తెలంగాణలో గృహ జ్యోతి పథకం కింద 200 యూనిట్ల వరకు విద్యుత్ వినియోగించుకునే వారికి ప్రభుత్వం పూర్తి రాయితీ ఇస్తున్న విషయం మనకు తెలిసిందే. ఇటీవల ఈ పథకాన్ని లాంఛనంగా ప్రారంభించిన ప్రభుత్వం ఇందుకు సంబంధించిన పలు మార్గదర్చకాలను జారీ చేసింది.
తెలంగాణలో ఉచిత విద్యుత్ కి సంబంధించినటువంటి షరతులు ఇవే
తెలంగాణలో ఉచిత విద్యుత్ కింద షరతులు వర్తించే వారికి మాత్రమే వర్తిస్తుందని తెలంగాణ ప్రభుత్వం స్పష్టం చేసింది.
- ప్రజా పాలనలో గృహ జ్యోతి కింద దరఖాస్తు చేసుకున్న వారికి ప్రస్తుతం ఈ పథకం వర్తిస్తుంది.
- గృహ జ్యోతిలో తెల్ల రేషన్ కార్డ్, విద్యుత్ కనెక్షన్ నెంబర్ మరియు ఆధార్ కార్డు జత చేసిన వారికి అవకాశం.
- 200 యూనిట్లు లోపు వినియోగించుకుంటేనే ఈ పథకం వర్తిస్తుంది. వారికి ప్రభుత్వం జీరో బిల్ జారీ చేస్తుంది.
- ఒకవేళ 200 యూనిట్లు మించితే సదరు ఇంటి యజమాని పూర్తి బిల్లు చెల్లించాల్సి ఉంటుంది.
- కేవలం గృహ వినియోగానికి మాత్రమే ఈ విద్యుత్ వినియోగించుకోవాల్సి ఉంటుంది.
- ఇతర వ్యాపారాలకు లేదా ఇంకా ఏదైనా అవసరాలకు వాడుకున్నట్లయితే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ప్రభుత్వం హెచ్చరించింది.
- అద్దెకున్న కుటుంబాలు కూడా ఈ పథకానికి అర్హులు.
- ఈ పథకం ద్వారా ప్రస్తుతం రాష్ట్రంలో 39.9 లక్షల కుటుంబాలు లబ్ది పొందుతాయి.
- 2024 మార్చి నుంచి లబ్ధిదారులకు జీరో బిల్లులు జారీ చేస్తారు.
మరిన్ని అప్డేట్స్ కోసం మన టెలిగ్రామ్ లో జాయిన్ అవ్వండి.