ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గత ప్రభుత్వం అమలు చేసినటువంటి విద్యా దీవెన వసతి దీవెన పథకాలకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.
ఇకపై ఈ పథకాలను పోస్ట్ మెట్రిక్ స్కాలర్షిప్ పథకాల కింద అమలు చేయనున్నట్లు ఇప్పటికే ప్రకటించిన ప్రభుత్వం. ఇందుకు సంబంధించి మరింత క్లారిటీని ఇచ్చింది.
మంగళవారం ఉన్నత విద్యాశాఖ అధికారులతో సమావేశమైన మంత్రి నారా లోకేష్ విద్యా శాఖపై కీలక సమీక్ష నిర్వహించారు. ఈ నేపథ్యంలో గత ప్రభుత్వము అమలు చేసిన విద్యా దీవెన వసతి దీవెన పథకాల ద్వారా చాలా ఇబ్బందులకు గురయ్యారని ఆయన వెల్లడించారు.
ఈ పథకాలకు సంబంధించి గత ప్రభుత్వం 3480 కోట్ల బకాయిలను పెట్టిందని తద్వారా విద్యార్థులు సర్టిఫికెట్లు పొందేందుకు ఇబ్బందులు పడ్డారని ఆయన వెల్లడించారు.
ఇకపై నేరుగా కళాశాలలకే ఫీజు రియంబర్స్మెంట్
గత టిడిపి హయాంలో అమలు చేసినటువంటి ఫీజు రియంబర్స్మెంట్ విధానాన్ని తిరిగి కొనసాగిస్తామని మంత్రి నారా లోకేష్ వెల్లడించారు. ఇక నేరుగా కళాశాలలకే ఫీజు రీయింబర్స్మెంట్ అమౌంట్ ను జమ చేస్తామని ఆయన తెలిపారు. ఇక పై పూర్తి ఫీజు రీయింబర్స్మెంట్ అమౌంట్ ను రాష్ట్ర ప్రభుత్వం నేరుగా కళాశాలలకు చెల్లిస్తుంది.
పోస్ట్ మెట్రిక్స్ స్కాలర్షిప్ పేరుతో ఈ పథకాన్ని అమలు చేయనున్నట్లు ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. ఇందుకు సంబంధించినటువంటి పూర్తి విధివిధానాలను త్వరలో విడుదల చేయనున్నట్లు సమాచారం. జూలై చివరి వారంలో లేదా ఆగస్టు తొలి వారం నాటికి పూర్తి గైడ్లైన్స్ విడుదల అయ్యే అవకాశం ఉంది.
మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన వాట్సప్ ఛానల్లో జాయిన్ అవ్వండి.