PM Kisan: రైతులకు గమనిక.. పీఎం కిసాన్ అమౌంట్ పెంచారా.. బడ్జెట్‌లో కేంద్రం ప్రకటన?

PM Kisan: రైతులకు గమనిక.. పీఎం కిసాన్ అమౌంట్ పెంచారా.. బడ్జెట్‌లో కేంద్రం ప్రకటన?

PM Kisan Scheme: అన్ని వర్గాల వారి కోసం కేంద్ర ప్రభుత్వం ఎన్నో పథకాలను అమలు చేస్తున్న సంగతి తెలిసిందే. వీటిల్లో రైతులకు కోసం పీఎం కిసాన్ పథకాన్ని అమలు చేస్తూ ఉంది. ఇందులో భాగంగా దేశవ్యాప్తంగా.. అర్హులైన లబ్ధిదారులకు పంట పెట్టుబడికి మద్దతు అందించేందుకు ఆర్థిక సాయం అందిస్తుంది. దీని కింద ప్రతి సంవత్సరం భూమి ఉన్న అర్హులైన రైతులకు రూ. 6 వేల చొప్పున అందిస్తుంటుంది. దీనిని ప్రతి 4 నెలలకు ఓసారి 3 విడతల కింద రూ. 2 వేల చొప్పున రైతుల అకౌంట్లలోనే నేరుగా వేస్తోంది. పీఎం కిసాన్ పంట సాయం మొత్తాన్ని రూ. 8 వేలకు పెంచాలనే డిమాండ్ ఎప్పటి నుంచో వినిపిస్తోంది. అయితే.. ఈ బడ్జెట్లో కూడా పెంచుతారని వాదనలు వినిపించాయి.

అయితే జులై 23న ప్రవేశపెట్టిన కేంద్ర బడ్జెట్‌లో రైతులకు నిరాశే ఎదురైంది. పీఎం కిసాన్ స్కీంపై ఎలాంటి ప్రకటనా చేయలేదు. దీంతో ఒక్కొక్కరి అకౌంట్లో ఏటా రూ . 8 వేలు పడతాయనుకుంటే నిరాశే ఎదురైంది. ఈ నగదు మొత్తం పెంపు ప్రతిపాదన ఊసే లేదు.

ఈ స్కీం విషయానికి వస్తే ఇప్పటివరకు 17 విడతల్లో రైతులకు డబ్బులు అందాయి. అంటే మొదటి నుంచి అందుకున్న వారికి చేతికి రూ. 34 వేలు వచ్చాయి. ఇక త్వరలో 18వ విడత డబ్బులు రైతుల అకౌంట్లలో పడనున్నాయి. పీఎం కిసాన్ డబ్బులు పొందాలంటే ఇ- కేవైసీ తప్పనిసరిగా చేయించుకోవాలి. ఇందుకోసం చాలా ఆప్షన్లే ఉన్నాయి. పీఎం కిసాన్ పోర్టల్ లేదా మొబైల్ యాప్ ద్వారా ఓటీపీ బేస్డ్ ఇ- కేవైసీ చేయించుకోవచ్చు. కామన్ సర్వీస్ సెంటర్లలో బయోమెట్రిక్ బేస్డ్ ఇ- కేవైసీ చేసుకోవచ్చు. పీఎం కిసాన్ మొబైల్ యాప్‌లో ఫేస్ అథెంటికేషన్ ద్వారా కేవైసీ ప్రక్రియ పూర్తి చేసుకోవచ్చు.

PM కిసాన్ లబ్ధిదారుని స్టేటస్ 2024 మరియు PM కిసాన్ పెమెంట్ స్టేటస్ ను ఇలా చెక్ చేయండి

క్రింద ఉన్న స్టెప్స్ ను అనుసరించి ఆధార్ కార్డ్ లేదా మొబైల్ నంబర్‌ తో సులభంగా మీ PM కిసాన్ స్టేటస్ ను చెక్ చేయండి

Step 1: దిగువన ఇవ్వబడిన అధికారిక PM-KISAN వెబ్‌సైట్‌కి వెళ్లండి.

Step 2: పైన ఇవ్వబడిన లింక్ క్లిక్ చేసిన తర్వాత మొదటి పేజ్ లోనే మీకు “Know your status” అని కనిపిస్తుంది దాని మీద క్లిక్ చేయండి.



Step 3: క్లిక్ చేసిన తర్వాత కింది విధంగా రిజిస్ట్రేషన్ నెంబర్ అడుగుతుంది. Registration number తెలిస్తే ఎంటర్ చేయండి. తెలియకపోతే కింద ఎలా తెలుసుకోవాలో స్టెప్స్ ఇవ్వబడ్డాయి చెక్ చేయండి.

Step 3.1: మీకు రిజిస్ట్రేషన్ నంబర్ గుర్తులేకపోతే “know your registration number”పై క్లిక్ చేయండి

Step 3.2 : మీరు మొబైల్ నెంబర్ లేదా మీ ఆధార్ నెంబర్ ఉపయోగించి మీ రిజిస్ట్రేషన్ నెంబర్ పొందవచ్చు .. ఏదో ఒకటి ఎంచుకొని ‘Get Mobile OTP’ పైన క్లిక్ చేయండి.

మీ మొబైల్ కి ఒక ఓటిపి వస్తుంది. అది ఎంటర్ చేస్తే మీ రిజిస్ట్రేషన్ నెంబర్ చూపిస్తుంది.

Step 3.3: మీరు మీ మొబైల్ లేదా ఆధార్‌ని నమోదు చేసిన తర్వాత మీరు వివరాలను క్రింది విధంగా చూడవచ్చు, అంటే మీ రిజిస్ట్రేషన్ నంబర్ క్రింది విధంగా చూపబడుతుంది.


Step 4: మీరు రిజిస్ట్రేషన్ నంబర్‌ ను పొందిన తర్వాత, దిగువన ఉన్న విధంగానే ఎంటర్ చేసి, ఆపై captcha కోడ్‌ ను నమోదు చేయండి.



Step 5: వివరాలు ఎంటర్ చేసిన తర్వాత “Get OTP” పై క్లిక్ చేయండి. మీ మొబైల్ కి వచ్చిన ఆరు అంకెల OTP ఎంటర్ చేస్తే మీ వివరాలు కనిపిస్తాయి.


Step 6: మీ PM-KISAN స్టేటస్ మరియు పేమెంట్ వివరాలు దిగువన స్క్రీన్‌ పై చూపించబడతాయి. మీరు డ్రాప్ డౌన్ నుండి మీ మునుపటి మరియు ప్రస్తుత installment ను సెలెక్ట్ చేసుకోవచ్చు అదే విధంగా పేమెంట్ అయిందా లేదా స్టేటస్ కూడా చెక్ చేయవచ్చు.

ఇది FTO ప్రాసెస్ చేయబడిందని చూపిస్తే, PM నిధులను విడుదల చేసిన తర్వాత కొద్ది రోజులకు అమౌంట్ క్రెడిట్ చేయబడుతుంది. మీకు చెల్లింపు అయిన తర్వాత అక్కడ మీ బ్యాంక్ మరియు ఖాతా వివరాలు చూపిస్తాయి.

గమనిక: pm కిసాన్ నిధులను పొందాలంటే EKYC తప్పనిసరి. పైన ఇవ్వబడిన ప్రాసెస్ అనుసరించి మీరు మీ ekyc స్టేటస్ ను కూడా చెక్ చేయవచ్చు. తదనుగుణంగా ఆన్‌లైన్‌లో లేదా సమీపంలోని CSC కేంద్రాల ద్వారా kycని పూర్తి చేయవచ్చు. ekyc ఆన్‌లైన్‌ని పూర్తి చేయడానికి ఇక్కడ క్లిక్ చేయండి

మరిన్ని వివరాల కోసం మీరు PM కిసాన్ హెల్ప్‌లైన్ నంబర్ 155261/011-24300606కు కూడా కాల్ చేయవచ్చు. ధ

You cannot copy content of this page