ఈ కీలక ప్రాజెక్టు కింద వచ్చే 25 సంవత్సరాలలో మొత్తం 2957 కోట్ల రూపాయల మేర విద్యుత్ ఖర్చు ఆదావుతుందని ముఖ్యమంత్రి వెల్లడించారు. రాబోయే పాతిక సంవత్సరాలలో 85. 25 లక్షల టన్నుల కర్బన ఉద్గారాలను తగ్గించే వీలు ఉంటుందని ముఖ్యమంత్రి తెలిపారు.
NTPC విద్యుత్ వ్యాపార నిగం ప్రతినిధులు మరియు APNREDCAP సభ్యులు ముఖ్యమంత్రి అధ్యక్షతన ఈరోజు ఈ ఒప్పందం కుదుర్చుకున్నారు.