Har Ghar Tiranga 2024 – ఆగష్టు 9 నుంచి 15 వరకు హర్‌ ఘర్‌ తిరంగా 2024

Har Ghar Tiranga 2024 – ఆగష్టు 9 నుంచి 15 వరకు హర్‌ ఘర్‌ తిరంగా 2024

Har Ghar Tiranga 2024 : భారత దేశ త్రివర్ణ పతాక రూపకర్త పింగళి వెంకయ్య జయంతి సందర్భంగా దేశ ప్రజలకు ప్రధాని నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. త్రివర్ణ పతాకాన్ని ఎగురవేస్తూ సెల్ఫీ తీసుకుని సోషల్‌ మీడియా ఖాతాల్లో అప్‌లోడ్‌ చేయాలని ప్రజలకు ప్రధాని నరేంద్ర మోదీ విజ్ఞప్తి చేశారు. హర్ ఘర్ తిరంగా ఉద్యమానికి మద్దతు ఇవ్వాలని కోరారు. ఆగస్టు 9వ తేదీ నుంచి 15వ తేదీ వరకు త్రివర్ణ పతాకాన్ని ప్రతి ఇంటిపై ఎగురవేయాలని ప్రధాని నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. HarGharTiranga.comలో మీ సెల్ఫీని షేర్ చేయడం మర్చిపోవద్దని పేర్కొన్నారు.

ఇక కేంద్ర మంత్రి అమిత్‌ షా కూడా హర్‌ ఘర్ తిరంగా కోసం ప్రజలకు పిలుపునిచ్చారు. మన జాతీయ జెండా త్రివర్ణ పతాకం త్యాగం, విధేయత మరియు శాంతికి చిహ్నమని చెప్పారు. #HarGharTiranga ప్రచారం స్వాతంత్ర్య వీరులను స్మరించుకోవడమని చెప్పారు. జాతీయ ఐక్యతను పెంపొందించడానికి ఒక మాధ్యమం అని చెప్పారు. ఆగస్టు 9 నుండి 15 వరకు ప్రజలంతా ఇళ్లలో త్రివర్ణ పతాకాన్ని ఎగురవేయాలని పిలుపునిచ్చారు. అలాగే ఆ సెల్ఫీని https://harghartiranga.comలో అప్‌లోడ్ చేయాలని కేంద్ర మంత్రి అమిత్‌షా పేర్కొన్నారు.

స్వాతంత్య్ర దినోత్సవాన్ని జరుపుకోవడానికి ‘హర్ ఘర్ తిరంగ’ ప్రచారంలో పాల్గొనాలని భారతీయులందరికీ పిలుపునిచ్చారు. ఆగస్టు 9 నుంచి ఆగస్టు 15 వరకు ఇళ్లు, కార్యాలయాలు, దుకాణాల్లో జాతీయ జెండాను ఎగురవేసేలా పార్టీ నాయకులు, కార్యకర్తలను కోరారు.

జాతీయ జెండాను రూపొందించిన పింగళి వెంకయ్య జీవిత చరిత్ర కోసం కింద ఉన్న లింకుపై క్లిక్ చెయ్యండి

హర్‌ ఘర్‌ తిరంగా 2024 సెల్ఫీ అప్లోడ్ చేసే విధానం

STEP 1: ముందుగా కింద ఇవ్వబడిన హర్ ఘర్ తిరంగా అధికారిక వెబ్సైటు క్లిక్ చెయ్యండి

Step 2: అధికారిక వెబ్సైటు మీద క్లిక్ చెయ్యగానే పైన చూపించిన విదంగా ఓపెన్ అవుతుంది.తరువాత బటన్ “Take Pledge” పైన క్లిక్ చెయ్యాలి

Step 3: “Take Pledge” పైన క్లిక్ చేసిన తరువాత కింద చూపించిన విదంగా ఓపెన్ అవుతుంది. ఇందులో మీ పేరు, మొబైల్ నెంబర్ మరియు రాష్ట్రం వివరాలను ఎంటర్ చెయ్యండి.

Step 4: మీ వివరాలు ఎంటర్ చేసిన తరువాత “Take Pledge” బటన్ పైన క్లిక్ చెయ్యండి

Step 5: “Take Pledge” బటన్ పైన క్లిక్ చేసిన తరువాత కింద చూపించిన విదంగా ఓపెన్ అవుతుంది. ఇప్పుడు మీరు మీ ఇంటి ఆవరణ లో జెండా తో తీసుకున్న సెల్ఫీ ని అప్లోడ్ చెయ్యండి

Step 6: సెల్ఫీ అప్లోడ్ చేసిన తరువాత మీ సెల్ఫీ కి త్రివర్ణ పతాకం తో జత చేసిన ఇమేజ్ Generate అవుతుంది.సరి చూసుకొని మీకు నచ్చకపోతే “Try Again” బటన్ పైన క్లిక్ చేసి తిరిగి మీ ఫోటో ని అప్లోడ్ చెయ్యవచ్చు

Step 7: మీ ఫోటో అప్లోడ్ చేసిన తరువాత సబ్మిట్ బటన్ పైన క్లిక్ చెయ్యాలి. Submit బటన్ పైన క్లిక్ చేసిన తరువాత మీ త్రివర్ణ పతాకం తో జోడించిన మీ ఫోటో అవుతుంది.

Step 8: మీ ఫోటో డౌన్లోడ్ చేసుకోవడానికి Download Image పైన క్లిక్ చెయ్యాలి

Step 9: పైన క్లిక్ చేతే కింద చూపించిన విధంగా మీ పేరుతో సర్టిఫికెట్ Generate అవుతుంది. సర్టిఫికెట్ మీకు కావాలి అంటే డౌన్లోడ్ చేసుకోవచ్చు. లేదా షేర్ బటన్ పైన చేసి మీ కుటుంబ సభ్యులు మరియు మీ మిత్రులకు షేర్ చెయ్యవచ్చు

You cannot copy content of this page