ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గ్రామ వార్డు సచివాలయాల పరిధిలో పనిచేస్తున్నటువంటి గ్రామ వార్డు వాలంటీర్లకు సంబంధించి కీలక అప్డేట్ వచ్చింది. తమను ఉంచుతారా లేకపోతే తొలగిస్తారా అనే సందేహంలో ఉన్న వాలంటీర్లకు ఆ శాఖ మంత్రి డోల బాల వీరాంజనేయ స్వామి గుడ్ న్యూస్ తెలిపారు.
వాలంటీర్లను రెన్యువల్ చేస్తున్నాము
గ్రామ వార్డు వాలంటీర్లను గత ప్రభుత్వం ఆగస్టు 2023 నుంచి 2024 ఆగస్టు వరకు రెన్యూవల్ చేయలేదని, అందుకే వారి జీతాలు ఆగిపోయాయని మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి శుక్రవారం మీడియాకు వెల్లడించారు.
అయితే పెండింగ్ జీతాలను తమ ప్రభుత్వం చెల్లిస్తుందని అదేవిధంగా వాలంటీర్లను కూడా రెన్యువల్ చేస్తామని ఆయన స్పష్టం చేశారు. వాలంటీర్లను తాము తొలగించలేదని వారు విధుల్లోనే ఉన్నారని మరో మారు స్పష్టం చేశారు.
వాలంటీర్లు గత రెండు నెలలుగా శాలరీలు పడక ఇబ్బందులు పడుతున్న నేపథ్యంలో ఆ శాఖ మంత్రి ఈ మేరకు ప్రకటన చేయటం ప్రాధాన్యత సంతరించుకుంది. గత ప్రభుత్వం వాలంటీర్లను తమ సైన్యంగా చెప్పుకుందని అయినప్పటికీ వారిని రెన్యువల్(Volunteer Renewal) చేయకుండా వారి సేవలను సంవత్సర కాలంగా వినియోగించిందని అందుకే వారి జీతాలు ఆగిపోయాయని మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి వెల్లడించారు. అయితే తమ ప్రభుత్వం వాలంటీర్లను రెటిఫికేషన్(Ratification) చేసి కొనసాగించనున్నట్లు ఆయన తెలిపారు.
అతి త్వరలో వాలంటీర్లను గ్రామ సేవకులుగా నియమించనున్నట్లు ఇప్పటికే అధికార ప్రతినిధులు వ్యాఖ్యానించడం జరిగింది. అదేవిధంగా వారి జీతాన్ని కూడా పదివేలకు పెంచనున్నట్లుగా కూడా అధికార పార్టీ హామీ ఇవ్వడం జరిగింది.