ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలోని మహిళలకు గుడ్ న్యూస్….కూటమి ప్రభుత్వం అధికారం లోకి రాగానే ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా నెరవేస్తూ ఉంది. ఇప్పటికే పెన్షన్ అమౌంట్ పెంపు, అన్న క్యాంటీన్ తదితర హామీలను నెరవేరుస్తున్న విషయం తెలిసిందే. ఏపీలోని మహిళలకు నెలకు రూ.1500 చొప్పున సాయం పంపిణీపై మంత్రి గుమ్మిడి సంధ్యారాణి శాసనమండలిలో కీలక ప్రకటన చేశారు. ’18 ఏళ్లు నిండిన ప్రతి మహిళకు నెలకు రూ.1500 చొప్పున ఏటా రూ.18000 అందిస్తామని తెలిపారు. మహాశక్తి పేరుతో ఈ పథకం అమలు చేయనున్నట్టు ప్రకటించారు. సాయం విషయంలో ఎవరికీ అన్యాయం జరగకుండా విధివిధానాలు రూపొందించి త్వరలోనే ఈ పథకం అమలు చేయనున్నట్లు ఆమె వెల్లడించారు. దీనిపై అధికారిక ఉత్తర్వులు వెలువడాల్సి ఉంది.
18 ఏళ్లు నిండి ఉండాలి
ఆడబిడ్డ నిధి కింద 18 సంవత్సరాలు నిండిన ప్రతి మహిలకు నెలకు రూ.1500 ఇచ్చేందుకు ప్రభుత్వం కసరత్తులు చేస్తోంది. దీనికి సంబంధించిన ఓ వార్త సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతోంది. సూపర్ సిక్స్ హామీల అమల్లో భాగంగా త్వరలోనే మహిళలకు నెలకు రూ.1500 ఇవ్వబోతున్నారని, దీనికి సంబంధించి అన్ని పత్రాలను అందుబాటులో ఉంచుకోవాలనే ఆ వార్త సారాంశం.
ప్రతి స్త్రీకి 18 సంవత్సరాల వయసు నిండాలని, రేషన్ కార్డు, ఆధార్ కార్డు, జన్మించిన తేదీకి సంబంధించిన ధ్రువపత్రం, ఆధార్ తో లింక్ అయిన మొబైల్ నెంబరు, బ్యాంక్ అకౌంట్ కలిగివుండాలి. చంద్రబాబు ప్రభుత్వం ఈ పథకాన్ని వచ్చేనెల నుంచి అమలు చేయబోతున్నట్లు సామాజిక మాధ్యమాల్లో జోరుగా వార్తలు వస్తున్నాయి. అయితే ఎప్పుడు ప్రారంభించాలనే విషయమై ప్రభుత్వం నుంచి స్పష్టత రాలేదు.