తెలంగాణ లో నిరుపేదలకు ప్రభుత్వము గుడ్ న్యూస్ తెలిపింది. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి మానిఫెస్టో లో చెప్పిన విధంగా ఆరు గ్యారంటీ పథకాలలో ఒక్కో దానిని అమలు చేస్తూ ఉన్నది. తాజాగా ఆరు గ్యారంటీల్లో భాగంగా హామీగా ఇచ్చిన ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని ఈ నెల 11న కాంగ్రెస్ ప్రభుత్వం ప్రారంభించనుంది.
ఈ పథకంపై విధివిధానాలు, నిబంధనలు తయారు చేయాలని అధికారులను సీఎం రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. స్థలం ఉన్నవారి ఇంటి నిర్మాణానికి రూ.5 లక్షలు, ఇల్లులేని నిరుపేదలకు స్థలంతో పాటు రూ.5 లక్షలు ఇవ్వాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది.