Dasara Holidays 2024: తెలంగాణ లో 13 రోజుల దసరా సెలవులు

Dasara Holidays 2024: తెలంగాణ లో 13 రోజుల దసరా సెలవులు

తెలంగాణ రాష్ట్రంలోని పాఠశాలలకు రాష్ట్ర విద్యా శాఖ దసరా సెలవులను ప్రకటించింది. 2024 దసరా సెలవులకు సంబంధించి ప్రభుత్వం కీలక ఉత్తర్వులు జారీ చేసింది.

అక్టోబర్ 2 నుంచి 14 వరకు దసరా సెలవులు (Dasara Holidays 2024 Telangana)రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. రాష్ట్రవ్యాప్తంగా ఉన్నటువంటి పాఠశాలలకు ఇది వర్తిస్తుంది. స్కూల్స్ తిరిగి అక్టోబర్ 15న ప్రారంభం కానున్నాయి.

ఈ ఏడాది మొత్తం 13 రోజుల సెలవులను రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. దసరా నవరాత్రులు అక్టోబర్ 3న ప్రారంభం కానున్నాయి. అక్టోబర్ 12న విజయ దశమి అనగా దసరా పండుగ జరుపుకుంటాము.

ఈసారి రెండు తెలుగు రాష్ట్రాలు ఒకే షెడ్యూల్ ను ప్రకటించాయి. రెండు రాష్ట్రాలలో కూడా 13 రోజుల సెలవులను ఆయా ప్రభుత్వాలు ప్రకటించాయి.

You cannot copy content of this page