తెలంగాణలో కొత్త ప్రభుత్వం ప్రారంభమైనప్పటి నుంచి ప్రజల సంక్షేమం కోసం అనేక పథకాలను ప్రారంభించిన విషయం తెలిసిందే. అందులో భాగంగా నీ కన్నుల కోసం నేతన్నకు చేయూత అనే పథకాన్ని ప్రారంభించింది.
దీని ద్వారా తెలంగాణలోని చేనేత కార్మికులకు డబ్బు ఆదా చేసే ప్రోత్సాహం లభిస్తుంది. నేతన్నకు చేయూత పథకానికి సంబంధించిన నిధులను ముఖ్యమంత్రి రేవంత్ నేడు విడుదల చేయనున్నారు. దీని ద్వారా 36,133 మంది అర్హులు లబ్దిపొందనున్నారు. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హ్యాండ్లూమ్ టెక్నాలజీ (ఐఐటిహెచ్) ప్రారంభోత్సవంలో భాగంగా అమౌంట్ విడుదల చేయనున్నారు.
మూడేళ్ల కాలపరిమితి గల ఈ పథకం రెండో విడత 2021 సెప్టెంబర్లో మొదలై 2024 ఆగస్టుతో ముగిసింది. రికరింగ్ అకౌంట్లలో కార్మికులు జీతంలోని 8% జమ చేస్తే ప్రభుత్వం దాదాపు రెట్టింపు ఇచ్చి మొత్తాన్ని మూడేళ్ల తర్వాత అందిస్తుంది.
ఈ పథకాన్ని గత ప్రభుత్వం ప్రారంభించి సరిగా నిర్వహించకపోవడంతో ఈ పథకం ప్రయోజనం చాలామంది చేనేత కార్మికులుకు అందలేదు. దీంతో కొత్త ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఈ పథకానికి సంబంధించిన 90 కోట్ల నిధులను విడుదల చేసింది.
జమ చేసిన అమౌంటు మూడేళ్లపాటు పొదుపురూపంలో ఉంటుంది మూడేళ్ల తర్వాత ఈ పథకానికి సంబంధించిన అమౌంట్ కు వడ్డీ కలిపి మొత్తంగా ఇస్తారు. ఉక్కు కార్మికులు 60 వేల నుంచి 1,29,000 దాకా లబ్ధి పొందుతారు