New Pension Status Check online in ap – కొత్త పెన్షన్లు స్టేటస్ చెక్ చేయు విధానం

New Pension Status Check online in ap – కొత్త పెన్షన్లు స్టేటస్ చెక్ చేయు విధానం

New Pension Status Check: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ఆర్థికంగా అస్థిరత ఉన్న పౌరులందరికీ, ముఖ్యంగా వృద్ధులు, వితంతువులు మరియు వికలాంగ పౌరులకు పెన్షన్‌లను ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పథకం ద్వారా అందజేస్తున్న విషయం తెలిసిందే. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి ఈ పథకం కింద పెన్షన్ మొత్తాన్ని కూడా పెంచారు. అర్హత ప్రమాణాలను క్లియర్ చేసిన దరఖాస్తుదారులందరూ తప్పనిసరిగా అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించి, ఈ పథకం ప్రయోజనాలను పొందేందుకు దరఖాస్తు ఫారమ్‌ను పూరించాలి.

దరఖాస్తు చేసుకున్నాక పెన్షన్ స్టేటస్ ఎలా చెక్ చెయ్యాలి అని తెలియక తికమక పడుతూ ఉంటారు. అలంటి వారు కింది ఇచ్చిన స్టెప్స్ చూస్తూ మీ పెన్షన్ స్టేటస్ చెక్ చేసుకోండి.

New Pension Status Check Process – కొత్త పెన్షన్ స్టేటస్ చెక్ చేయు విధానం

STEP 1 : ముందుగా ఈ క్రింది వెబ్సైట్ ను క్లిక్ చెయ్యండి

STEP 2 : తర్వాత క్రింద కనిపించే విధంగా ఓపెన్ అవుంది. అక్కడ “Enter Your Aadhar Number” దగ్గర మీయొక్క ఆధార్ నంబర్ ఎంటర్ చేయండి. సెర్చ్ ఆప్షన్ పైన క్లిక్ చేయండి.

Enter Aadhar Number registered for New Pension

STEP 3 : తర్వాత క్రింద కనిపించే విధంగా CAPTCHA కోడ్ ఎంటర్ చేసి సబ్మిట్ పైన క్లిక్ చేయండి.

STEP 4 : తర్వాత మీకు సంబందించిన చాలా అప్లికేషన్స్ నంబర్స్ ఉంటాయ్ అక్కడ పెన్షన్ దగ్గర ఉన్న అప్లికేషన్ నంబర్ పైన క్లిక్ చేస్తే మి యొక్క పెన్షన్ స్టేటస్ తెలుస్తుంది. ఒకవేళ మీరు కొత్తగా పెట్టుకున్నట్టు అయితే మీ యొక్క పెన్షన్అప్రూవ్ అయ్యిందా లేదా పెండింగ్, రిజెక్ట్ లో ఉంద అనేదు తెలుస్తుంది.

AP సేవా పోర్టల్ ద్వారా పెన్షన్ స్టేటస్ ని తెలుసుకోవడం చాలా సులభం మరియు సమయం ఆదా చేస్తుంది. మీరుఇంటర్నెట్ ద్వారా మీ పెన్షన్ స్టేటస్ తెలుసుకోవడానికి ఈ పోర్టల్ ని ఉపయోగించవచ్చు. ఇది మీకు ఎటువంటిఅవరోధాలు లేకుండా సర్వీసులను పొందడంలో సహాయపడుతుంది.

You cannot copy content of this page