March 2024 Pension Distribution Information – మార్చి నెల పెన్షన్ పంపిణీకి సంబంధించిన సమాచారం

March 2024 Pension Distribution Information – మార్చి నెల పెన్షన్ పంపిణీకి సంబంధించిన సమాచారం

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం నవరత్నాలలో భాగంగా రాష్ట్రంలోని వృద్ధులు, వికలాంగులు, వితంతువులకు ఆర్థిక సహాయాన్ని అందించడానికి ప్రతినెల పెన్షన్ రూపంలో నగదు పంపిణీ చేస్తున్న విషయం తెలిసిందే. జనవరి 3 2024 నుండి పెన్షన్ 3000 పెంచి అందిస్తున్న విషయం తెలిసిందే.

March Month Pension Updates

తేదీఅప్డేట్
28-02-2024రేపటి నుంచి ఐదు రోజుల పాటు పెన్షన్ పంపిణీ కార్యక్రమం. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 66.15 లక్షల మందికి పెన్షన్ పంపిణీ చేస్తున్న గ్రామ/ వార్డు వాలంటీర్స్
28-02-2024newపెన్షన్ కానుక పథకానికి సంబంధించి SSPension WEA/WWDs లాగిన్ లో “Unmapped Pensioners Map To Volunteers” ఆప్షన్ ని ఎనేబుల్ చెయ్యడం జరిగింది.
28-02-2024మార్చి 2024 నెలకి సంబందించి Pensioner’s names ( payment option )  మరియు Pension Amount ( Reports option ) YSR Pension Kanuka app లో update చేయడం జరిగింది

పెన్షన్ అమౌంట్ ఎంత?

పెన్షన్అమౌంట్
ART (PLHIV) వ్యక్తులు3000/-
సంప్రదాయ చెప్పులు కుట్టేవారు3000/-
వికలాంగులు3000/-
లింగమార్పిడి చేసుకున్న వ్యక్తులు3,000/
డప్పు కళాకారులు3,000/
దీర్ఘకాలిక కిడ్నీ వ్యాధితో బాధపడుతూ ప్రభుత్వం మరియు నెట్‌వర్క్ ఆసుపత్రులలో డయాలసిస్ చేయించుకుంటున్న వ్యక్తులు10,000/-

వైయస్సార్ పెన్షన్ కానుక అర్హత ప్రమాణాలు

పెన్షన్అర్హతలు
వృద్ధాప్య పెన్షన్60 సంవత్సరాలు మరియు ఆపై వయస్సు కలవారు అర్హులు.
గిరిజనులు 50 సంవత్సరాలు ఆపై వయస్సు కలవారు అర్హులు
వితంతు పెన్షన్ వివాహ చట్టం ప్రకారం 18 సంవత్సరాలు ఆ పై వయస్సు కలవారు.
భర్త మరణ ధ్రువీకరణ పత్రం లేదా డెత్ సర్టిఫికెట్ కలిగి ఉండాలి
వికలాంగుల పెన్షన్ 40% మరియు అంతకన్నా ఎక్కువ వికలత్వం కలిగి ఉన్నవారు మరియు
సదరం సర్టిఫికెట్ కలిగి ఉన్న వారు. వీరికి వయోపరిమితి లేదు
చేనేత కార్మికుల పెన్షన్వయస్సు 50 సంవత్సరాలు మరియు యు ఆ పైన కలవారు.
చేనేత మరియు జౌళి శాఖ వారిచే గుర్తింపు పత్రం కలిగినవారు
కల్లు గీత కార్మికుల పింఛన్వయస్సు 50 సంవత్సరాలు మరియు ఆపైన కలవారు.
ఎక్సైజ్ శాఖ వారిచే గుర్తింపు పత్రం కలిగినవారు.
మత్స్యకారుల పెన్షన్ వయస్సు 50 సంవత్సరములు మరియు ఆ పైన కలవారు.
మత్స్య శాఖ వారిచే గుర్తింపు పత్రం కలిగినవారు.
హెచ్ఐవి(PL HIV) బాధితులు పెన్షన్వయో పరిమితి లేదు.
ఆరు నెలలు వరుసగా ART treatment Therapy(యాంటీ రిట్రో వైరల్ థెరపీ) తీసుకున్నవారు.
డయాలసిస్ (CKDU) పెన్షన్వయస్సుతో సంబంధం లేకుండా ప్రభుత్వ హాస్పిటల్స్ మరియు వైఎస్సార్ ఆరోగ్యశ్రీ పథకం ద్వారా ప్రైవేట్ హాస్పిటల్స్ లో డయాలసిస్ తీసుకుంటూ ఉన్నవారు. ( స్టేజ్ 3, 4 & 5)
వయో పరిమితి లేదు.
ట్రాన్స్ జెండర్ పెన్షన్ 18 సంవత్సరాలు ఆ పైన వయస్సు కలవారు.
ప్రభుత్వ వైద్య ఆరోగ్య శాఖ వారి ధ్రువీకరణ పత్రం కలిగినవారు.
ఒంటరి మహిళ పెన్షన్ వయస్సు 35 సంవత్సరాలు మరియు ఆపైన కలిగి ఉండి, చట్ట ప్రకారం భర్త నుండి విడాకులు పొందినవారు, భర్త నుండి విడిపోయిన వారు (విడిపోయిన కాలవ్యవధి ఒక సంవత్సరం పైగా ఉండాలి.) గ్రామీణ మరియు పట్టణ ప్రాంతాలలో నివసిస్తున్న వారు, భర్త నుండి విడిపోయినట్లు గా ఎటువంటి ధ్రువీకరణ పత్రం లేనివారు గ్రామ / వార్డు స్థాయిలో ప్రభుత్వ అధికారుల సాక్షాలతో తాసిల్దారుగారి ధ్రువీకరణ పత్రం పొంది ఉండాలి.
అవివాహితులుగా ఉండి ఎటువంటి ఆదరణ లేకుండా ఒంటరిగా జీవిస్తూ ఉన్న వారు, గ్రామాలలో ఉన్న వారికి వయస్సు 30 సంవత్సరములు మరియు పట్టణ ప్రాంతంలో ఉన్న వారికి వయస్సు 35 సంవత్సరాలు, ఆపైన కలిగి ఉండాలి. పెన్షన్ మంజూరు అనంతరం వారు వివాహం చేసుకుని ఉన్నా లేదా ఆర్ధిక పరముగా జీవనోపాధి పొందిన తక్షణమే పెన్షను నిలిపి వేసే బాధ్యత సంబంధిత పెన్షన్ పంపిణీ అధికారి వారికి అనుమతి ఉన్నది. (ప్రతి నెల పెన్షన్ పంపిణీ అధికారి ఆమె పరిస్థితి పరిశీలించాలి.)
డప్పు కళాకారుల పెన్షన్ వయస్సు 50 సంవత్సరంలు మరియు ఆ పైన కలవారు.
సాంఘిక సంక్షేమ శాఖ వారిచే గుర్తింపు పొందిన వారై ఉండాలి.
చర్మకారుల పెన్షన్ వయసు 40 సంవత్సరాలు మరియు ఆ పైన కలవారు.
లబ్ధిదారుల జాబితా సాంఘిక సంక్షేమ శాఖ అందజేస్తుంది.
అభయ హస్తం పెన్షన్ స్వయం సహాయక సంఘాల సభ్యులు ఎవరైతే అభయహస్తం పథకంలో వారి కాంట్రిబ్యూషన్ చెల్లించి ఉండి, 60 సంవత్సరాల వయస్సు కలవారు.

మార్చి నెల పెన్షన్ కంపెనీకి సంబంధించిన సమాచారం

కులం, మతం పార్టీలకతీతంగా సంక్షేమ పథకాలను వర్తింపజేస్తూ రాష్ట్రంలోని వృద్ధులు దివ్యాంగులు మరియు వితంతులకు ఆర్థిక సహాయాన్ని అందించడమే ప్రధాన లక్ష్యంగా పెన్షన్ పంపిణి చేస్తున్నారు. మార్చి నెల ఒకటి నుండి 5వ తారీఖు వరకు youపెన్షన్ పంపిణీ జరుగుతుంది.

పెన్షన్ పంపిణీ సమయంలో ఉపయోగపడే మొబైల్ అప్లికేషన్ లు

You cannot copy content of this page