రేపే రైతు రుణ మాఫీ అమౌంట్ జమ, రేషన్ కార్డు పై క్లారిటీ

రేపే రైతు రుణ మాఫీ అమౌంట్ జమ, రేషన్ కార్డు పై క్లారిటీ

రైతు రుణమాఫీ సంబంధించి ప్రభుత్వం మరింత క్లారిటీ ఇచ్చింది. ప్రభుత్వం ఇటీవల జారీ చేసిన రుణ మాఫీ పై విపక్షాలు పలు సందేహాలు వ్యక్తం చేసిన నేపథ్యంలో ప్రభుత్వం స్పందించింది.

రేషన్ కార్డు లేకున్నా రుణ మాఫీ

రేషన్ కార్డును కేవలం కుటుంబాన్ని గుర్తించేందుకు మాత్రమే పరిగణలోకి తీసుకుంటామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. రేషన్ కార్డు ఉంటేనే రైతు రుణమాఫీ అని విపక్షాలు చేస్తున్న దానిపైన ఆయన క్లారిటీ ఇచ్చారు.

రాష్ట్ర వ్యాప్తంగా 90 లక్షల రేషన్ కార్డులు ఉండగా వారిలో 70 లక్షల మంది రైతులు రుణాలను కలిగి ఉన్నారు. 6.36 లక్షల మందికి రేషన్ కార్డు లేదు. ఇటువంటి వారికి కూడా ఎటువంటి నష్టం జరగకుండా పాస్ బుక్ ఆధారంగా రైతు రుణమాఫీ చేపట్టనున్నట్లు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెల్లడించారు.

రేపే తొలి దశ రుణమాఫీ

రాష్ట్ర ప్రభుత్వం తొలి దశలో భాగంగా లక్ష వరకు రుణాలను తీసుకున్నటువంటి లబ్ధిదారులకు జూలై 18 వ తేదీనే వారి లోన్ ఖాతాలో అమౌంట్ జమ చేయనుంది. ఇక రెండు లక్షల వారికి తర్వాత రెండో దశలో రుణమాఫీ చేస్తారు. అందరికీ ఆగస్టు 15 లోపు పూర్తిగా రుణమాఫీ చేయడం జరుగుతుంది.

రైతు రుణమాఫీకి సంబంధించినటువంటి పూర్తి గైడ్లైన్స్ లో ఇక్కడ క్లిక్ చేసి తెలుసుకోండి.

You cannot copy content of this page