ఆంధ్రప్రదేశ్ లో పాఠశాల విద్యార్థులకు ప్రభుత్వం గుడ్ న్యూస్. ప్రభుత్వ పాఠశాలల్లో 8 వ తరగతి చదువుతున్నటువంటి విద్యార్థులందరి కీ ఎడ్యుకేషన్ కంటెంట్ తో ప్రభుత్వం ట్యాబ్‌లు ఇవ్వనుంది.
డిసెంబరు 21 న ముఖ్యమంత్రి జగన్ పుట్టినరోజు సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా 8వ తరగతి చదువుతున్న 4.34 లక్షల మంది విద్యార్థులకు ఈ ట్యాబులను పంపిణీ చేయనున్నారు.
గత ఏడాది ఎనిమిదో తరగతి విద్యార్థులకు మరియు ఉపాధ్యాయులకు ఉచితంగా ట్యాబ్‌లు పంపిణీ చేసిన విషయం తెలిసిందే. పాఠాలు చెప్పేందుకు వీలుగా ఈ నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వ మరియు అన్ని ఎయిడెడ్ పాఠశాలల్లో ఈ ట్యాబ్‌లు అందిస్తారు. ప్రభుత్వం ఇందుకోసం రూ.620 కోట్లను ఖర్చు చేస్తుంది. 9, 424పాఠశాలల్లోని 4.34 లక్షల మంది విద్యార్థులకు బైజూస్ నుండి కంటెంట్‌తో లోడ్ చేసిన Samsung T220 Lite Tablet PC ని ఇవ్వనున్నారు.
మొదట్లో 8వ తరగతి విద్యార్థులకు మాత్రమే గాడ్జెట్‌లను అందించాలని ప్రతిపాదించగా, ఇప్పుడు ప్రభుత్వ, ఎయిడెడ్ పాఠశాలల్లోని ఉపాధ్యాయులకు కూడా ఈ సౌకర్యాన్ని కేబినెట్ కల్పించింది. విద్యార్థులకు అందించే 256GB మెమరీ కార్డ్‌తో కూడిన ఈ ట్యాబ్‌ను ప్రభుత్వం అందిస్తుంది.
దాదాపు 17,500కు పైగా పార్క్ మార్కెట్ విలువ గల ఒక్కొక్కటి 15,500 విలువ గల బైజుస్ కంటెంట్ తో కలిపి ప్రతి విద్యార్థికి 33 వేల లబ్ధి చేకూరనుంది. ఇప్పుడు ఇచ్చే టాప్స్ తో కలిపి రెండేళ్లలో ఎనిమిదో తరగతి విద్యార్థులకు ఉపాధ్యాయులకు కలిపి 1305.74 కోట్ల విలువైన 9,52,925 ట్యాబ్లను ప్రభుత్వం ఎనిమిదో తరగతి కంటెంట్ను కూడా లోడ్ చేయడం తో పాటు ఇంటర్మీడియట్ కంటెంట్ కూడా అప్లోడ్ చేసేందుకు వీలుగా ట్యాబ్ సామర్థ్యం 256 GB కి పెంచి అందిస్తున్నారు. ఏడాది విద్యార్థులు 5,18,740 ఉపాధ్యాయులకు ట్యాబ్ పంపిణీ చేశారు
ట్యాబ్ లో ఏ కంటెంట్ ఉంటుంది:
- ఫిజిక్స్ , కేమిస్ట్రీ, మాథెమాటిక్స్ , జువాలజీ , బయాలజీ , సివిక్స్ తదితర పాఠాలు ఉంటాయి.
- ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ, మ్యాథ్స్, ఇంగ్లిష్, టోఫెల్ ప్రిపరేషన్లో విద్యార్థుల సందేహాలను నివృత్తి చేసేందుకు జనరేటివ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో పనిచేసే ‘డౌట్ క్లియరెన్స్’ అప్లికేషన్ ఉంది
- విద్యార్థులు సులభంగా విదేశీ భాషలు నేర్చుకునేందుకు వీలుగా ‘డ్యులింగో’ యాప్ను సైతం ఇన్స్టాల్ చేసి, ఆన్లైన్, ఆఫ్లైన్లో సైతం పనిచేసేలా ఏర్పాటుచేశారు.
- ప్రస్తుతం 4 నుంచి 10వ తరగతి వరకు ఉచితంగా అందిస్తున్న రూ.15,500 విలువైన బైజూస్ కంటెంట్ను ఇకపై ఇంటర్మీడియట్ విద్యార్థులకు సైతం అందించనున్నారు.
- యానిమేషన్ , వీడియో ఆడియోలతో ఈ పాఠాలు ఉండనున్నాయి.
- 15000 రూపాయలు విలువ చేసే కంటెంట్ ను లోడ్ చేసి ఇస్తున్నట్లు ప్రభుత్వం తెలిపింది.
- తెలుగు, ఇంగ్లీష్ సహా 8 భాషల్లో ఈ కంటెంట్ అందుబాటులో ఉంచనున్నారు.
- 8 వ తరగతి విద్యార్థులు CBSE విధానంలో పరీక్షలు రాసేలా కంటెంట్.
- ఇంటి వద్ద కూడా సులభంగా చదువుకునేలా వెసులుబాటు
- ట్యాబ్ సంరక్షణకు రగ్డ్ కేస్, టెంపర్డ్ గ్లాస్ వంటి హంగులు
- అవాంఛనీయ సైట్లు, యాప్సున్న నిరోధించే ప్రత్యేక సాఫ్ట్వేర్ రక్షణతో పాటు మూడేళ్ల వారంటీ