జనవరి నెల పెన్షన్ పంపిణీకి సంబంధించిన సమాచారం

జనవరి నెల పెన్షన్ పంపిణీకి సంబంధించిన సమాచారం

జనవరి నెల నుండి పెన్షన్ అమౌంట్ ను రూ.2,750/- నుండి రూ.3,000/- వరకు పెంచుతూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

జనవరి 3న కాకినాడ పర్యటనలో భాగంగా పెన్షన్ పెంపు (₹3000) కార్యక్రమాన్ని ప్రారంభించనున్న ముఖ్యమంత్రి.

  • జనవరి 1 నుండి 8, 2024 వరకు అన్ని మండల మరియు మునిసిపల్ హెడ్ క్వార్టర్స్ లో పెన్షన్ పెంపు మహోత్సవాలు పండుగ రీతిలో జరుపుకోవాలని ప్రభుత్వం నిర్ణయించింది.
  • మండల/మున్సిపల్ స్థాయి కార్యక్రమం 1వ తేదీ నుండి 8 జనవరి, 2024 వరకు జరుగుతుంది. ఈ కార్యక్రమంలో ప్రజా ప్రతినిధులందరూ పాల్గొని, 1 జనవరి, 2024 నుండి జనవరి 8, 2024 వరకు పెన్షనర్లకు రూ.3,000 పెంచిన పెన్షన్ మొత్తాన్ని అందజేస్తారు.
  • వాలంటీర్లందరూ ఎప్పటిలాగే పెన్షన్ దారులకు ఇంటి వద్దకు వెళ్లి పెన్షన్ మొత్తాన్ని పంపిణీ చేస్తారు.
  • పెన్షన్‌ల పంపిణీ సమయంలో గౌరవ. ముఖ్యమంత్రి వర్యుల  లేఖను పెన్షనర్‌లకు అందజేయాలి.
  • ఈ నెల పెన్షన్ పంపిణీ 1 జనవరి, 2024 నుండి ప్రారంభమవుతుంది మరియు పెన్షన్ పంపిణీ పూర్తయ్యే వరకు పెన్షన్ పంపిణీ జరుగుతూనే ఉంటుంది.

పెన్షన్ పంపిణీ కి సంబంధించిన సమాచారం

కులం, మతం, పార్టీలకు అతీతంగా, అర్హతే ప్రామాణికంగా సంక్షేమ పథకాలను వర్తింపజేస్తామని, సామాజిక పింఛన్‌లకు ఇచ్చే నగదును ఏటా పెంచుతామని ఇచ్చిన హామీని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌రెడ్డి నెరవేరుస్తున్నారు. అవ్వాతాతలు, దివ్యాంగులు, వితంతువుల జీవితాల్లో వెలుగులు నింపేలా వైఎస్సార్ పింఛన్ కానుక పథకాన్ని అమలు చేస్తున్నారు.

ఇంకా ఎవరైనా అర్హులు ఉండి, దరఖాస్తు చేసు కుంటే వారికి సైతం పింఛన్లు మంజూరు చేస్తున్నారు. ఒకటో తేదీ తెల్లవారుజాము నుంచి ఐదో తేదీలోగా లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి వలంటీర్లు పింఛన్లు అందజేస్తున్నారు. ఆయా పింఛన్లకు ఇంకా ఎవరైనా అర్హులు ఉంటే గ్రామ/వార్డు సచివాలయాల ద్వారా గ్రామీణాభివృద్ధి సంస్థ అధికారులు లబ్దిదారులుగా గుర్తిస్తున్నారు.

జనవరి నెలలో కొత్తగా మంజూరు అయ్యి మిస్ అయిన పెన్షన్లకు సంబంధించిన సమాచారం

  • కొన్ని పెన్షన్ అప్లికేషన్స్ వివిధ టెక్నికల్ కారణాలవలన వెరిఫికేషన్ కు రావడం జరగలేదు అటువంటి పెండింగ్ అప్లికేషన్స్ MPDO / మునిసిపల్ కమీషనర్ గార్ల మొబైల్ అప్ కు వెరిఫికేషన్ కు ఇవ్వడం జరుగుతుంది.
  • ఈ పెండింగ్ అప్లికేషన్స్ అన్నీ కూడా 2వ తారీకు సాయంత్రానికి వెరిఫికేషన్ పూర్తి చేసిన అర్హులైన పెన్షన్ దారులందరికి ౩వ తారీకున అమౌంట్ రిలీజ్ చెయ్యడం జరుగుతుంది.
  • అర్హులైన ప్రతి పెన్షన్ దారునికి పెన్షన్ అమౌంట్ రిలీజ్ చెయ్యడం జరుగుతుంది. ఈ విషయం అన్ని గ్రామ / వార్డు సచివాలయముల వారికి తెలియ జేయవల్సినదిగా కోరడమైనది.

పెన్షన్ పంపిణీ సమయంలో ఉపయోగపడే మొబైల్ అప్లికేషన్ లు

You cannot copy content of this page