గృహ నిర్మాణ పథకం పై మంత్రి కొలుసు పార్థసారథి కీలక అప్డేట్ తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా గృహ నిర్మాణ శాఖపై ముఖ్యమంత్రితో జరిగిన సమీక్ష సమావేశం కి సంబంధించి వివరాలను వెల్లడించారు.
గృహ నిర్మాణ శాఖపై కీలక నిర్ణయాలు ఇవే
- ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో వచ్చే 100 రోజుల్లో లక్ష 25 వేల ఇళ్లను నిర్మించనున్నట్లు మంత్రి వెల్లడించారు.
- రాష్ట్రంలో వివిధ దశల్లో నిర్మాణ దశలో ఉన్నటువంటి ₹8,25000 వచ్చే సంవత్సర కాలంలో పూర్తి చేస్తామని ఆయన వెల్లడించారు.
- గతంలో ఎన్టీఆర్ హౌసింగ్ పథకం ద్వారా లబ్ధి పొందిన లబ్ధిదారులకు ఇవ్వాల్సిన బకాయిలను గత ప్రభుత్వం ఇవ్వలేదని వాటిని ఇప్పుడు ఇస్తామని ఆయన తెలిపారు.
- ఏపీలో వివిధ లేఔట్ లలో మరియు ప్రభుత్వ స్థలాల్లో మిగిలిపోయిన భూములను పేదలకు పట్టణ ప్రాంతాల్లో రెండు సెంట్లు గ్రామీణ ప్రాంతాల్లో మూడు సెంట్లు చొప్పున పంపిణీ చేస్తామని తెలిపారు
- పేదలందరికీ ఇచ్చే ఉచిత ఇళ్ల పథకానికి అర్హత లేనటువంటి జర్నలిస్టులు, లో ఇన్కమ్ గ్రూప్, మిడిల్ ఇన్కమ్ గ్రూప్ లో ఉన్నటువంటి వారికి హౌసింగ్ బోర్డ్ ల ద్వారా నాణ్యమైన ఇళ్ళను కట్టించి అతి తక్కువ ధరలకు అందజేస్తామని తెలిపారు.
- అదేవిధంగా ప్రధానమంత్రి ఆవాస్ యోజన ద్వారా నాలుగు లక్షల రూపాయల యూనిట్ ధర వచ్చే పథకంలో భాగంగా ఏపీ నుంచి సాధ్యమైన చోట లబ్ధిదారులను గుర్తించి నాలుగు లక్షలు నిర్మాణానికి అందిస్తామని తెలిపారు.
గత ప్రభుత్వం 1.80 వేల రూపాయలు మాత్రమే యూనిట్ దర్గా లబ్ధిదారులకు కేటాయించిందని గత తెలుగుదేశం ప్రభుత్వంలో ఇచ్చిన రెండు లక్షల కూడా ఇవ్వలేదని, ఎస్సీ ఎస్టీలకు అదనంగా ఇచ్చే 50 వేల రూపాయల అమౌంట్ కూడా గత ప్రభుత్వం ఇవ్వలేదని కూడా మంత్రి విమర్శించారు. మొత్తానికి ఆంధ్రప్రదేశ్ లో త్వరలో కేంద్ర ప్రభుత్వ సహాయంతో రాష్ట్ర ప్రభుత్వం సంయుక్తంగా సాధ్యమైన ఎక్కువ నిర్మించి ఇస్తుందని అవసరమైన చోట స్థలాలను కూడా పంపిణీ చేస్తుందని ఆయన పేర్కొనటం జరిగింది.
మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన వాట్సాప్ ఛానల్ లో జాయిన్ అవ్వండి.