EBC Nestham Release Date 2024: అగ్రవర్ణ OC మహిళలకు గుడ్ న్యూస్. ఆరోజే ఈబిసి నేస్తం అమౌంట్ విడుదల

EBC Nestham Release Date 2024: అగ్రవర్ణ OC మహిళలకు గుడ్ న్యూస్. ఆరోజే ఈబిసి నేస్తం అమౌంట్ విడుదల

EBC Nestham Release Date 2024: ఏపి లో అగ్రవర్ణ కులాలలో ఉండేటటువంటి పేద మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం ఈబీసీ నేస్తం పేరుతో పథకాన్ని అమలు చేస్తున్న విషయం తెలిసిందే.  ఈ పథకం ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా ఉండే అగ్రవర్ణ OC కులాలకు చెందిన మహిళలు ఎవరైతే ఆర్థికంగా వెనుకబడి ఉంటారో వారికి ప్రతి ఏటా 15 వేల రూపాయలను వారి ఖాతాలో రాష్ట్ర ప్రభుత్వం జమ చేస్తుంది.

ఈబీసీ నేస్తం 2024 తేదీ ఎప్పుడంటే? [EBC Nestham Release Date 2024]

ఇందులో భాగంగా 2024 సంవత్సరానికి సంబంధించి వరుసగా నాలుగో ఏడాది అమౌంట్ విడుదల చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు ఈ బీసీ నేస్తం 2024 అమౌంట్ విడుదల తేదీని ప్రకటించడం జరిగింది.

ఈ ఏడాది అనగా 2024 ఈ బీసీ నేస్తం పథకాన్ని మర్చి 14వ తేదీన విడుదల చేయనున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. నంద్యాల జిల్లా బనిగనపల్లి పర్యటనలో భాగంగా ఈ కార్యక్రమాన్ని ప్రారంభించనున్న సీఎం.

EBC Nestham 2024 Release Date: 14 March 2024

ఈ పథకం ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా అగ్రవర్ణ కులాల అయినటువంటి రెడ్డి, కమ్మ, వైశ్య, క్షత్రియ తదితర అగ్రవర్ణ కులాలకు చెందిన మహిళలకు 15వేల రూపాయలను వారి ఖాతాలో రాష్ట్ర ప్రభుత్వం జమ చేస్తుంది.

ఈ పథకానికి అర్హతలు ఏమిటి ? [EBC Nestham Release Date 2024]

  • OC కులాలకు చెంది ఆర్థికంగా వెనక బడిన మహిళలు ఈ పథకానికి అర్హులు
  • 45 నుంచి 60 సంవత్సరాల లోపు వయసు ఉన్నవారు మాత్రమే ఈ పథకానికి అర్హులు
  • కుటుంబంలో ప్రభుత్వ ఉద్యోగులు కానీ ఇన్కమ్ టాక్స్ చెల్లించేవారు గానీ ఉండరాదు. అదేవిధంగా మున్సిపల్ ఏరియాలో 1000 sq ft స్థలం కంటే ఎక్కువ ఉండరాదు.
  • కుటుంబంలో ఎవరికి 4 వీలర్(లేదా కారు) ఉండరాదు.
  • పల్లెల్లో ఉండే వారికి నెలకు 10,000 పట్టణాల్లో ఉండే వారికి నెలకు 12 వేల ఆదాయం మించరాదు.
  • విద్యుత్ బిల్లు ఆరు నెలల వ్యవధి కాలంలో ఏ నెలలో కూడా 300 యూనిట్లు మించరాదు.
  • కాపు సామాజిక వర్గం వారు ఓసి పరిధిలోకి వచ్చినప్పటికీ వారికి ఈ పథకం వర్తించదు. ఎందుకంటే వారికి మరొక పథకం కాపు నేస్తం ఇస్తున్నారు గనుక.

ఇది ఈ బీసీ నేస్తం పథకానికి సంబంధించిన కీలకమైన అప్డేట్.

ఈ పథకానికి సంబంధించి రెగ్యులర్గా అప్డేట్స్ కింది లింక్ ద్వారా పొందవచ్చు.

You cannot copy content of this page