Household Mapping Address Change Process in Andhra Pradesh

Household Mapping Address Change Process in Andhra Pradesh

Household Mapping Migration in Andhra Pradesh

AP Household Mapping లో ఉన్న కుటుంబం చిరునామా మార్చుకోవడాని AP Household Mapping Address Change కి అంటే వారు ఉన్నటువంటి ప్లేస్ నుంచి వేరే ప్లేస్ కు పూర్తి కుటుంబాన్ని మైగ్రేషన్ లేదా చిరునామా లేదా అడ్రస్ మార్చుకోవడానికి ఆప్షన్ అయితే ప్రస్తుతం ఉన్నది  . ఈ ఆప్షన్ ఉన్నప్పుడే  మీరు ప్రస్తుతం ఎక్కడున్నారు  ? ఎక్కడ నుండి ఎక్కడికి మారాలో ? తెలుసుకొని మరి ఆప్షన్ను ఉపయోగించుకొని , మీరు కోరుకున్నటువంటి ప్లేస్ కు AP Household Mapping ను మార్పు చేసుకోండి . 

ఈ AP Household Mapping Migration లో ముఖ్యమైన విషయాలు ఏంటంటే  ఈ ఆప్షన్ ద్వారా కుటుంబంలో  కేవలం ఒక్కరిని సపరేటుగా ఒక ప్రాంతం నుండి ఒక ప్రాంతానికి మైగ్రేషన్ లేదా అడ్రస్ మార్చడానికి కుదరదు మొత్తం కుటుంబాన్ని ఒక ప్రాంతం నుండి ఇంకొక ప్రాంతానికి లేదా ఒకే సచివాలయంలో ఒక క్లస్టర్ నుండి ఇంకొక క్లస్టర్ కు లేదా ఒక జిల్లా నుంచి ఇంకో జిల్లాకు కూడా మార్పు చేసుకోవచ్చు.

AP Household Mapping Migration కొరకు లబ్ధిదారుడు తప్పనిసరిగా వారు ఎక్కడకు మైగ్రేషన్ అవ్వాలి అనుకుంటున్నారో ఆ ప్లేసు ఏ గ్రామ లేదా వార్డు సచివాలయ పరిధికి వస్తుందో అక్కడ మాత్రమే దరఖాస్తు చేసుకోవాలి. అలా కాకుండా ప్రస్తుతం ఎక్కడైతే ఉన్నారో ఆ గ్రామా లేదా వార్డు సచివాలయంలో దరఖాస్తు చేసుకోవడానికి అవ్వదు.

ఈ పోస్టులో AP Household Mapping Migration కొరకు దరఖాస్తు ఎలా చేసుకోవాలి ? దరఖాస్తుకు ఏం కావాలి ? దరఖాస్తు చేసుకునే సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమిటి ? దరఖాస్తు పూర్తి ప్రాసెస్ మరియు సచివాలయం లో ఉన్నటువంటి ప్రాసెస్ లైవ్ ప్రూఫ్ తో చూపిస్తాను చూడండి…

హౌస్ హోల్డ్ మ్యాపింగ్ లో ఎక్కడ ఉన్నారు ?

AP Household Mapping Address Change కు ముందు అసలు కుటుంబం మొత్తం ఏ క్లస్టర్లో ? ఏ సచివాలయంలో ? ఏ మండలం ? ఏ జిల్లాలో ? ఉన్నారో ముందు తెలుసుకోవాలి .  ఆయా వివరాలు ఎక్కడికైతే మైగ్రేషన్ చేస్తారో  అక్కడి సచివాలయ ఉద్యోగుల లాగిన్ లో అడుగుతుంది , కాబట్టి ముందుగా అసలు ఎక్కడున్నారు అనే విషయాన్ని ఎలా తెలుసుకోవాలో ఇప్పుడు చూద్దాం.

AP Household Mapping లో ఎక్కడ ఉన్నారు అని తెలుసుకొనే ఆప్షన్ ప్రస్తుతానికి సిటిజన్స్ కు అవకాశం లేదు  కేవలం గ్రామా లేదా వార్డు సచివాలయ ఉద్యోగుల లాగిన్లు మాత్రమే అవకాశం ఉంది  కావున మీరు ఎక్కడైతే మైగ్రేషన్ అవ్వాలనుకున్నరో అక్కడ గాని లేదా ప్రస్తుతం ఎక్కడైతే ఉన్నారో అక్కడ గాని సచివాలయం అడిగినట్లయితే కుటుంబంలో ఎవరైనా ఒకరి ఆధార్ నెంబర్ ద్వారా AP Household Mapping వివరాలనేవి ఇస్తారు. 

సచివాలయ ఉద్యోగుల లాగిన్ లో హౌస్ మ్యాపింగ్ వివరాలు తెలుసుకునే ప్రాసెస్.

NBM Portal Login అవ్వాలి.

⏬

Scheme Eligiblity Check పై క్లిక్ చేయాలి .

⏬

కుటుంబం లో ఒకరి ఆధార్ నెంబర్ , ఏదైనా ఒక స్కీం , లేటెస్ట్ ఇయర్ సెలెక్ట్ చేసి Get Details పై క్లిక్ చేయాలి .

⏬

 కింద చూపిన విధంగా కుటుంబం ప్రస్తుతం ఏ క్లస్టరు ,ఏ సచివాలయము, ఏ మండలం ,ఏ జిల్లాలో ? ఉన్నారు . కుటుంబంలో ఎంతమంది సభ్యులు ఉన్నారు,  వారి యొక్క ప్రస్తుత లెవెన్ స్టేటస్ ఏంటి  ,ఆరుదశలో ధ్రువీకరణ వివరాలేంటి,  అనే పూర్తి వివరాలు  వస్తాయి ఈ వివరాలను అప్లికేషన్ చేసేవారు ఉంటారో వారు నోట్ చేసుకోవాల్సి ఉంటుంది.

Household Mapping Address / Migration ఎలా చేసుకోవాలి ?

AP Household Mapping Migration లేదా AP Household Mapping Address Change కు అప్లికేషన్ చేయువారు ఎక్కడికైతే వారు మారాలి అనుకుంటున్నారో ఆ యొక్క ప్లేసు ఏ గ్రామా లేదా వార్డు సచివాలయం పరిధిలోకి వస్తుందో అక్కడ మాత్రమే దరఖాస్తు చేసుకోవాలి. 

దరఖాస్తు చేసుకోవడానికి  ఒక పేపర్ పై గ్రామ సచివాలయం అయితే సంబంధిత పంచాయతీ కార్యదర్శి వారికి వార్డు సచివాలయం అయితే వార్డ్ అడ్మిన్ సెక్రటరీ వారికి అడ్రస్ చేస్తూ  “మా యొక్క హౌస్ హోల్డ్ మ్యాపింగ్ ను సచివాలయాల పరిధిలో మ్యాప్ చేయగలరని రిక్వెస్ట్ చేస్తూ , వివరాలన్నీ అనగా కుటుంబ సభ్యుల వివరాలు , వారి యొక్క ఆధార్ నెంబర్లు,  వారి యొక్క పేర్లు  , తో సహా ఏ క్లస్టర్లో , ఏ వీధిలో , హౌస్ మాపింగ్ చేయాలో వివరాలన్నీ కూడా లెటర్లో రాసి,  కుటుంబ పెద్ద సంతకం చేసి” సంబంధిత అధికారులకు ఇవ్వాల్సి ఉంటుంది . 

గ్రామ సచివాలయంలో పంచాయతీ కార్యదర్శి డిజిటల్ అసిస్టెంట్ PSDA  లేదా పంచాయతీ కార్యదర్శి PS వారి లాగిన్ లో అదే వార్డు సచివాలయంలో అయితే వార్డ్ అడ్మిన్ సెక్రటరీ WAS లేదా వార్డ్ ఎడ్యుకేషన్ అండ్ డేటా ప్రాసెసింగ్ సెక్రటరీ WEDPS వారి లాగిన్ లో క్లస్టర్ మైగ్రేషన్  ఆప్షన్ ఉంటుంది  ఆయా అధికారులు కింద తెలిపిన ప్రాసెస్లో క్లస్టర్ మైగ్రేషన్ పూర్తి చేస్తారు.

login AP Seva Portal [ PSDA / WEDPS ]

⏬

Other Services [ PSDA / WEDPS ]

⏬

For PS / WAS Open Old GSWS Portal

⏬

Services [ PS / WAS / PSDA / WEDPS ]

⏬

Click On Household Cluster Migration 

⏬

 ప్రస్తుతం ఎక్కడ ఉన్నారో ఆ యొక్క జిల్లా మండలం సచివాలయం క్లస్టర్, కుటుంబ పెద్ద పేరును సెలెక్ట్ చేసుకుని Get Details పై క్లిక్ చేయాలి.

⏬ ప్లాస్టర్ లో ఉన్న అందరి పేర్లు ఇక్కడ చూపిస్తుంది. ఆధార్ కార్డుకు ఫోను నెంబరు లింకు ఉండి ఫోన్ అందుబాటులో ఉండి ఓటిపి చెప్పగలిగే వారిని సెలెక్ట్ చేసుకుని గెట్ ఓటిపి పై క్లిక్ చేసినట్లయితే ఓటీపీ వస్తుంది ఎంటర్ చేసి సబ్మిట్ చేసినట్లయితే..

⏬

 అని మెసేజ్ చూపిస్తుంది వెంటనే కుటుంబంలో ఉన్న అందరూ కూడా  గతంలో ఉన్న అడ్రస్ నుండి ప్రస్తుతం సచివాలయం అడ్రస్ కు  మార్పు చెందుతారు. 

 హౌస్ మ్యాపింగ్  అడ్రస్ మారిందా లేదా అని ఎలా తెలుసుకోవాలి ?

పైన చెప్పిన విధంగానే  ప్రజలకు సొంతంగా హౌస్ మాపింగ్ మారిందా లేదా అని తెలుసుకునే ఆప్షన్ ఉండదు కానీ సచివాలయ ఉద్యోగుల లాగిన్ లో ఎక్కడ ఉన్నారు అని చెప్పి పైన పోస్ట్ రాశాను కదా అదే ప్రాసెస్లో మరల కుటుంబంలో ఒకరి ఆధార్ నెంబర్ కొడితే వారు ప్రస్తుతం ఏ క్లస్టర్లో ఏ సచివాలయంలో ఏ మండలంలో ఏ జిల్లాలో మ్యాపింగ్ అయి ఉన్నారు తెలుస్తుంది .

You cannot copy content of this page