ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని మహిళలకు ముఖ్యమంత్రి గుడ్ న్యూస్ చెప్పారు. ఇప్పటికీ దీపావళి నుంచి ఉచిత గ్యాస్ సిలిండర్ల పథకాన్ని అమలు చేయాలని ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే ఈ పథకం పై తాజాగా ముఖ్యమంత్రి మరో కీలక ప్రకటన చేశారు. ఈ పథకం అమలుకు సంబంధించి సచివాలయంలో రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ మరియు అధికారులు, ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్, భారత్ పెట్రోలియం కార్పొరేషన్, హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ ప్రతినిధులతో చంద్రబాబు సమీక్షజరిపారు
ఎన్నికల సమయంలో ప్రకటించిన సూపర్ సిక్స్ పథకాల అమలుకు కట్టుబడి ఉన్నట్టు ముఖ్యమంత్రి తెలిపారు. దీపావళి నుంచి ఫ్రీ గ్యాస్ సిలిండర్ పథకాన్ని అమలు చేయనున్నట్లు ప్రకటించారు. దీపం పథకంతో ఈ దీపావళి పండుగ వెలుగులు తేవాలని చంద్రబాబు అన్నారు.
రాష్ట్రంలోని ఆర్థిక సమస్యల కారణంగా సంక్షేమ పథకాల అమలుకు కాస్త ఆలస్యం జరుగుతుందని తెలిపారు. అర్హులైన కుటుంబాలకు ఏడాదికి మూడు సిలిండర్లు ఉచితంగా అందించనున్నారు. ప్రతి నాలుగు నెలల రోజులో లబ్ధిదారులు ఎప్పుడైనా ఒక ఉచిత గ్యాస్ సిలిండర్ పొందే విధంగా ఏర్పాట్లు చేస్తున్నట్టు అధికారులకు ముఖ్యమంత్రి వివరించారు.
బుకింగ్ ఎప్పటి నుంచి?
ఈనెల 31 అనగా అక్టోబర్ 31 నుంచి ఈ పథకం ప్రారంభమవుతున్నప్పటికీ బుకింగ్లు అక్టోబర్ 24 నుంచే ప్రారంభించాలని ముఖ్యమంత్రి తెలిపారు. బుకింగ్ చేసుకున్న వారికి అక్టోబర్ 31 నుంచి పంపిణీ మొదలు కానుంది. ఉచిత గ్యాస్ సిలిండర్ పొందిన లబ్ధిదారులకు రెండు రోజుల్లోనే వారి బ్యాంకు ఖాతాలో సబ్సిడీ అమౌంట్ అధికారులను ఆదేశించారు.
అర్హత గల ప్రతి ఒక్కరికి ఉచిత గ్యాస్ సిలిండర్ పథకం లబ్ధి చేకూరేలా అధికారులు చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. ప్రస్తుతం మార్కెట్లో సిలిండర్ ధర 876 గా ఉందని అధికారులు తెలుపగా కేంద్రం వాటా కింద సిలిండర్ కు 25 రూపాయల సబ్సిడీ వస్తుందని తెలిపారు
దీని ద్వారా సిలిండర్ ధర 851 రూపాయలుగా ఉందని వివరించారు. ఏడాదికి మూడు ఉచిత గ్యాస్ సిలిండర్లో అందించడం ద్వారా ప్రభుత్వం పై 2684 కోట్ల భారం పడుతుందని తెలిపారు. ఐదేళ్లకు గాను 13423 కోట్లు ప్రభుత్వం పై భారం పడనుంది