జగనన్న తోడు పథకం పేరు మార్పు

జగనన్న తోడు పథకం పేరు మార్పు

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి అనేక కీలక నిర్ణయాలు తీసుకుంటున్న విషయం తెలిసిందే అయితే తాజాగా మరో కీలక నిర్ణయం తీసుకుంది.

ఇప్పటికే గత ప్రభుత్వం అమలు చేసిన పథకాల పేరును మారుస్తున్న ప్రభుత్వం తాజాగా మరో పథకం పేరును మారుస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.

గత ప్రభుత్వం చిరు వ్యాపారుల ఆర్థిక అభివృద్ధి కోసం అమలు చేసిన జగనన్న తోడు పథకం పేరును చిరు వ్యాపారులకు సున్నా వడ్డీ రుణాలు గా మారుస్తూ ప్రభుత్వం తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది

ఈ పథకం ద్వారా నిరుపేదలైన చిరు వ్యాపారులు హస్త కళాకారులు సంప్రదాయ చతువృతల వారికి ఏటా పదివేల రూపాయలను వడ్డీ లేకుండా అందించేవారు. ఈ రుణాన్ని సకాలంలో చెల్లించిన వారికి మరో ఏడాది నుంచి వెయ్యి రూపాయలు అదనంగా జోడిస్తూ వడ్డీ లేని రుణం అందించేవారు.

ఈ పథకానికి సంబంధించి తాత్కాలిక షాపులు ఏర్పాటు చేసుకున్న వారు మరియు తోపుడు బండ్లపై వస్తువులు కూరగాయలు పండ్లు ఆహార పదార్థాలు అమ్ముకొని జీవించేవారు ఈ పథకానికి అర్హులుగా ప్రభుత్వం తెలిపిన విషయం తెలిసిందే.

వీరితోపాటు రోడ్ల పక్కన టిఫిన్ సెంటర్లు నిర్వహించేవారు సైకిల్ మోటార్ సైకిల్ ఆటోల పై వ్యాసం వ్యాపారం చేసే వాళ్లకు కూడా సహాయం చేసేవారు.

తాజా ఉత్తర్వులతో కూటమి ప్రభుత్వం కూడా ఈ పథకాన్ని కొనసాగించే ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తుంది దీనిపై త్వరలో మార్గదర్శకాలు మరియు విధానాలు సిద్ధం చేసి పథకం అమలుపై క్లారిటీ ఇవ్వనుంది.

You cannot copy content of this page