టీడీపీ జనసేన మ్యానిఫెస్టోలో అదిరిపోయే పథకాలు ఇవే

టీడీపీ జనసేన మ్యానిఫెస్టోలో అదిరిపోయే పథకాలు ఇవే

సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో తెలుగుదేశం పార్టీ మరియు జనసేన ఉమ్మడి మేనిఫెస్టోను విడుదల చేసింది. టిడిపి జనసేన ఉమ్మడి మేనిఫెస్టో లో భాగంగా పలు కీలక పథకాలను ఎన్డీఏ కూటమి ప్రకటించింది.

టిడిపి జనసేన ప్రకటించిన మేనిఫెస్టోలోని కీలక పథకాలు ఇవే

వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రస్తుత పథకాలను కొనసాగించగా తెలుగుదేశం పార్టీ కొంచెం ముందు అడుగు వేసి పలు సరికొత్త పథకాలను ప్రవేశపెట్టింది.

తెలుగుదేశం పార్టీ ప్రకటించినటువంటి పథకాలలో ముఖ్యమైనవి ఇవే..

మహిళలకు కోసం ప్రవేశ పెట్టిన కొత్త పథకాలు:

ప్రతినెల 1500 రూపాయలు: 18 నుంచి 59 ఏళ్ల వరకు రాష్ట్రవ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి మహిళకు ఆడబిడ్డ నిధి పథకం కింద ప్రతినెల 1500 రూపాయలు నేరుగా వారి బ్యాంకు ఖాతాలో జమ చేయనున్నట్లు మేనిఫెస్టో లో ప్రకటించడం జరిగింది. అంటే ప్రతి ఏటా 18 వేల రూపాయలు ఎటువంటి కుల ప్రాతిపదికన కాకుండా నేరుగా మహిళల ఖాతాలో తెలుగుదేశం జనసేన ప్రభుత్వం జమ చేయనుంది.

ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం: కర్ణాటక మరియు తెలంగాణ రాష్ట్రాల మాదిరిగానే ఆంధ్రప్రదేశ్ లో కూడా తెలుగుదేశం జనసేన కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తే రాష్ట్ర వ్యాప్తంగా ఏపీఎస్ఆర్టీసీ బస్సులలో మహిళలకు ఉచిత ప్రయాణ సౌకర్యాలు కల్పించినట్లు ఎన్డీఏ కూటమి తమ మేనిఫెస్టోలో పొందుపరిచింది. స్థానికత ఆధారంగా ఆధార్ కార్డు లేదా ఏదైనా స్థానిక అడ్రెస్ ప్రూఫ్ చూపించి రాష్ట్రంలో ఎక్కడి నుంచి ఎక్కడికైనా ఉచితంగా బస్సు ప్రయాణం చేయవచ్చు.

మహిళలకు వడ్డీ లేని రుణాలు: తాము అధికారంలోకి వస్తే కేంద్ర ప్రభుత్వ సహకారంతోటి మహిళలకు వడ్డీ లేని రుణాలను అందిస్తామని ఎన్డీఏ కూటమి ప్రకటించింది.

రైతుల కోసం అన్నదాత

తెలుగుదేశం జనసేన కుటుంబంకు అధికారంలోకి వస్తే ప్రతి ఏటా రైతుల ఖాతాలో ఏకంగా 20వేల రూపాయలు జమ చేయనున్నట్లు కూటమి ప్రకటించింది. అన్నదాత పథకం ద్వారా గతంలో ఇచ్చిన మాదిరిగానే ఈసారి కూడా రైతులకు పెట్టుబడి సహాయాన్ని రాష్ట్ర ప్రభుత్వం అందించనుంది.

ప్రస్తుతం రైతు భరోసా మరియు పీఎం కిసాన్ కలుపుకొని 13500 ఇస్తుండగా ఇకపై కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ సహాయాలు కలుపుకొని తెలుగుదేశం ప్రభుత్వం ఏకంగా 20వేల రూపాయలను రైతుల ఖాతాలో ప్రతి ఏటా జమ చేయనుంది.

విద్యార్థులకు సంబంధించిన పథకాలు

ప్రతి ఏటా 15000: ప్రస్తుతం వైఎస్ఆర్సిపి ప్రభుత్వం ఇస్తున్నటువంటి అమ్మఒడి పథకాలను కేవలం కుటుంబంలో ఒక బిడ్డకు మాత్రమే వర్తిస్తుంది. అయితే తెలుగుదేశం జనసేన ప్రభుత్వం వస్తే ఒక కుటుంబంలో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది పిల్లలకు 15వేల రూపాయలు ప్రతి ఏటా తాము చెల్లిస్తామని వెల్లడించింది.

కాలేజ్ ఫీజులు నేరుగా కళాశాలలకే:

తెలుగుదేశం జనసేన కూటమి అధికారంలోకి వస్తే పై చదువులు చదువుతున్నటువంటి విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్ అమౌంటును నేరుగా కళాశాలలకే తాము చెల్లిస్తామని కూటమి వెల్లడించింది. ప్రస్తుతం విద్యా దీవెన కింద అందిస్తున్నటువంటి అమౌంటు విద్యార్థులు లేదా తల్లుల జాయింట్ ఖాతాలో జమ అవుతుండగా వాటిని తిరిగి కళాశాలలకు జమ చేయాల్సి ఉంటుంది. ఇందులో ఆలస్యమై విద్యార్థులు ఇబ్బందులు పడుతున్న నేపథ్యంలో, గతంలో మాదిరిగానే ఫీజ్ రీయింబర్స్మెంట్ అమౌంట్ నేరుగా కళాశాలల ఖాతాలో ని జమ చేయనున్నట్లు కూటమి వెల్లడించింది.

నిరుద్యోగులకు బంపర్ ఆఫర్:

తెలుగుదేశం జనసేన కూటమి అధికారంలోకి వస్తే రాబోయే 5 ఏళ్లలో 20 లక్షల ఉద్యోగాల కల్పన…. ఏటా 4 లక్షల ఉద్యోగాల నియామకం

నిరుద్యోగులకు నెలకు 3 వేల రూపాయల చొప్పున నిరుద్యోగ భృతి.

You cannot copy content of this page