ఆంధ్రప్రదేశ్ లో రేషన్ కార్డుల జారీ ప్రక్రియ అతి త్వరలో మొదలు పెట్టనున్నట్లు ప్రభుత్వం వెల్లడించింది. ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా చాలామంది రైస్ కార్డు దరఖాస్తు కోసం వెయిట్ చేస్తున్నారు.
గత ప్రభుత్వ హయాంలో వివిధ కారణాలు చేత రైస్ కార్డు కోల్పోవడం లేదా పెళ్లయితే వారిని స్ప్లిట్ చేసి కొత్త రేషన్ కార్డు ఇవ్వకపోవడం వంటి వివిధ సమస్యలతో ఉన్న వారికి ప్రభుత్వం గుడ్ న్యూస్ తెలిపింది. త్వరలో రేషన్ కార్డులు ఇవ్వనున్నట్లు మంత్రి నాదెండ్ల మనోహర్ వెల్లడించారు.
గత ప్రభుత్వ హయాంలో ఇంట్లో ఇన్కమ్ టాక్స్ చెల్లించే వ్యక్తి, ప్రభుత్వ ఉద్యోగి, కారు కలిగి ఉన్న వ్యక్తి కి పెళ్లి అయినప్పటికీ కూడా వారిని స్ప్లిట్ అనగా తొలగించి కనీసం వారి తల్లి తండ్రులకు రైస్ కార్డు ఇచ్చే ప్రక్రియ అంత సులభంగా జరగలేదని ఆరోపణలు ఉన్నాయి. దీంతో పిల్లలు పెళ్లయి వేరేచోట ఉంటున్నా తమకి వారి కారణంగా రైస్ కార్డు లేదా రేషన్ కార్డు రాలేదని ఎంతోమంది తల్లిదండ్రులు ఫిర్యాదు చేయడం జరిగింది.
ఇంకా కొంతమందికి పెళ్లయి వేరే చోట ఉంటున్న కొత్త రేషన్ కార్డు లేకుండా ఉమ్మడి రేషన్ కార్డు మాత్రమే ఉంటుంది. ఇటువంటి వారందరికీ ఇప్పుడు పరిష్కారం లభించనుంది.
మ్యారేజ్ సర్టిఫికెట్ ఉంటే వెంటనే రేషన్ కార్డు
మ్యారేజ్ సర్టిఫికేషన్ (Marriage Certificate) అనగా పెళ్లైనట్లు దృవీకరణ పత్రం అంటే కింది విధంగా రేషన్ కార్డు పొందవచ్చు.
- ఒక కుటుంబంలో మేజర్ పిల్లలకు పెళ్లయినట్లు ధ్రువీకరణ పత్రం అనగా మ్యారేజ్ సర్టిఫికెట్ ఉంటే చాలు. వారికి వెంటనే కొత్త రేషన్ కార్డు ఇస్తారు.
- ఒకవేళ ఒక రేషన్ కార్డులో పెళ్ళైన వారు ఉంటే స్ప్లిట్ చేసి తల్లిదండ్రులకు మరియు పెళ్ళైన వారికి వేర్వేరు రేషన్ కార్డులు ఇస్తారు.
- ఒకవేళ కుటుంబంలో ఎవరైనా ఇన్కమ్ టాక్స్ చెల్లించే వ్యక్తి లేదా ప్రభుత్వ ఉద్యోగం చేస్తే వ్యక్తి ఉంటే అతనికి లేదా ఆమెకి పెళ్లి అయ్యి వేరే చోట జీవిస్తున్నట్లయితే అటువంటి వారికి కూడా మ్యారేజ్ సర్టిఫికెట్ ఆధారంగా వారిని కుటుంబం నుంచి వేరుచేసి ఉన్నవారికి రైస్ కార్డు ఇచ్చే అవకాశం ఉంటుంది.
రేషన్ కార్డు పొందాలంటే అర్హతలు ఇవే [Ration Card Eligibility in Andhra Pradesh]
రేషన్ కార్డు పొందాలనుకునే వారికి అర్హతలు కింద ఇవ్వబడ్డాయి. ఇక్కడ ఒక కుటుంబాన్ని ప్రామాణికంగా తీసుకుంటారు. కుటుంబం అంటే భార్య, భర్త, పెళ్ళికాని పిల్లలు. ఒకవేళ పెళ్లయితే కొత్త రేషన్ కార్డ్ తీసుకోవచ్చు.
- సంబంధిత వ్యక్తి లేదా కుటుంబం ఆంధ్రప్రదేశ్ లో శాశ్వతంగా నివాసం ఉండాలి.
- కుటుంబంలో ఎవరికి కూడా ప్రభుత్వ ఉద్యోగం ఉండరాదు. కుటుంబం ఎవరు కూడా ఇన్కమ్ టాక్స్ చెల్లించరాదు.
- ఒక కుటుంబానికి వ్యవసాయ భూమి మాగాణి అంటే తడి భూమి అయితే మూడు ఎకరాలు నుంచి రాదు పోడి భూమి అనగా మెట్ట భూమి అయితే 10 ఎకరాలు మించరాదు. తడి మరియు పొడి కలిపి కూడా 10 ఎకరాలు మించరాదు.
- నెలవారి విద్యుత్ వినియోగం 300 యూనిట్లు మించరాదు. అయితే ఈ నిబంధనలను ప్రస్తుత ప్రభుత్వం సడలించే అవకాశం ఉంది.
- ఇంట్లో ఎవరికీ ఫోర్ వీలర్ ఉండరాదు. ట్రాక్టర్, క్యాబ్, మ్యాక్సీ క్యాబ్ వంటి వాటికి మినహాయింపు ఉంది.
- మున్సిపల్ ప్రాంతంలో ఉండే వారికి వెయ్యి చదరపు అడుగులకు మించి నిర్మాణం ఉండరాదు.
రేషన్ కార్డ్ దరఖాస్తు ప్రక్రియ మరియు కావాల్సిన డాక్యుమెంట్ [Ration Card Application process in Andhra Pradesh]
రేషన్ కార్డు అప్లికేషన్స్ ప్రారంభమైన వెంటనే సచివాలయంలో మీ కుటుంబ సభ్యుల అందరి ఆధార్ కార్డు జిరాక్స్లను జత చేసి రేషన్ కార్డుకు దరఖాస్తు చేస్తూ అప్లికేషన్ పెట్టుకోవాలి. స్ప్లిట్ చేసేవాళ్లు అందుకు సంబంధించిన స్ప్లిట్ అప్లికేషన్ పెట్టుకోవాలి.
పెళ్లి ఆధారంగా స్ప్లిట్ చేయాలన్నా లేదా కొత్త రేషన్ కార్డు పొందాలన్నా మ్యారేజ్ సర్టిఫికెట్ కాపీ తప్పనిసరిగా జత చేయాలి.
కావలసిన డాక్యుమెంట్స్: అందరి సభ్యుల ఆధార్ కార్డు కాపీ, మ్యారేజ్ సర్టిఫికెట్ (పెళ్లయిన వారికి), అప్లికేషన్ ఫామ్.