Jagananna Vidya Deevena Amount Release today : నేడే విద్యా దీవెన అమౌంట్… విద్యార్థుల తల్లుల ఖాతాల్లో జమ..

Jagananna Vidya Deevena Amount Release today : నేడే విద్యా దీవెన అమౌంట్… విద్యార్థుల తల్లుల ఖాతాల్లో జమ..

జగనన్న విద్యా దీవెన డబ్బుల విడుదల కార్యక్రమం ఈ రోజు (డిసెంబర్‌ 29) జరగనుంది. జగనన్న విద్యాదీవెన (Jagananna Vidya Deevena) పథకం కింద పూర్తి ఫీజు రీయింబర్స్‌మెంట్‌లో భాగంగా 2023–24 విద్యా సంవత్సరంలో జూలై–సెప్టెంబర్‌ త్రైమాసికానికి సంబంధించి అర్హులైన 8,09,039 మంది విద్యార్థులకు రూ.584 కోట్లు జమ చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో శుక్రవారం జరిగే కార్యక్రమంలో సీఎం వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి బటన్‌ నొక్కి ఈ మొత్తాన్ని లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేయనున్నారు.

ఈరోజు విడుదల చేసే మొత్తంతో కలిపి జగనన్న విద్యా దీవెన, వసతి దీవెన పథకాల కింద వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం ఇప్పటివరకు రూ.18,576 కోట్లు ఖర్చు చేసింది. పేద విద్యార్థులు కూడా పెద్ద చదువులు చదవా­లన్న సమున్నత లక్ష్యంతో ఐటీఐ, పాలిటెక్నిక్, డిగ్రీ, ఇంజినీరింగ్, మెడిసిన్‌ తదితర కోర్సులు చదివే పేద విద్యార్థులు కాలేజీలకు చెల్లించాల్సిన పూర్తి ఫీజుల మొత్తాన్ని క్రమం తప్పకుండా ఏ త్రైమాసికానికి ఆ త్రైమాసికం ముగిసిన వెంటనే కుటుంబంలో ఎంతమంది పిల్లలుంటే అంతమంది కీ ఇచ్చేలా తల్లులు–విద్యార్థుల జాయింట్‌ అకౌంట్‌లో నేరుగా జమ చేస్తున్న విషయం తెలిసిందే.

జగనన్న విద్యా దీవెన (Jagananna Vidya Deevena) స్కీమ్ ద్వారా రాష్ట్రంలో ఉన్నత విద్య కోర్సులు చదువుకునే విద్యార్థులకు ఆర్థిక ఇబ్బందులు తలెత్తకుండా ప్రభుత్వం ఆర్థిక సాయం అందిస్తోంది. ఐటీఐ, పాలిటెక్నిక్, డిగ్రీ, ఇంజినీరింగ్, మెడికల్, ఇతర కోర్సులు చదివే ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ విద్యార్థులకు డబ్బులను వారి తల్లుల ఖాతాల్లో జమ.

కింద ఇవ్వబడిన అన్ని స్టెప్స్ చదివి స్టెప్ 1 లో ఉన్న లింక్ ను క్లిక్ చేసి స్టేటస్ చేసుకోగలరు.

STEP 1: Jnanabhumi అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించండి.

STEP 2 : హోమ్ పేజీ లో లాగిన్ బటన్ పైన క్లిక్ చెయ్యాలి

studybizz

STEP 3 : మీ లాగిన్ డీటైల్స్ ఎంటర్ చేసి, captcha code ఎంటర్ చేసి లాగిన్ బటన్ పైన క్లిక్ చెయ్యాలి.

studybizz

STEP 4 : సైడ్ మెనూ లో VIEW/ PRINT SCHOLORSHIP APPLICATION STATUS ఆప్షన్ పైన క్లిక్ చెయ్యాలి

studybizz

STEP 5 : ఏ విద్య సంవత్సరానికి పేమెంట్ స్టేటస్ చెక్ చెయ్యాలో, ఆ సంవత్సరాన్ని సెలెక్ట్ చేసుకోవాలి. 2023 కి సంబంధించి ప్రస్తుతం 4వ త్రైమాసికం అనగా జూలై -సెప్టెంబర్ 2023 క్వార్టర్ అమౌంట్ రిలీజ్ చేస్తున్నారు కాబట్టి 2023 ఎంచుకోవాలి

studybizz

STEP 6 : క్లిక్ చేసిన తరువాత కిందికి స్క్రోల్ చేయండి. RTF దగ్గర మీ విద్యా దీవెన పేమెంట్ స్టేటస్ చూపిస్తుంది. ఏడాదికి నాలుగు విడతల్లో మీ శాంక్షన్ అమౌంట్ ని ప్రభుత్వం విడుదల చేస్తుంది. అంటే మీ ఫీజ్ అమౌంట్ లో 1/4 వంతు ప్రతి విడత విడుదల చేస్తుంది.

studybizz

Note: స్టేటస్ Approved అని ఉంటె మీకు అమౌంట్ పడుతుంది అయితే సంబంధిత స్టేటస్ success గా మారడానికి 1 లేదా రెండు రోజులు పెట్టె అవకాశం ఉంటుంది. కాబట్టి మీకు ఎలిజిబుల్ ఉంటె బ్యాంక్ బ్యాలన్స్ చెక్ చేసుకోండి.

పాస్వర్డ్ మరిచిపోతే లేదా కొత్తగా రిజిస్టర్ అవ్వాలంటే ఈ విధంగా చేయండి

STEP 1: Forgot Password లింక్ పై క్లిక్ చేయాలి.

studybizz

STEP 2 : లింక్ ఓపెన్ చేసి “Select Your Identity – Student” అని సెలెక్ట్ చేసి , ఆధార్ నెంబర్ ఎంటర్ చేసి , Get “Verification Code” క్లిక్ చేస్తే మీకు “OTP” వస్తుంది.

studybizz

STEP 3: OTP ఎంటర్ చేసాక కొత్త పాస్వర్డ్‌ Create చేసుకోవాలి.

studybizz

కొత్త పాస్వర్డ్ క్రియేట్ అయ్యాక లాగిన్ అయ్యి పైన ఇచ్చిన స్టెప్స్ ఫాలో అయ్యి, స్కాలర్షిప్ , Fee Reimbursement స్టేటస్ చెక్ చేసుకోవచ్చు

Note : RTF అనే చోట మీ విద్యా దీవెన డీటెయిల్స్ ఉంటాయి , MTF అంటే వసతి దీవెన


missed call ద్వారా మీ రిజిస్టర్ మొబైల్ నంబర్ నుంచి మీ బ్యాంక్ బ్యాలెన్స్ వివరాలు తెలుసుకోవడానికి కింది లింక్ పై క్లిక్ చేయండి

విద్యా దీవెన అన్ని లేటెస్ట్ అప్‌డేట్స్ మరియు లింక్స్ కొరకు కింది లింక్ ఫాలో అవ్వండి

You cannot copy content of this page