గుడ్ న్యూస్, ఉపాధి హామీ పథకం 2024 బకాయిలు విడుదల

గుడ్ న్యూస్, ఉపాధి హామీ పథకం 2024 బకాయిలు విడుదల

ఉపాధి హామీ పథకానికి సంబంధించి లబ్ధిదారులకు గుడ్ న్యూస్. ఉపాధి కూలీల వేతన బకాయిల ను విడుదల చేస్తూ కేంద్ర ప్రభుత్వ కీలక నిర్ణయం తీసుకుంది.

ఉపాధి హామీ పథకం 2300 కోట్లు విడుదల

ప్రస్తుత కూటమి ప్రభుత్వం ఇటీవల కేంద్ర ప్రభుత్వాన్ని సంప్రదించి ఉపాధి హామీ పథకం (MGNREGA) పెండింగ్ బకాయిలను చెల్లించాలని విన్నవించడం జరిగింది. ఈ నేపథ్యంలో ఉపాధి కూలీల కు సంబంధించి 2300 కోట్ల రూపాయల బకాయిలను విడుదల చేస్తూ కేంద్ర గ్రామీణ అభివృద్ధి మంత్రిత్వ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది.

మే నెల నుంచి ఉపాధి కూలీలకు వేతనాలు కేంద్రం చెల్లించలేదు. మూడు నెలలుగా వేతనాలు లేక కూలీలు తీవ్ర అవస్థలు పడుతున్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వ చర్వతో కేంద్ర ప్రభుత్వం తక్షణమే బకాయిలను విడుదల చేస్తూ కీలక నిర్ణయం తీసుకుంది.

విడుదల చేసిన ఈ పెండింగ్ అమౌంట్ రెండు వారాల్లోపు లబ్ధిదారులకు ఖాతాలో జమ కానుంది.

మరో వైపుకేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి కేటాయించిన ఉపాధి హామీ పని దినాలను కూడా పెంచడం జరిగింది. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చొరవ తో పని దినాలను పెంచుతూ కేంద్ర ప్రభుత్వం ఇటీవల నిర్ణయం తీసుకుంది.

ఉపాధి హామీ పథకం పేమెంట్ స్టేటస్ ఇలా చెక్ చేయండి

ఉపాధి హామీ పథకానికి సంబంధించి మీ ఖాతాలో అమౌంట్ జమ అయిందా లేదా, చివరగా ఎప్పుడు మీకు అమౌంట్ క్రెడిట్ అయింది. గతంలో ఎన్నిసార్లు ఎంత అమౌంట్ వచ్చింది ఇలా అన్ని వివరాలు మీరు కింది లింక్ ల ఇవ్వబడిన ప్రాసెస్ ని ఫాలో అయ్యి స్టేటస్ తెలుసుకోవచ్చు.

You cannot copy content of this page