2024 25 ఖరీఫ్ కనీస మద్దతు ధరలు విడుదల, వీటిపై భారీ పెంపు

2024 25 ఖరీఫ్ కనీస మద్దతు ధరలు విడుదల, వీటిపై భారీ పెంపు

రైతులకు కేంద్రం గుడ్ న్యూస్ తెలిపింది. 2024-25 ఖరీఫ్ సీజన్ కి సంబంధించి కనీస మద్దతు ధరలను (Minimum Support Price) కేంద్రం ప్రకటించింది.

ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన సమావేశమైన కేంద్ర మంత్రివర్గం 2024-25 మార్కెటింగ్ సీజన్ కి సంబంధించి అన్ని ఖరీఫ్ పంటల కనీస మద్దతు ధరలను (MSP) పెంచుతూ నిర్ణయం తీసుకుంది.

ప్రధానంగా వరి పై 117 రూపాయలు, జొన్నలపై 191 రూపాయలు పెంచడం జరిగింది. మొక్కజొన్న పై 131 రూపాయలు, కందిపప్పు (క్వింటాలుకు రూ.550) భారీగా 550 రూపాయల మద్దతు ధర పెంచారు.

ఇక నూనె గింజల విషయానికొస్తే వేరుశెనగపై 406 రూపాయలు, గడ్డి నువ్వులు (క్వింటాలుకు రూ.983), నువ్వులు (క్వింటాలుకు రూ.632) లకు గత ఏడాది తో పోలిస్తే కనీస మద్దతు ధరను పెంచారు.

క్వింటాల్ కు వివిధ రకాల పంటలు ఎంత మేర పెంచారు మరియు ప్రస్తుతం కనీస మద్దతు ధర ఎంత ఉందో పూర్తి లిస్ట్ కింద చూడవచ్చు.

S.No.CropsMSP RMS 2024-25MSP RMS 2023-24Increase in MSP (absolute)
1Paddy – వరి23002183117
2Paddy – Grade A – వరి గ్రేడ్ ఏ^23202203117
3Jowar – Hybrid జొన్న హైబ్రిడ్33713180191
4Jowar – Maldandi- జొన్నలు మల్దండి 34213225196
5Bhajra సజ్జ26252500125
6Ragi రాగులు42903846444
7Maize మొక్కజొన్న22252090135
8Tur/Har Har Dal కందులు75507000550
9Moong Dal పెసర86808558124
10Urad Dal మినుములు74006950450
11Ground Nut పల్లీ/వేరు శనగ67836377406
12Sunflower seed పొద్దుతిరుగుడు గింజలు72806760520
13Soya Bean – yellow సోయాబీన్ (పసుపు)48924600292
14Sesmum నువ్వులు92678365632
15Naigar Seed గడ్డి నువ్వులు87177734983
16Cotton – Medium పత్తి71216620501
17Cotton – Long పత్తి75217020501
Minimum Support Price – MSP 2024-25

You cannot copy content of this page