EBC Nestham Payment Status 2024 – ఈబీసీ నేస్తం పేమెంట్ స్టేటస్ చెక్ చేయు విధానం

EBC Nestham Payment Status 2024 – ఈబీసీ నేస్తం పేమెంట్ స్టేటస్ చెక్ చేయు విధానం

EBC Nestham Payment Status 2024: అగ్రవర్ణ కులాలలో ఆర్థికంగా వెనుకబడిన 45 నుంచి 60 ఏళ్ల లోపు మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం EBC నేస్తం పేరుతో ప్రతి ఏటా 15,000 జమ చేస్తున్న విషయం తెలిసిందే.

ఈ పథకానికి సంబంధించి చివరి విడత ఈ నెల అనగా మార్చ్ 14 న (రేపు) నంద్యాల జిల్లా బనగానపల్లి పర్యటనలో భాగంగా ఈబీసీ నేస్తం అమౌంట్ విడుదల చేయనున్న ముఖ్యమంత్రి.

EBC Nestham 2024 Release Date: 14th March 2024.

ఇందుకు సంబంధించి ఈబిసి నేస్తం పథకం లబ్ధిదారుల జాబితా ను ప్రభుత్వం విడుదల చేసింది. కింది ప్రాసెస్ మరియు లింక్ ద్వారా మీ స్టేటస్ వివరాలను చెక్ చేయండి

EBC నేస్తం పేమెంట్ స్టేటస్ చెక్ చేయు విధానము [EBC Nestham Payment Status 2024 Checking Process]

Step 1: ముందుగా కింది లింక్ కి వెళ్లి స్కీం దగ్గర EBC Nestham అని ఎంచుకోండి

Step 2: UID దగ్గర మీ 12 అంకెల ఆధార్ సంఖ్యను ఎంటర్ చేయండి. అదే విధంగా పక్కనే ఉన్న కోడ్ ను యధావిధిగా ఎంటర్ చేయండి

Step 3: తర్వాత GET OTP పైన క్లిక్ చేయండి. Your Aadhar will be authenticated ఒక మెసేజ్ చూపిస్తుంది. OK పైన క్లిక్ చేయండి

Step 4: OTP Sent Successfully అని మెసేజ్ చూపిస్తుంది. OK అని క్లిక్ చేయండి . మీ ఫోన్ కి ఒక OTP వచ్చి ఉంటుంది చెక్ చేయండి

Step 5: మీ ఆధార్ మొబైల్ కి వచ్చిన OTP ను ఎంటర్ చేసి Verify OTP పైన క్లిక్ చేయండి

Step 6: Are you Sure want to verify OTP అని చూపిస్తుంది. OKపైన క్లిక్ చేయండి

Step 7: OTP Verified Successfully అని చూపించి , ఓకే పైన క్లిక్ చేయగానే కింది విధంగా మీ వివరాలు, అప్లికేషన్ వివరాలు ఓపెన్ అవుతాయి .

ebc nestham status

Step 8: పేమెంట్ అమౌంట్ విడుదల కు ముందు మీ పేమెంట్ స్టేటస్ బ్లాంక్ (ఖాళి ) గా చూపించవచ్చు.

పేమెంట్ విడుదల తర్వాత కింది విధంగా Status మారుతుంది. ఏ బ్యాంక్ లో అమౌంట్ పడిందో కూడా చూపుతుంది

EBC నేస్తం గురించి క్లుప్తంగా

ఈ పథకం కింద రాష్ట్రంలో రెడ్డి, కమ్మ, ఆర్య వైశ్య, బ్రాహ్మణ, వెలమ, క్షత్రియులతోపాటు ఇతర ఓసీ సామాజిక వర్గాలకు చెందిన.. 45-60 ఏళ్ల మధ్య ఉన్న ఈబీసీకి చెందిన మహిళలకు ఏటా రూ. 15 వేల చొప్పున ఆర్థిక సాయం అందుతోంది. ఈ పథకం కింద మూడేళల్లో రూ.45 వేలను ఒక్కొక్కరికి అందజేస్తోంది ప్రభుత్వం. గ్రామాల్లో వార్షిక కుటుంబ ఆదాయం నెలకు రూ. 10 వేలు.. అదే పట్టణాల్లో అయితే నెలకు రూ. 12 వేలు పరిమితిని మించకూడదనే నిబంధన ఉంది. ఇక భూమి విషయానికి వస్తే.. మాగాణి భూమి 3 ఎకరాల కన్నా తక్కువగా ఉండాలి.. మెట్ట భూమి 10 ఎకరాల కన్నా తక్కువగా ఉంటేనే ఈ పథకానికి అర్హులు. మాగాణి, మెట్ట భూమి రెండు కలిపి 10 ఎకరాల కన్నా తక్కువగా ఉంటేనే పథకం వర్తిస్తుంది. అలాగే మున్సిపాలిటీలో అయితే 750 చదరపు అడుగుల కన్నా ఎక్కువ స్థలం ఉండకూడదనే నిబంధన ఉంది. పారిశుద్ధ్య కార్మికులు మినహా కుటుంబంలో ఎవరూ ప్రభుత్వం ఉద్యోగి, పింఛన్ తీసుకునేవారు ఉంటే అనర్హులు.

ఈ పథకం పొందాలంటే ఆ కుటుంబంలో ఎవరూ ఐటీ కట్టొద్దు.. ఎవరి పేరు మీద ఫోర్ వీలర్ ఉండకూడదు. ఈ పథకానికి సంబంధించి వయసు 45 నుంచి 60 ఏళ్లు ఉండాలి కాబట్టి వాళ్లు డేట్ ఆఫ్ బర్త్‌‌కు సంబంధించిన పత్రాలు ( టెన్త్ మార్క్స్ మెమో / ఓటర్ ఐడి కార్డ్/ ఇంటిగ్రేటెడ్ సర్టిఫికెట్ / డేట్ అఫ్ బర్త్ సర్టిఫికెట్) ఇవ్వాల్సి ఉంటుంది. అలాగే మరికొన్ని పత్రాలు కూడా ఇవ్వాల్సి వస్తుంది. ఇప్పటికే ఆయా సచివాలయాల్లో లబ్ధిదారుల జాబితాలను ప్రదర్శించారు. ఒకవేళ అర్హత ఉండి కూడా ఎవరికైనా పథకం రాకపోతే దరఖాస్తు చేసుకునేందుకు ప్రభుత్వం మరో అవకాశం ఇస్తోంది.

You cannot copy content of this page