నేడు రాష్ట్ర వ్యాప్తంగా ఉపాధి హామీ గ్రామ సభలు

నేడు రాష్ట్ర వ్యాప్తంగా ఉపాధి హామీ గ్రామ సభలు

నేడు రాష్ట్రవ్యాప్తంగా 13,326 గ్రామపంచాయతీల్లో గ్రామసభలు మొదలుకానున్నాయి.’స్వర్ణ గ్రామపంచాయతీ’ పేరుతో ప్రత్యేక కార్యక్రమాలకు ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ఆయా గ్రామాల సర్పంచుల అధ్యక్షతన వీటిని నిర్వహించనున్నారు. కోనసీమ జిల్లాలోని వానపల్లి గ్రామసభలో సీఎం చంద్రబాబు,అన్నమయ్య జిల్లాలోని రైల్వేకోడూరు మండలం మైసూరావారి పల్లెలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పాల్గొననున్నారు.

గ్రామ సభకు గ్రామ సచివాలయ సిబ్బంది హాజరు కావాలని సచివాలయ శాఖ నుండి విడుదలైనటువంటి ఉత్తర్వులు.

Gram Sabhas in Andhra Pradesh :

సర్పంచి అధ్యక్షతన నిర్వహిస్తున్న గ్రామసభల్లో ప్రజలు పాల్గొని గ్రామీణాభివృద్ధికి ప్రభుత్వం నిర్దేశించిన నాలుగు అంశాలపై చర్చించి తీర్మానం చేయనున్నారు. మొదటి అంశంలో ఇళ్లకు విద్యుత్, తాగునీటి కనెక్షన్లు, మరుగుదొడ్డి సదుపాయం, వంటగ్యాస్ కనెక్షన్లు ఇవ్వడంపై చర్చించనున్నారు. రెండో అంశం కింద మురుగు కాలువలు, మురుగునీటి వ్యవస్థ నిర్వహణ, వీధి దీపాలు, సిమెంట్ రహదారులు, ఘనవ్యర్థాల నిర్వహణపై చర్చిస్తారు. అలాగే మూడో అంశంగా గ్రామంలో అంతర్గత రహదారుల నిర్మాణంతోపాటు గ్రామాల నుంచి మండల కేంద్రాలకు లింక్‌రోడ్లపై చర్చలు జరుపుతారు. నాలుగో అంశంగా ఇంకుడుగుంతలు, పంటకుంటల నిర్మాణం, ఉద్యానవన, పట్టు పరిశ్రమ అభివృద్ధికి సదుపాయాల కల్పన, పశువుల పెంపకంపై చర్చించనున్నారు

గ్రామసభల్లో చర్చించే నాలుగు అంశాలివే

గ్రామసభల్లో చర్చించే నాలుగు అంశాలేంటంటే..

అంశం-1: మరుగుదొడ్లు, విద్యుత్, కుళాయి, వంటగ్యాస్ కనెక్షన్లు

అంశం-2: మురుగునీరు – ఘన వ్యర్థాల నిర్వహణ, వీధిదీపాలు, సిమెంటు రహదారులు

అంశం-3: గ్రామాల్లో రోడ్ల నిర్మాణం, మండల కేంద్రాలకులింక్ రోడ్లు

అంశం-4: ఇంకుడు గుంతలు, పంటకుంటల నిర్మాణం.ఉద్యానవన, పట్టు పరిశ్రమ అభివృద్ధికి సదుపాయాలు.

ఉపాధిహామీ పథకంపై అవగాహన :

గ్రామాల అభివృద్ధిలో కీలకంగా మారిన జాతీయ గ్రామీణ ఉపాధిహామీ పథకం అమలుకు కూటమి ప్రభుత్వం సరికొత్త ఒరవడిని తీసుకురానుంది. సెప్టెంబర్ – మార్చి మధ్య ఏడు నెలల కాలంలో చేపట్టబోయే అభివృద్ధి పనులపై ప్రణాళికలు తయారు చేయనున్నారు. గ్రామసభల ద్వారా ప్రజలందరికీ ఉపాధి హామీ పథకంపై అవగాహన కల్పించి ఇందులో నిధుల దుర్వినియోగానికి అడ్డుకట్ట వేయాలని సర్కార్ భావిస్తోంది. ఉపాధి హామీ పనులకు గ్రామసభల ద్వారా ఆమోదం పొందేందుకు ఒకేసారి వీటిని నిర్వహిస్తోంది. ఇప్పటికే ఆర్థికసంఘం నిధులు రూ.2 వేల కోట్లు స్థానిక సంస్థల ఖాతాల్లో జమ చేసిన ప్రభుత్వం ఉపాధి పనులు క్రమపద్ధతిలో నిర్వహించాలని నిర్ణయించింది. జాబ్‌కార్డు ఉన్న ప్రతి కుటుంబానికి వంద పనిదినాలు కల్పించనున్నారు.

You cannot copy content of this page