Distribution Points & Distribution Status Work Process in AePDS App for GSWS Volunteers – AePDS యాప్ లో వాలంటీర్లు Distribution Points & Status అప్డేట్ చేయు విధానము

Distribution Points & Distribution Status Work Process in AePDS App for GSWS Volunteers – AePDS యాప్ లో వాలంటీర్లు Distribution Points & Status అప్డేట్ చేయు విధానము

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా గ్రామ వార్డు వాలంటీర్లు ఉపయోగించే AePDS మొబైల్ యాప్ లో తేదీ 20-12-2023 నాడు కొత్తగా Distribution Points & Distribution Status అనే ఆప్షన్ లు ఇవ్వటం జరిగింది. ఈ ఆప్షన్ల ద్వారా MDU వాహనాలు సరుకుల పంపిణీ లొకేషన్ ను మరియు సరుకుల పంపిణీ స్థితిని అప్డేట్ చేయవలసి ఉంటుంది. ఈ పనిని వాలంటీర్లు MDU ఆపరేటరు, VRO వారి సమన్వయంతో చేయవలసి ఉంటుంది.

గ్రామా వార్డు వాలంటీర్లు ఎం చేయాలి ?

  1. MDU ఆపరేటరు VRO వారి సమన్వయంతో వాలంటీర్ క్లస్టర్ పరిధిలో గుర్తించబడిన రేషన్ సరుకుల పంపిణీ స్థానాలను / ప్లేస్ / స్థలాలను  ( Distribution Points ) ఎంటర్ చేయాలి.
  2. గుర్తించబడిన డిస్ట్రిబ్యూషన్ పాయింట్లలో MDU ఆపరేటర్ డిస్ట్రిబ్యూషన్ చేశారా లేదో రిపోర్టు అప్డేట్ చేయాలి.

Distribution Points & Status Update పనులను ఎలా చేయాలి ?

  • గ్రామ వార్డు వాలంటీర్లు ఉపయోగించే AePDS లేదా AP ePOS మొబైల్ యాప్ లో కొత్తగా ఆప్షన్లు ఇవ్వటం జరిగింది. పని మొత్తం ఈ యాప్ లోనే చేయాలి.

Distribution Points & Status Update పనులను ఎక్కడ చేయాలి ?

  • గ్రామా వార్డు వాలంటీర్లు వారి క్లస్టర్ పరిధిలో MDU వాహనాల ద్వారా సరుకుల పంపిణి జరుగు నిర్ణయించిన  స్థలాలలో మాత్రమే యాప్ లో ఈ వర్క్ పూర్తి చెయ్యాలి .వేరే చోటా  సచివాలయం లో ఉంది చెయ్యకూడదు .

కొత్త AePDS యాప్ ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి ?

  • వాలంటీర్లు అందరూ కింద ఇవ్వబడిన లింకు ద్వారా పైన చెప్పిన ఆప్షన్లు ఇవ్వబడిన మొబైల్ యాప్ ను డౌన్లోడ్ చేసుకోగలరు.

Distribution Points & Distribution Status అప్డేట్ చేయు విధానం :

Step 1 : ముందుగా వాలంటీర్ల మొబైల్ లో ఉన్నటువంటి పాత AePDS – AP యాప్ డిలీట్ చేసి పైన ఇవ్వబడిన లింకు ద్వారా కొత్త యాప్ డౌన్లోడ్ చేసుకోవలెను. వాలంటీర్ల క్లస్టర్ ఐడి ( సచివాలయం కోడు + క్లస్టర్ నెంబరు )ఎంటర్ చేసి బయోమెట్రిక్ ద్వారా లాగిన్ అవ్వాలి. 

Distribution Points కాప్చర్ చేయు విధానం

Step 2 : లాగిన్ అయిన తరువాత కింద చూపిన విధంగా Home Page లో Distribution Points & Distribution Status అనే ఆప్షన్ లు చూపిస్తాయి. అందులో Distribution Points అనే ఆప్షన్ పై క్లిక్ చేయాలి.

వెంటనే కింద చూపిన విధంగా పేజీ ఓపెన్ అవుతుంది.

  • Day of Distribution : వాలంటీరు తమ క్లస్టర్లో డిస్ట్రిబ్యూషన్ జరిగే తేదీ ఎంటర్ చేయాలి. నెలలో ఒకటవ తారీఖు నుండి 17వ తారీఖు లోపు ఏది ఎంటర్ చేయాలి.
  • Location Name : గుర్తించబడిన డిస్ట్రిబ్యూషన్ పాయింట్ పేరు ఎంటర్ చేయాలి. అంటే బండి ఎక్కడ ఆగే సరుకులు ఇస్తుందో ఆగే ప్లేస్ పేరు ఎంటర్ చేయాలి.
  • Mobile Numer : పైన ఎంటర్ చేసిన డిస్ట్రిబ్యూషన్ పాయింట్ లో రేషన్ తీసుకుని ఎవరైనా ఒక రైస్ కార్డు దారుని మొబైల్ నెంబర్ ఎంటర్ చేయాలి.
  • Capture Location : ఫోన్లో లొకేషన్ ఆన్ చేసుకొని ఇక్కడ క్లిక్ చేయాలి.

పై విధంగా వాలంటరీ క్లస్టర్లో గుర్తించబడిన అన్ని డిస్ట్రిబ్యూషన్ పాయింట్స్ లో ఎంటర్ చేయాలి. అలా అన్ని పాయింట్లను యాడ్ చేయుటకు గాను CLICK TO ADD MORE LOCATIONS  బటన్ పై క్లిక్ చేయాలి. ఈ విధముగా VRO మరియు MDU ఆపరేటర్స్ సమన్వయంతో డిస్ట్రిబ్యూషన్ పాయింట్లను ఎంటర్ చేయాలి. వాలంటీర్ తన క్లస్టర్ పరిధిలో డిస్ట్రిబ్యూషన్ పాయింట్స్ మొత్తం ఎంటర్ చేసిన తర్వాత SUBMIT బటన్ పై క్లిక్ చేయాలి.తరువాత కింద చూపిన విధముగా Successfully captured data అని వస్తుంది OK పై క్లిక్ చేయాలి. 

వాలంటీర్లకు ముఖ్య గమనిక : ప్రతి డిస్ట్రిబ్యూషన్ పాయింట్ వద్ద లొకేషన్ వివరాలు మొబైల్ నుండి తీసుకోవడం జరుగుతుంది కనుక డిస్ట్రిబ్యూషన్ పాయింట్ ఎంటర్ చేసే సమయంలో మొబైల్ ను డిస్ట్రిబ్యూషన్ పాయింట్ దగ్గరకు వెళ్లి Location ON చేసి మాత్రమే ఎంటర్ చేయవలెను.

Distribution Status రిపోర్ట్ చేయు విధానం

ఈ ఆప్షనును వాలంటీర్లు తన క్లస్టరులో గుర్తించబడిన డిస్ట్రిబ్యూషన్ పాయింట్లలో MDU ఆపరేటర్ డిస్ట్రిబ్యూషన్ చేసారో లేదో రిపోర్ట్ చేయడానికి ఇవ్వడమైనది.

Step 3 : దీని కోసం ముందుగా కింద చూపిన విధంగా Distribution Status అని ఉన్న ఐకాన్ పై క్లిక్ చేయాలి.

వాలంటీర్ తన క్లస్టరులో డిస్ట్రిబ్యూషన్ జరుగుతున్న సమయంలో MDU తో ఉండి డిస్ట్రిబ్యూషన్ అన్ని డిస్ట్రిబ్యూషన్ పాయింట్స్ లో డిస్ట్రిబ్యూషన్ జరుగుతున్నట్లు చూడవలెను. కింద చూపిన విధముగా వాలంటీర్ క్లస్టర్ పరిధిలోని ముందుగా ఇవ్వబడిన అన్ని పాయింట్ల ( రేషను ఇవ్వబడు స్థలముల పేర్లు ) పేర్లను చూపిస్తుంది. డిస్ట్రిబ్యూషన్ ఎక్కడ ఎక్కడ జరుగుతుందో వాటి పక్కన ఉన్న చెక్ బాక్స్ పై టిక్ చేసినట్లయితే లొకేషన్ తీసుకోవడం జరుగుతుంది. వాలంటీరు వారి క్లస్టర్ పరిధిలో డిస్ట్రిబ్యూషన్ జరుగు సమయంలో TAKE PICTURE అనే ఆప్షన్ పై క్లిక్ చేసి ఒక ఫోటో తీసి అప్లోడ్ చేయాలి. చివరగా SUBMIT పై క్లిక్ చేయాలి.

డిస్ట్రిబ్యూషన్ స్టేటస్ డీటెయిల్స్ అన్ని వాలంటీర్ ఎంటర్ చేసి సబ్మిట్ బటన్ పై నొక్కినట్లయితే కింద చూపిన విధముగా Successfully Captured Data మెసేజ్ చూపిస్తుంది.

 ఇంతటితో వాలంటీర్ వారు చేయవలసిన పని పూర్తి అవుతుంది.

You cannot copy content of this page