ఏపీలో సంక్షేమ పథకాల నగదు జమపై ఎన్నికల సంఘం నిర్ణయం తీసుకుంది. ఎన్నికల పోలింగ్ ముగిసేవరకు నిధుల జమను వాయిదా వేసింది. ఆంధ్రప్రదేశ్ ఎన్నికల వేళ ప్రభుత్వ పథకాలకు సంబంధించి నగదు విడుదలకు ఎన్నికల సంఘం నో చెప్పింది. ఈ పథకాలకు సంబంధించిన డబ్బుల్ని పోలింగ్ ముగిసిన తర్వాతే లబ్ధిదారుల అకౌంట్లలోకి జమ చేసుకోవాలని సూచించింది.
ఈ మేరకు ఏపీ హైకోర్టుకు ఎన్నికల సంఘం సమాచారం ఇచ్చింది. ఏపీ ప్రభుత్వం దాదాపు రూ.14వేల కోట్లకుపైగా పథకాలకు సంబంధించిన నిధుల విడుదలపై స్క్రీనింగ్ కమిటీ ద్వారా ప్రతిపాదనలు వచ్చాయంది ఈసీ.
అయితే ఈ నగదును లబ్ధిదారుల అకౌంట్లకు చెల్లిస్తే.. ఎన్నికల ప్రక్రియలో కీలకమైన సైలెంట్ పిరియడ్‌కు ఇబ్బంది కలుగుతుందని.. లెవెల్ ప్లేయింగ్ ఫీల్ దెబ్బ తింటుందని తెలిపింది.
ఏపీలో సంక్షేమ పథకాలకు నిధుల జమ ఎందుకు ఆలస్యమైంది?
ఏపీలో సంక్షేమ పథకాల నగదు జమపై ఎన్నికల సంఘం నిర్ణయం తీసుకుంది. పోలింగ్ ముగిసేవరకు నిధుల జమను వాయిదా వేసింది. ఎన్నికల కోడ్‌కు ముందే వివిధ పథకాల కోసం సీఎం జగన్ బటన్ నొక్కారు. ఎన్నికల ముందు లబ్ధిదారుల ఖాతాల్లో సుమారు రూ.14,165 కోట్లు జమ అయ్యేలా వైకాపా ప్రభుత్వం ప్రణాళికలు వేసింది. దీనికి ఈసీ అభ్యంతరం తెలిపింది.
‘‘నిధుల జమ ఎందుకు ఆలస్యమైందో ప్రభుత్వం చెప్పాలి. డీబీటీతో వెంటనే నగదు లబ్ధిదారుల ఖాతాలకు చేరుతున్నా ఎందుకు ఆలస్యమైంది?ప్రచారం ముగిశాక జమ చేసే యత్నం జరుగుతోంది. పోలింగ్‌కు 2 రోజుల ముందువేస్తే కోడ్ ఉల్లంఘనే అవుతుంది’’ అని ఈసీ పేర్కొంది. ఎన్నికలు పూర్తయ్యాకే ఆ నిధులను జమ చేయాలని.. మే 13న పోలింగ్ ముగిసిన తర్వాత దీనిపై మార్గదర్శకాలు ఇస్తామని ఏపీ ప్రభుత్వానికి స్పష్టం చేసింది.