Pension Update: జూన్ నెల పెన్షన్ నేరుగా బ్యాంక్ ఖాతాలో

Pension Update: జూన్ నెల పెన్షన్ నేరుగా బ్యాంక్ ఖాతాలో

పెన్షన్ పంపిణీ సజావుగా జరిపించాలని లబ్ధిదారులకు ఇబ్బంది లేకుండా కుదిరితే ఇంటి వద్దనే పెన్షన్ పంపిణీ చేయాలని లేదంటే బ్యాంక్ ఖాతాలో నేరుగా జమ చేయాలని ఎన్నికల కమిషన్ రాష్ట్ర సీఎస్ కు ఆదేశాలు ఇటీవల జారీ చేయడం జరిగింది.

ఈ ఆదేశాలను పరిగణలోకి తీసుకున్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. పెన్షన్ అమౌంట్ ను నేరుగా లబ్ధిదారుల బ్యాంక్ ఖాతాలో జమ చేయాలని నిర్ణయం తీసుకుంది.

ఈ నిర్ణయంతో ఎలాంటి అవకతవకలకు త్రావు లేకుండా వాలంటీర్ల ప్రమేయం కానీ లేదా సచివాలయ సిబ్బంది ప్రమేయం గాని లేకుండా నేరుగా లబ్ధిదారుల బ్యాంక్ ఖాతాలో డి బి టీ పద్ధతిలో అమౌంట్ జమకానుంది. ఆధార్ తో బ్యాంకు ఖాతా అనుసంధానమైన లబ్ధిదారులందరికీ ఈ dbt పద్ధతిలో ప్రభుత్వం నేరుగా అమౌంటును వారి ఖాతాలో జమ చేయనున్నట్లు పేర్కొంది.

అయితే ఎవరికైతే బ్యాంక్ ఖాతాలో జమ చేయడానికి ఇబ్బంది ఉంటుందో వారికి డోర్ టు డోర్ అనగా వారి ఇంటి వద్దనే పంపిణీ చేసేందుకు ఆదేశాలు ఇచ్చింది. అంతేకాకుండా దివ్యాంగులు మరియు మంచానికే పరమతమైనటువంటి వారు లేదా తీవ్రమైనటువంటి అనారోగ్యంతో బాధపడే వారందరికీ కూడా ఇంటి వద్దనే పెన్షన్ ఇవ్వాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.

దాదాపు 74% పైనే లబ్ధిదారులకు నేరుగా బ్యాంక్ ఖాతాలో అమౌంట్ జమ చేయనున్నట్లు తెలుస్తోంది. మిగిలిన వారికి అనగా పైన పేర్కొన్నటువంటి వారికి ఇంటి వద్దనే పెన్షన్ పంపిణీ చేసే విధంగా ప్రభుత్వం మార్గదర్శకాలు జారీ చేసింది.

ఇందుకు సంబంధించినటువంటి విధివిధానాలను రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసింది. దీనిపై జిల్లా కలెక్టర్లకు కీలక ఆదేశాలు జారీ చేయడం జరిగింది.

జూన్ నెల పంపిణీ సంబంధించి ప్రజలు ఇబ్బంది కి గురి కాకుండా మార్చి 30 న  జారీ చేసినటువంటి ఆదేశాలను అనుసరించాలని ఈసీ  మరోసారి స్పష్టం చేసిన నేపథ్యంలో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.

ప్రభుత్వం జారీ చేసిన మార్గదర్శకాలు ఇక్కడ డౌన్లోడ్ చేసుకోండి.

పెన్షన్ పంపిణీ సంబంధించి మార్గదర్శకాలు

  • దివ్యాంగులు మరియు వీల్ చైర్ కి పరిమితమై నడవలేని స్థితిలో ఉన్నవారికి ఇంటి వద్దనే పెన్షన్ పంపిణీ
  • మిగిలిన వారందరికీ గ్రామ వార్డు సచివాలయాల వద్ద పెన్షన్ పంపిణీ ఉంటుంది
  • సచివాలయాలు ఉదయం తొమ్మిది గంటల నుంచి సాయంత్రం ఏడు గంటల వరకు పెన్షన్ పంపిణీ కొరకై తెరిచి ఉంటాయి.

జూన్ నెల పెన్షన్ పంపిణీ నియమాలు

  • MPDO / MC వారు పెన్షన్ను పంపిణీ చేయు వారి వివరాలను సంబంధిత రిటర్నింగ్ అధికారి (RO) వారికి ముందుగానే తెలియజేయాలి.
  • పెన్షన్ పంపిణీ ధ్రువీకరణ పత్రమును MPDO వారు వారి పరిధిలో ఉన్నటువంటి పంచాయతీకార్యదర్శులు PS మరియు వెల్ఫేర్ అండ్ ఎడ్యుకేషన్ అసిస్టెంట్ WEA వారికి, MC వారు వారి పరిధిలోనివార్డ్ అడ్మిన్ సెక్రటరీ WAS మరియు వార్డ్ వెల్ఫేర్ డెవలప్మెంట్ సెక్రటరీ WWDS వారికి అందించవలెను.సచివాలయాల పేర్లు, నగదు వివరాలతో కూడిన ధ్రువీకరణ పత్రములు MPDO/MC వారి లాగిన్ లొఅందుబాటులో ఉంటాయి.
  • PS & WEA, WAS & WWDS వారు ధ్రువీకరణ పత్రమును సంబంధిత వాలంటీర్లు అందరికీకూడా అందించవలెను. పెన్షన్ పంపిణీ చేయు సమయంలో తప్పనిసరిగా ధ్రువీకరణ పత్రమును వారి వద్దఉంచుకోవాలని. సచివాలయంలో వాలంటీర్లకు ఇవ్వవలసిన ధ్రువీకరణ పత్రము WEA/WWDS వారిలాగిన్ లొ అందుబాటులో ఉంటుంది.
  • PS, WEA, WAS, WWSS, VOLUNTEERS తప్పనిసరిగా ఒరిజినల్ ధ్రువీకరణ పత్రమునునగదును బ్యాంకు నుండి తీసుకునే సమయం నుండి పంపిణీ పూర్తి అయ్యేంతవరకు తమ వద్దఉంచుకోవలసి ఉంటుంది .
  • పెన్షన్ పంపిణీ చేయి సమయంలో ఎటువంటి పబ్లిసిటీ చేయరాదు. ఫోటోలు గాని వీడియోలు గానిపంపిణీ చేసే సమయంలో తీయరాదు. తప్పనిసరిగా ఎలక్షన్ కోడ్ నియమాలను పాటించాలి.

April Month Pension Documents

జూన్ నెల పెన్షన్ పంపిణికి సంబంధించిన సమాచారం

కులం, మతం పార్టీలకతీతంగా సంక్షేమ పథకాలను వర్తింపజేస్తూ రాష్ట్రంలోని వృద్ధులు దివ్యాంగులు మరియు వితంతులకు ఆర్థిక సహాయాన్ని అందించడమే ప్రధాన లక్ష్యంగా పెన్షన్ పంపిణి చేస్తున్నారు. జూన్ నెల 1 నుండి 5వ తారీఖు వరకు గ్రామ,వార్డు సచివాలయాలలో పెన్షన్ పంపిణీ జరుగుతుంది.

పెన్షన్ అమౌంట్ ఎంత?

పెన్షన్అమౌంట్
ART (PLHIV) వ్యక్తులు3000/-
సంప్రదాయ చెప్పులు కుట్టేవారు3000/-
వికలాంగులు3000/-
లింగమార్పిడి చేసుకున్న వ్యక్తులు3,000/
డప్పు కళాకారులు3,000/
దీర్ఘకాలిక కిడ్నీ వ్యాధితో బాధపడుతూ ప్రభుత్వం మరియు నెట్‌వర్క్ ఆసుపత్రులలో డయాలసిస్ చేయించుకుంటున్న వ్యక్తులు10,000/-

వైయస్సార్ పెన్షన్ కానుక అర్హత ప్రమాణాలు

పెన్షన్అర్హతలు
వృద్ధాప్య పెన్షన్60 సంవత్సరాలు మరియు ఆపై వయస్సు కలవారు అర్హులు.
గిరిజనులు 50 సంవత్సరాలు ఆపై వయస్సు కలవారు అర్హులు
వితంతు పెన్షన్ వివాహ చట్టం ప్రకారం 18 సంవత్సరాలు ఆ పై వయస్సు కలవారు.
భర్త మరణ ధ్రువీకరణ పత్రం లేదా డెత్ సర్టిఫికెట్ కలిగి ఉండాలి
వికలాంగుల పెన్షన్ 40% మరియు అంతకన్నా ఎక్కువ వికలత్వం కలిగి ఉన్నవారు మరియు
సదరం సర్టిఫికెట్ కలిగి ఉన్న వారు. వీరికి వయోపరిమితి లేదు
చేనేత కార్మికుల పెన్షన్వయస్సు 50 సంవత్సరాలు మరియు యు ఆ పైన కలవారు.
చేనేత మరియు జౌళి శాఖ వారిచే గుర్తింపు పత్రం కలిగినవారు
కల్లు గీత కార్మికుల పింఛన్వయస్సు 50 సంవత్సరాలు మరియు ఆపైన కలవారు.
ఎక్సైజ్ శాఖ వారిచే గుర్తింపు పత్రం కలిగినవారు.
మత్స్యకారుల పెన్షన్ వయస్సు 50 సంవత్సరములు మరియు ఆ పైన కలవారు.
మత్స్య శాఖ వారిచే గుర్తింపు పత్రం కలిగినవారు.
హెచ్ఐవి(PL HIV) బాధితులు పెన్షన్వయో పరిమితి లేదు.
ఆరు నెలలు వరుసగా ART treatment Therapy(యాంటీ రిట్రో వైరల్ థెరపీ) తీసుకున్నవారు.
డయాలసిస్ (CKDU) పెన్షన్వయస్సుతో సంబంధం లేకుండా ప్రభుత్వ హాస్పిటల్స్ మరియు వైఎస్సార్ ఆరోగ్యశ్రీ పథకం ద్వారా ప్రైవేట్ హాస్పిటల్స్ లో డయాలసిస్ తీసుకుంటూ ఉన్నవారు. ( స్టేజ్ 3, 4 & 5)
వయో పరిమితి లేదు.
ట్రాన్స్ జెండర్ పెన్షన్ 18 సంవత్సరాలు ఆ పైన వయస్సు కలవారు.
ప్రభుత్వ వైద్య ఆరోగ్య శాఖ వారి ధ్రువీకరణ పత్రం కలిగినవారు.
ఒంటరి మహిళ పెన్షన్ వయస్సు 35 సంవత్సరాలు మరియు ఆపైన కలిగి ఉండి, చట్ట ప్రకారం భర్త నుండి విడాకులు పొందినవారు, భర్త నుండి విడిపోయిన వారు (విడిపోయిన కాలవ్యవధి ఒక సంవత్సరం పైగా ఉండాలి.) గ్రామీణ మరియు పట్టణ ప్రాంతాలలో నివసిస్తున్న వారు, భర్త నుండి విడిపోయినట్లు గా ఎటువంటి ధ్రువీకరణ పత్రం లేనివారు గ్రామ / వార్డు స్థాయిలో ప్రభుత్వ అధికారుల సాక్షాలతో తాసిల్దారుగారి ధ్రువీకరణ పత్రం పొంది ఉండాలి.
అవివాహితులుగా ఉండి ఎటువంటి ఆదరణ లేకుండా ఒంటరిగా జీవిస్తూ ఉన్న వారు, గ్రామాలలో ఉన్న వారికి వయస్సు 30 సంవత్సరములు మరియు పట్టణ ప్రాంతంలో ఉన్న వారికి వయస్సు 35 సంవత్సరాలు, ఆపైన కలిగి ఉండాలి. పెన్షన్ మంజూరు అనంతరం వారు వివాహం చేసుకుని ఉన్నా లేదా ఆర్ధిక పరముగా జీవనోపాధి పొందిన తక్షణమే పెన్షను నిలిపి వేసే బాధ్యత సంబంధిత పెన్షన్ పంపిణీ అధికారి వారికి అనుమతి ఉన్నది. (ప్రతి నెల పెన్షన్ పంపిణీ అధికారి ఆమె పరిస్థితి పరిశీలించాలి.)
డప్పు కళాకారుల పెన్షన్ వయస్సు 50 సంవత్సరంలు మరియు ఆ పైన కలవారు.
సాంఘిక సంక్షేమ శాఖ వారిచే గుర్తింపు పొందిన వారై ఉండాలి.
చర్మకారుల పెన్షన్ వయసు 40 సంవత్సరాలు మరియు ఆ పైన కలవారు.
లబ్ధిదారుల జాబితా సాంఘిక సంక్షేమ శాఖ అందజేస్తుంది.
అభయ హస్తం పెన్షన్ స్వయం సహాయక సంఘాల సభ్యులు ఎవరైతే అభయహస్తం పథకంలో వారి కాంట్రిబ్యూషన్ చెల్లించి ఉండి, 60 సంవత్సరాల వయస్సు కలవారు.

పెన్షన్ పంపిణీ సమయంలో ఉపయోగపడే మొబైల్ అప్లికేషన్ లు

You cannot copy content of this page