మే నెల పెన్షన్ పంపిణీ పై ఈసీ కీలక ఆదేశాలు, వాలంటీర్లకు బదులు సచివాలయ సిబ్బంది

మే నెల పెన్షన్ పంపిణీ పై ఈసీ కీలక ఆదేశాలు, వాలంటీర్లకు బదులు సచివాలయ సిబ్బంది

ఆంధ్ర ప్రదేశ్ లో గత నెల పెన్షన్ పంపిణీ కొంత ఆలస్యంగా ప్రారంభమైన నేపథ్యంలో తాము ఇబ్బందులకు గురైనట్లు పెన్షన్ లబ్ధిదారులు ఎన్నికల కమిషన్ దృష్టికి తీసుకొచ్చినట్లు ఎన్నికల సంఘం వెల్లడించింది. ఈ నేపథ్యంలో ఈసారి పెన్షన్ పంపిణీ విషయంలో ఎలాంటి జాప్యం లేకుండా చూడాలని ఎన్నికల సంఘం సిఎస్ జవహర్ రెడ్డికి ఆదేశాలు జారీ చేసింది.

ఇంటి వద్దనే పెన్షన్ పంపిణీ చేసే వాలంటీర్లకు ప్రత్యామ్నాయంగా సచివాలయ సిబ్బందిని ఇందుకోసం వినియోగించాలని పేర్కొంది.

మే నెల మరియు జూన్ నెల పంపిణీ సంబంధించి ప్రజలు ఇబ్బంది కి గురి కాకుండా మార్చి 30న జారీ చేసినటువంటి ఆదేశాలను అనుసరించాలని మరోసారి స్పష్టం చేసింది.

గత నెల పెన్షన్ కోసం లబ్ధిదారులు సచివాలయాల వద్ద ఇబ్బంది పడిన విషయాలు తమ దృష్టికి వచ్చాయని అయితే ఈ విడత పెన్షన్ పంపిణీ సంబంధించి ప్రజలకు ఎటువంటి ఇబ్బంది లేకుండా పంపిణీ జరిగేలా చూడాలని ఎన్నికల కమిషన్ ఆంధ్రప్రదేశ్ సిఎస్ కు ఆదేశాలు జారీ చేసింది. ఇందుకోసం ఎలక్ట్రానిక్ అనగా DBT పద్ధతిలో పెన్షన్ నేరుగా ఖాతాలో జమ చేయడం గాని లేదా ఇంటింటికి సచివాలయ శాశ్వత సిబ్బందితో పంపిణీ చేయడం వంటి ప్రత్యామ్నాయలను పరిశీలించాలని ఈసీ కోరింది.

పెన్షన్ పంపిణీ సంబంధించి ముఖ్యమైన లింక్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

You cannot copy content of this page