తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు ఎప్పుడు ఎప్పుడా అని ఎదురుచూస్తున్నటువంటి రేషన్ కార్డుల దరఖాస్తుకు సంబంధించి కీలక అప్డేట్ రావడం జరిగింది.
ఇప్పటికే రేషన్ కార్డుల దరఖాస్తుకు సంబంధించి విధివిధానాలను రూపొందించాలని రాష్ట్ర ప్రభుత్వం మంత్రివర్గ సబ్ కమిటీని ఏర్పాటు చేసిన విషయం మనకు తెలిసిందే. సబ్ కమిటీ ఇప్పటికే దాదాపు వివిధ విధానాలను ఖరారు చేయడం జరిగింది. ఈ నేపథ్యంలో కమిటీ సభ్యులతో పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సమావేశమయ్యారు. సమావేశం అనంతరం ఆయన మీడియాకి కీలక అంశాలను వెల్లడించారు.
అక్టోబర్ నెల నుంచి కొత్త రేషన్ కార్డుల దరఖాస్తులు
అక్టోబర్ 2024 నుంచి కొత్త రేషన్ కార్డులకు దరఖాస్తులు స్వీకరిస్తామని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి వెల్లడించారు. ఇప్పటివరకు రాష్ట్రవ్యాప్తంగా 89.96 లక్షల దరఖాస్తులు ఉన్నట్టు ఆయన వెల్లడించారు. కొత్తగా రేషన్ కార్డు కోసం దరఖాస్తు చేసుకునే వారు స్థానికతను ధృవీకరిస్తూ ఆధార్ లేదా ఇతర డాక్యుమెంట్ ప్రూఫ్ సమర్పించాల్సి ఉంటుంది.
ప్రాథమికంగా ఇప్పటికే విధివిధానాలను ఖరారు చేసినటువంటి ప్రభుత్వం, ఆదాయ పరిమితిని కూడా ఖరారు చేయడం జరిగింది.
తెలంగాణలో రేషన్ కార్డు పొందాలంటే కావలసిన అర్హతలు
తెలంగాణలో రేషన్ కార్డు పొందాలంటే ప్రాథమికంగా కింది అర్హతలు కలిగి ఉండాలి.
- దరఖాస్తుదారుడు తెలంగాణ శాశ్వత నివాసి అయి ఉండాలి.
- పల్లె ప్రాంతాల్లో అయితే ఒకటిన్నర లక్ష పట్టణ ప్రాంతాల్లో అయితే రెండు లక్షల వరకు వార్షిక ఆదాయం కలిగి ఉండాలి. అంతకంటే మించి ఉంటే అనర్హత గా పరిగణిస్తారు.
- ఇక దరఖాస్తుదారుడి పేరు మీద మూడున్నర ఎకరం కంటే మాగాణి(తడి భూమి ) ఉండరాదు లేదా 7.5 ఎకరాలు మించి మెట్ట భూమి ఉండరాదు. రెండు కలిపి కూడా 7.5 ఎకరాలు నించకూడదు.