రైతులకు కేంద్ర క్యాబినెట్ శుభవార్త తెలిపింది. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అధ్యక్షతన సమావేశమైన క్యాబినెట్ 2025-26 మార్కెటింగ్ సీజన్ కి సంబంధించిన రబీ పంటల కనీసం మద్దతు ధరను ప్రకటించింది.
ఇందులో ప్రధానంగా గోధుమ 150 రూపాయలు, బార్లీ 150 రూపాయలు, సెనగలు 250 రూపాయల మేర కనీస మద్దతు ధరను కేంద్ర ప్రభుత్వం పెంచింది.
ఇక కందులు (మసూర్ దాల్) బయట 275 ఆవాల పైన 300 రూపాయలు కుసుమపువ్వు పైన 140 రూపాయలు చొప్పున పెంచింది.
2025-26 మార్కెటింగ్ సీజన్లో రబీ పంటలకు అందించిన కనీస మద్ధతు ధరలు కింద ఇవ్వబడ్డాయి (రూ. క్వింటాల్ కు)
పంటలు | ఎంఎస్పీ ఆర్ఎంఎస్ 2025-26 | మద్ధతు ధరలో పెరుగుదల(మొత్తంగా) |
గోధుమ | 2425 | 150 |
బార్లీ | 1980 | 130 |
పప్పుధాన్యాలు | 5650 | 210 |
కందులు | 6700 | 275 |
ర్యాప్‌సీడ్, ఆవాలు | 5950 | 300 |
కుసుమలు | 5940 | 140 |
*