నేడే గృహ జ్యోతి మరియు గ్యాస్ సిలిండర్ పథకాలు ప్రారంభం

నేడే గృహ జ్యోతి మరియు గ్యాస్ సిలిండర్ పథకాలు ప్రారంభం

రాష్ట్రవ్యాప్తంగా ఆరు గ్యారంటీల అమలు విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం మరో ముందడుగు వేసింది.

ఇప్పటికే ఆరు గ్యారంటీ లలో రెండు పథకాలను ప్రారంభించినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం, ఫిబ్రవరి 27 న మరో రెండు పథకాలకు శ్రీకారం చుట్టనుంది.

రంగారెడ్డి చేవెళ్ల నుంచి మరో రెండు పథకాలు

ఆరు గ్యారెంటీలలో కీలక మైనటువంటి గృహ జ్యోతి పథకం  మరియు గృహలక్ష్మి లో భాగమైన ₹500 కే సిలిండర్ పథకాలను నేడు రంగారెడ్డి జిల్లా చేవెళ్ల సభ నుంచి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రారంభించనున్నారు.

గృహ జ్యోతి: ఈ పథకం ద్వారా రాష్ట్రవ్యాప్తంగా 200 యూనిట్ల వరకు విద్యుత్ వినియోగించే వారందరికీ ప్రభుత్వం ఉచితంగా కరెంట్ అందించనుంది. వీరికి ప్రతినెలా జీరో కరెంటు బిల్లు అమలు చేయనుంది. ఈ పథకానికి అర్హత సాధించాలంటే తప్పనిసరిగా తెలంగాణ నివాసి అయి ఉండి తెల్ల రేషన్ కార్డు కలిగి ఉండాలి.

గృహ లక్ష్మి – ₹500 కే గ్యాస్ సిలిండర్ : ఈ పథకం కింద రాష్ట్ర ప్రభుత్వం 500 కి లబ్ధిదారులకు గ్యాస్ సిలిండర్ ను అందించనుంది. అయితే నగదు బదిలీ రూపంలోనే ఈ పథకాన్ని అమలు చేయనున్నారు. అనగా సిలిండర్ తీసుకునేటప్పుడు పూర్తి అమౌంట్ చెల్లించాల్సి ఉంటుంది, ఆ తర్వాత మీ బ్యాంక్ ఖాతాకి 500 పోను మిగిలిన రాయితీ అమౌంట్ జమ అవుతుంది. ఉదాహరణకు 955 హైదరాబాద్ లో సిలిండర్ ధర ఉంటే అందులో 455 రూపాయలను సబ్సిడీ కింద ప్రభుత్వం మీ ఖాతా కి బదిలీ చేస్తుంది.

పై రెండు పథకాలకు కూడా తెల్ల రేషన్ కార్డు తప్పనిసరి చేయడం జరిగింది.

చేవెళ్ల సభ

రంగారెడ్డి జిల్లా చేవెళ్ల లోని ఫరా కాలేజీలో ఏర్పాటు చేసినటువంటి భారీ బహిరంగ సభ వేదికగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రెండు పథకాలను ఈరోజు ప్రారంభిస్తారు.

You cannot copy content of this page