మహిళా దినోత్సవం సందర్భంగా కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలకు గుడ్ న్యూస్ తెలిపింది.
వంట గ్యాస్ పై మరో వంద రూపాయలు తగ్గిస్తున్నట్లు ప్రకటించింది. స్వయంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఈ విషయంపై తన ఎక్స్ ఖాతా లో వెల్లడించారు.
తగ్గించిన సిలిండర్ ధర మహిళా దినోత్సవం అనగా మార్చ్ 8 తర్వాత బుక్ చేసిన సిలిండర్లన్నిటికీ వర్తించనుంది.
గత ఏడాది ఏకంగా 200 రూపాయలను వంట గ్యాస్ పై తగ్గించినటువంటి కేంద్రం, సరిగ్గా ఎన్నికలకు నెలరోజుల ముందు మరో 100 రూపాయలు తగ్గించడం గమనార్హం.
హైదరాబాదులో 955గా ఉన్నటువంటి సిలిండర్ ధర ఇకనుంచి 855 కే లభించనుంది.
మహిళా సాధికారతకు మహిళా దినోత్సవం రోజున కేంద్ర ప్రభుత్వం అందిస్తున్నటువంటి కానుకగా దీనిని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తన ఎక్స్ మెసేజ్ లో తెలిపారు.