తెలంగాణలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన ఫిబ్రవరి 4న జరిగినటువంటి క్యాబినెట్ సమావేశంలో ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకోవడం జరిగింది.
ప్రభుత్వం తీసుకున్నటువంటి కీలక నిర్ణయాలలో తెలంగాణ రాష్ట్ర గీతంగా జయ జయహే తెలంగాణ గీతాన్ని ఆమోదిస్తూ క్యాబినెట్ నిర్ణయించింది.
ఈ నేపథ్యంలో జయ జయహే తెలంగాణ పాట రచయిత ఎవరు మరియు దీని ప్రత్యేకతలు ఏంటో తెలుసుకుందాం.
తెలంగాణ ఉద్యమ నేపథ్యంలో ప్రజలను ఎంతగానో చైతన్యపరిచినటువంటి గీతం “జయ జయహే తెలంగాణ” ను తెలంగాణ ప్రముఖ రచయిత అందెశ్రీ రచించారు. ఈయన జూలై 18, 1961 సిద్దిపేట జిల్లాలో జన్మించారు. అందెశ్రీ గారు సినీ గేయ రచయిత మరియు సంభాషణ రచయితకు కూడా పనిచేశారు. జయ జయహే తెలంగాణ పాటను చాలా స్కూళ్ల లో ఉద్యమ సమయంలో పాడటం జరిగింది.
ఇంతటి ప్రాముఖ్యత ఉన్నటువంటి ఈ గేయాన్ని రాష్ట్ర గీతంగా ఆమోదించాలని గతంలో పలువురు డిమాండ్ చేసినప్పటికీ ఇది రాష్ట్ర గీతంగా ఇంకా ఆమోదింపబడలేదని 2016లో అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ అసెంబ్లీలో వెల్లడించారు. అయితే ఇటీవల జరిగినటువంటి క్యాబినెట్ సమావేశంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన ఫిబ్రవరి 4 2024న ఈ గీతాన్ని రాష్ట్ర గీతంగా ఆమోదిస్తూ క్యాబినెట్ కీలక నిర్ణయం తీసుకుంది.
జయ జయహే తెలంగాణ పాట లిరిక్స్
జయ జయహే తెలంగాణ జననీ జయకేతనం
ముక్కోటి గొంతుకలు ఒక్కటైన చేతనం
తరతరాల చరితగల తల్లీ నీరాజనం
పది జిల్లల నీ పిల్లలు ప్రణమిల్లిన శుభతరుణం
జై తెలంగాణ – జై జై తెలంగాణ!
పొతనది పురిటిగడ్డ, రుద్రమది వీరగడ్డ
గండరగండడు కొమురం భీముడే నీ బిడ్డ
కాకతీయ కళాప్రభల కాంతిరేఖ రామప్ప
గొలుకొండ నవాబుల గొప్ప వెలుగే చార్ మినార్
జై తెలంగాణ – జై జై తెలంగాణ!
జానపద జన జీవన జావలీలు జాలువారే
కవి గాయక వైతాళిక కళలా మంజీరాలు
జాతిని జాగృత పరిచే గీతాల జన జాతర
అనునిత్యం నీ గానం అమ్మ నీవే మా ప్రాణం
జై తెలంగాణ – జై జై తెలంగాణ!
గొదావరి కృష్ణమ్మలు మన బీళ్ళకు మళ్ళాలి
పచ్చని మాగాణాల్లో పసిడి సిరులు పండాలి
సుఖశాంతుల తెలంగాణ సుభిక్షంగా ఉండాలే
స్వరాష్ట్ర్రమై తెలంగాణ స్వర్ణ యుగం కావాలి
జై తెలంగాణ – జై జై తెలంగాణ!