Free Gas scheme in Andhra pradesh: ఆంధ్రప్రదేశ్‌లోని మహిళలకు సీఎం నారా చంద్రబాబు నాయుడు శుభవార్త చెప్పారు. దీపావళి నుంచి మరో హామీని అమలు చేయనున్నట్లు ప్రకటించారు. సూపర్ సిక్స్‌లో భాగంగా ఇచ్చిన ఉచిత గ్యాస్ సిలిండర్ పథకం దీపావళి నుంచి ప్రారంభించనున్నట్లు చంద్రబాబు ప్రకటించారు. మంగళగిరిలోని సీకే కన్వెన్షన్‌లో జరిగిన ఎన్డీఏ శాసనసభాపక్ష సమావేశంలో చంద్రబాబు ఈ ప్రకటన చేశారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా అమలు చేస్తామన్న చంద్రబాబు.. సంక్షేమంతో పాటుగా అభివృద్ధి పనులను కూడా చేపడతామని తెలిపారు. మరోవైపు ఏపీ ఎన్నికల ప్రచారం సమయంలో మహాశక్తి పథకం కింద మహిళలకు ఏడాదికి ఉచితంగా మూడు సిలిండర్లు ఇస్తామని ఎన్డీఏ కూటమి హమీ ఇచ్చింది. ఈ హామీని నెరవేరుస్తూ తెల్ల రేషన్ కార్డు ఉన్న కుటుంబాలకు దీపావళి నుంచి ఉచిత గ్యాస్ సిలిండర్ల పథకం ప్రారంభించనుంది.
సూపర్ సిక్స్ హామీల అమలులో భాగంగా ఈ దీపావళి నుంచి, ఉచిత గ్యాస్ సిలిండర్ ఇస్తున్నాం #NaraChandrababuNaidu#AndhraPradesh pic.twitter.com/kvo0ceHzWD
— Telugu Desam Party (@JaiTDP) September 18, 2024
మరోవైపు ఏపీలో టీడీపీ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత జరిగిన మంచిపనులకు క్షేత్రస్థాయిలో ప్రచారం చేయాలని చంద్రబాబు ఎన్డీఏ కూటమి ఎమ్మెల్యేలకు దిశానిర్దేశం చేశారు. ఇందుకోసం ఈ నెల 20 నుంచి 26 వరకూ నియోజకవర్గంలోని ఇంటింటికీ వెళ్లి ప్రజలకు వివరించాలని సూచించారు.
ఉచిత గ్యాస్ సిలిండర్ పథకం అర్హతలు – Free Gas Cylinder scheme Eligibility
ఈ పథకానికి కావాల్సిన అర్హతలు ఈ విధంగా ఉన్నాయి.
✓ లబ్ధిదారుడు ఆంధ్ర ప్రదేశ్ శాశ్వత నివాసి అయి ఉండాలి.
✓ తెల్ల రేషన్ కార్డు కలిగి ఉండాలి.
కావలసిన డాక్యుమెంట్స్: ఆధార్, గ్యాస్ పుస్తకం, బ్యాంక్ పాస్ పుస్తకం, బ్యాంకు కి మరియు గ్యాస్ కనెక్షన్ కి ఆధార్ లింక్ అయి ఉండాలి.