ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో బిపిఎల్ కుటుంబాలు అనగా తెల్ల రేషన్ కార్డు కలిగినటువంటి కుటుంబాలలో కుటుంబ పెద్ద లేదా సంపాదించే వ్యక్తి చనిపోతే చంద్రన్న బీమా పథకం ద్వారా వారికి ఆర్థిక సహాయం ప్రభుత్వం చేయడం జరుగుతుంది.
ఈ పథకానికి సంబంధించి ప్రస్తుతం సహజ మరణానికి లక్ష రూపాయలు, ప్రమాదవశాత్తు మరణిస్తే ఐదు లక్షల రూపాయలు, పూర్తి అంగవైకల్యం చెందితే 5 లక్షల రూపాయలు, పాక్షికంగా వైకల్యానికి రెండున్నర లక్ష ప్రభుత్వం చంద్రన్న బీమా పథకం కింద ప్రస్తుతం అందిస్తుంది.
వచ్చే ఆర్థిక సంవత్సరం నుంచి సహజ మరణానికి ఐదు లక్షల రూపాయలు ప్రమాదవశాత్తు మరణిస్తే లేదా పూర్తి వైకల్యం చెందితే పది లక్షల రూపాయలు ప్రభుత్వం అందించనుంది.
మరి ఈ చంద్రన్న బీమా పథకానికి సంబంధించి ఎన్రోల్ అయినటువంటి వారు, తమ స్టేటస్ ని ఎలా చెక్ చేసుకోవచ్చు ఇప్పుడు తెలుసుకుందాం.
Step 1: ముందుగా ఇక్కడ ఇవ్వబడినటువంటి లింక్ పై క్లిక్ చేయండి. Click Here
Step 2: క్లిక్ చేసిన తర్వాత మీకు కింది విధంగా స్క్రీన్ కనిపిస్తుంది. మీరు 2023-24 లేటెస్ట్ సంవత్సరాన్ని క్లిక్ చేయండి.
Step 3: ఆ తర్వాత మీకు కింది విధంగా మూడు ఆప్షన్లు ఉంటాయి. Aadhar లేదా Rice Card లేదా మీ జిల్లా మండలం సచివాలయం మీ పేరుతో నేరుగా వెతికే ఆప్షన్ ఉంటుంది.
Step 4: ఆధార్ నంబర్ ఎంచుకుంటే ఆధార్ నెంబర్ ఎంటర్ చేసి Get Details పైన క్లిక్ చేయండి. లేదా రైస్ కార్డు నెంబర్ పెంచుకుంటే రైస్ కార్డు నెంబర్ ఎంటర్ చేసి గేట్ డీటెయిల్స్ పైన క్లిక్ చేయండి. ఒకవేళ మీరు మూడో ఆప్షన్ ఎంచుకుంటే అన్ని వివరాలు ఎంటర్ చేసి సెర్చ్ పైన క్లిక్ చేయండి. మూడు స్క్రీన్స్ కింద ఇవ్వబడ్డాయి.
Step 5: కింది విధంగా మీ బీమా స్టేటస్ ఓపెన్ అవుతుంది. చంద్రన్న బీమా కి ఎన్రోల్ అయిన కుటుంబ పెద్ద పేరు, వారికి ఏమైనా అయితే అమౌంట్ వచ్చేటటువంటి నామిని పేరు మరియు అడ్రస్ ఎంత అమౌంట్ వస్తుంది (Claim Benefits) అనే వివరాలను క్లియర్గా చూడవచ్చు.
చంద్రన్న బీమా ప్రస్తుతం ఇస్తున్న అమౌంట్ వచ్చే ఆర్థిక సంవత్సరానికి మారిపోనుంది. వచ్చే ఆర్థిక సంవత్సరం నుంచి సహజ మరణానికి ఐదు లక్షలు, ప్రమాదవశాత్తు మరణించినా లేదా పూర్తి అంగ వైకల్యం కలిగిన 10 లక్షలు బీమా వర్తిస్తుంది.